...
...
Next Story

SUV : డస్టర్​ వర్సెస్​ క్రెటా వర్సెస్​ గ్రాండ్​ విటారా- ఏ ఎస్​యూవీ ధర తక్కువ?

SUVs under 20 lakh : భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ఆదరణ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్​లో ఇప్పుడు పోటీ మరింత పెరిగింది. కొత్త తరం 'రెనాల్ట్ డస్టర్' రాకతో హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఈ మూడు కార్ల ఇంజన్ సామర్థ్యం, పవర్, ప్రత్యేకతలపై ఒక లుక్కేయండి..

Published on: Mar 18, 2026, 09:10:53 IST
Advertisement

2026లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం యుద్ధభూమిని తలపిస్తోంది. ఒకప్పుడు ఈ సెగ్మెంట్‌లో రారాజుగా వెలిగిన రెనాల్ట్ డస్టర్ సరికొత్త అవతారంలో మళ్లీ రంగంలోకి దిగింది. ఇప్పటికే మార్కెట్​ను ఏలుతున్న హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాలకు చెక్ పెట్టేలా తన వ్యూహాలను సిద్ధం చేసుకుంది. మరి ఈ మూడు ఎస్​యూవీల్లో దేని ధర తక్కువ? దేనికి మంచి పెర్ఫార్మెన్స్​ ఉంది? ఇక్కడ తెలుసుకోండి..

1. కొత్త రెనాల్ట్ డస్టర్: పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్..

డస్టర్​ వర్సెస్​ క్రెటా వర్సెస్​ గ్రాండ్​ విటారా
డస్టర్​ వర్సెస్​ క్రెటా వర్సెస్​ గ్రాండ్​ విటారా

కొత్త డస్టర్ ప్రధానంగా టర్బో-పెట్రోల్ ఇంజన్లపై దృష్టి సారించింది.

Turbo TCe 100: ఇది 1.0 లీటర్ టర్బో ఇంజన్‌తో వస్తుంది (99 బీహెచ్​పీ, 160 ఎన్​ఎం). కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

Turbo TCe 160: ఇది శక్తివంతమైన 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (163 బీహెచ్​పీ, 280 ఎన్​ఎం). ఇందులో మాన్యువల్, డీసీటీ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి. ఎకో, కంఫర్ట్, పెర్సో అనే డ్రైవింగ్ మోడ్లు దీని ప్రత్యేకం.

ఫ్యూచర్ ప్లాన్: మైలేజీ కోరుకునే వారి కోసం త్వరలో 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ను రెనాల్ట్ తీసుకురానుంది.

రెనాల్ట్​ డస్టర్​ ఎక్స్​షోరూం ధరలు..

Powertrain

Authentic

Evolution

Techno

Techno+

Iconic

Turbo TCe 100 MT ₹10.49 lakh ₹11.69 lakh ₹13.49 lakh––
Turbo TCe 160 MT– ₹12.99 lakh ₹14.49 lakh ₹15.29 lakh ₹16.99 lakh
Turbo TCe 160 DCT– ₹14.49 lakh ₹15.89 lakh ₹16.69 lakh ₹18.49 lakh

2. హ్యుందాయ్ క్రెటా: అందరికీ అన్ని ఆప్షన్లు..

1.5లీటర్​ పెట్రోల్: సాధారణ సిటీ డ్రైవింగ్ కోసం 113 బీహెచ్​పీ పవర్‌ను ఇచ్చే ఈ ఇంజన్ మాన్యువల్/ఐవీటీ ఆప్షన్లలో ఉంది.

1.5లీటర్ డీజిల్: లాంగ్ జర్నీలు చేసే వారి కోసం 114 బీహెచ్​పీ పవర్, 250 ఎన్​ఎం టార్క్‌తో డీజిల్ వేరియంట్ అందుబాటులో ఉంది.

1.5L టర్బో పెట్రోల్: వేగాన్ని ఇష్టపడే వారికోసం 158 బీహెచ్​పీ పవర్‌తో 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో ఇది వస్తుంది.

హ్యుందాయ్​ క్రెటా ఎక్స్​షోరూం ధరలు..

Powertrain

Price Range

1.5 NA petrol MT ₹11.10 lakh – ₹17.41 lakh
1.5 NA petrol IVT ₹13.94 lakh – ₹17.37 lakh
1.5 turbo-petrol DCT ₹19.90 lakh – ₹20.05 lakh
1.5 diesel MT ₹12.40 lakh – ₹18.94 lakh
1.5 diesel AT ₹17.12 lakh – ₹20.05 lakh

3. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా: మైలేజీయే ప్రాణం..

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా తన మార్క్ మైలేజీ, హైబ్రిడ్ టెక్నాలజీతో దూసుకుపోతోంది.

స్ట్రాంగ్ హైబ్రిడ్: 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ + ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్‌తో వస్తుంది. ఇది అత్యుత్తమ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.

ఏడబ్ల్యూడీ ఆప్షన్: ఈ సెగ్మెంట్‌లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఇస్తున్న అతికొద్ది కార్లలో ఇది ఒకటి.

సీఎన్జీ వేరియంట్: తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారి కోసం మారుతి సీఎన్జీ వెర్షన్‌ను కూడా అందుబాటులో ఉంచింది.

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎక్స్​షోరూం ధరలు..

Powertrain

Price Range

1.5 NA petrol MT ₹10.76 lakh – ₹15.93 lakh
1.5 NA petrol AT ₹15.20 lakh – ₹18.73 lakh
1.5 strong hybrid e-CVT ₹16.63 lakh – ₹19.71 lakh
1.5 petrol-CNG MT ₹12.99 lakh – ₹14.75 lakh

రెనాల్ట్​ డస్టర్​ వర్సెస్​ హ్యుందాయ్​ క్రెటా వర్సెస్​ గ్రాండ్​ విటారా- ధరల వ్యత్యాసం..

Powertrain Type

Renault Duster

Hyundai Creta

Grand Vitara

Entry petrol MT ₹10.49 lakh ₹11.10 lakh ₹10.76 lakh
Mid petrol MT ₹12.99– ₹14.49 lakh ₹11.10– ₹17.41 lakh ₹10.76– ₹15.93 lakh
Petrol automatic ₹14.49– ₹18.49 lakh (DCT) ₹13.94– ₹20.05 lakh ₹15.20– ₹18.73 lakh
Turbo-petrol ₹12.99– ₹18.49 lakh ₹19.90– ₹20.05 lakhNA
DieselNA ₹12.40– ₹20.05 lakhNA
Strong hybridNANA ₹16.63– ₹19.71 lakh
CNGNANA ₹12.99– ₹14.75 lakh

ఏది ఎవరికి?

మీకు పవర్ కావాలంటే రెనాల్ట్ డస్టర్ బెస్ట్ ఛాయిస్. అన్ని రకాల ఇంజన్ ఆప్షన్లు, ఫీచర్లు కావాలనుకుంటే హ్యుందాయ్ క్రెటా సేఫ్ బెట్. అదే మీరు మైలేజీకి ప్రాధాన్యత ఇచ్చి, మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలని కోరుకుంటే మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వైపు చూడొచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks