Renault Duster : 2026 రెనాల్ట్ డస్టర్ బుక్ చేశారా? ఇదిగో లేటెస్ట్ అప్డేట్..
భారత మార్కెట్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్‌ని సరికొత్త అవతారంలో సంస్థ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రీ-బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు ఒక అప్డేట్ ఉంది. అదేంటంటే..
రెనాల్ట్ ఇండియా తన మోస్ట్ పాపులర్ ఎస్యూవీ ‘డస్టర్’ కొత్త తరం మోడల్‌ను ఇటీవలే ఆవిష్కరించిన విషయం తెలిసిందే. సరికొత్త డిజైన్, అప్‌డేటెడ్ క్యాబిన్, విభిన్న ఇంజిన్ ఆప్షన్లతో ఈ లెజెండరీ ఫ్యామిలీ ఎస్యూవీ భారత రోడ్డుపైకి తిరిగి రాబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఈ ఎస్‌యూవీకి సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ ఉంది.
2026 రెనాల్ట్ డస్టర్- బుకింగ్స్, బెనిఫిట్స్..
2026 రెనాల్ట్ డస్టర్ ఇప్పుడు డీలర్షిప్ షోరూమ్స్‌కి చేరుకుంటోంది. షోరూమ్స్‌లో ఈ ఎస్‌యూవీని ప్రదర్శనకు పెడుతున్నారు.
ఇక ఆసక్తి గల వినియోగదారులు రూ. 21,000 చెల్లించి ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న వారికి 'ప్రయారిటీ డెలివరీ', 'ఇంట్రడక్టరీ ప్రైసింగ్' (ప్రారంభ ధరలు), ప్రత్యేకమైన 'గ్యాంగ్ ఆఫ్ డస్టర్' మెర్చండైజ్ వంటి ఆకర్షణీయమైన ప్రయోజనాలను కంపెనీ వాగ్దానం చేస్తోంది.
2026 రెనాల్ట్ డస్టర్ డిజైన్: పాత జ్ఞాపకాలు.. మోడ్రన్ హంగులు!
కొత్త తరం డస్టర్ గ్లోబల్ థర్డ్-జనరేషన్ మోడల్ ఆధారంగా రూపొందినప్పటికీ, భారత్ కోసం ప్రత్యేకమైన స్టైలింగ్ మార్పులు చేశారు.
ముందు భాగం: ఐబ్రో స్టైల్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ, ఇవే టర్న్ ఇండికేటర్లుగా కూడా పనిచేస్తాయి.
లుక్: రెనాల్ట్ డస్టర్ బ్యాడ్జింగ్‌తో కూడిన రీ-డిజైన్ చేసిన గ్రిల్, మొదటి తరం డస్టర్‌ను గుర్తుకు తెచ్చేలా సిల్వర్ హైలైట్స్‌తో కూడిన బంపర్ దీనికి మరింత గంభీరమైన రూపాన్ని ఇచ్చాయి. పిక్సెల్ ఆకారంలో ఉండే ఫాగ్ ల్యాంప్స్ దీనికి మోడ్రన్ టచ్‌ను జోడించాయి.
2026 రెనాల్ట్ డస్టర్- ప్రీమియం ఇంటీరియర్, టెక్నాలజీ..
కారు లోపలి భాగం పూర్తిగా అప్‌డేట్ అయ్యిందనే చెప్పుకోవాలి. టెక్నాలజీకి ప్రాధాన్యతనిస్తూ లగ్జరీ ఫీచర్లను జోడించారు:
ఫీచర్లు: ఈ ఫ్యామిసీ ఎస్‌యూవీలో పియానో బ్లాక్ యాక్సెంట్స్‌తో కూడిన త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి.
సౌకర్యాలు: టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌లు, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఫాక్స్ కార్బన్-ఫైబర్ డీటెయిలింగ్ క్యాబిన్‌కు ప్రీమియం లుక్ ఇస్తాయి.
2026 రెనాల్ట్ డస్టర్- పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు..
భారత మార్కెట్ కోసం డస్టర్ ఎస్‌యూవీలో రెనాల్ట్ నాలుగు రకాల ఇంజిన్ వేరియంట్లను సిద్ధం చేసింది:
1.8-లీటర్ హైబ్రిడ్ (ఈ-టెక్ 160): ఫోర్-సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది. ఇది 160 బీహెచ్పీ పవర్, 172 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
1.3-లీటర్ టర్బో-పెట్రోల్ (టీసీఈ 160): 160 బీహెచ్పీ పవర్, 280 ఎన్ఎం టార్క్. ఇది 6-స్పీడ్ మాన్యువల్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.
1.3-లీటర్ టర్బో-పెట్రోల్: ఇది 163 బీహెచ్పీ పవర్, 280 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.
1.0-లీటర్ టర్బో-పెట్రోల్ (టీసీఈ 100): కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ ఇంజిన్ 100 బీహెచ్పీ పవర్, 160 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది.
2026 రెనాల్ట్ డస్టర్- ధర, డెలివరీ వివరాలు ఇలా..
కొత్త డస్టర్ అధికారిక ధరలను 2026 మార్చి మధ్యలో వెల్లడించనున్నారు. టర్బో-పెట్రోల్ వేరియంట్ల డెలివరీలు అదే సమయంలో ప్రారంభం కాగా, హైబ్రిడ్ వెర్షన్లు 2026 దీపావళి నాటికి రోడ్లపైకి రానున్నాయి.
మరి మీరు రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీని బుక్ చేసుకున్నారా?
ప్రశ్నలు- సమాధానాలు:-
ప్రశ్న 1: కొత్త రెనాల్ట్ డస్టర్‌లో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ అందుబాటులో ఉందా?
సమాధానం: లేదు, కొత్త తరం డస్టర్‌లో రెనాల్ట్ డీజిల్ ఇంజిన్‌ను అందించడం లేదు. దానికి బదులుగా అత్యంత శక్తివంతమైన 1.8-లీటర్ హైబ్రిడ్ (ఈ-టెక్ 160), 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లను ప్రవేశపెట్టింది. డీజిల్ ఇంజిన్ ఇచ్చే మైలేజీ, టార్క్‌ను ఈ హైబ్రిడ్ వెర్షన్ భర్తీ చేస్తుందని కంపెనీ భావిస్తోంది.
ప్రశ్న 2: ‘గ్యాంగ్ ఆఫ్ డస్టర్’ ప్రయోజనాలు ఎవరికి లభిస్తాయి?
సమాధానం: కొత్త డస్టర్‌ను ముందుగా (ప్రీ బుక్) బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. వీరికి కేవలం ప్రాధాన్యత క్రమంలో డెలివరీ మాత్రమే కాకుండా, రెనాల్ట్ అందించే ఎక్స్‌క్లూజివ్ 'గ్యాంగ్ ఆఫ్ డస్టర్' మెర్చండైజ్ (టీ-షర్ట్స్, బ్యాగ్‌లు మొదలైనవి), ఇంట్రొడక్టరీ ప్రైజింగ్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


