RRB ALP Recruitment 2026 : నిరుద్యోగులకు అలర్ట్- ఆర్ఆర్బీ ఏఎల్‌పీ అప్లికేషన్‌కి ఇంకొన్ని రోజులే ఛాన్స్..
RRB ALP Recruitment : భారతీయ రైల్వేలో కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు అలర్ట్. 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఇంకో రెండు రోజుల్లో ముగియనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రైల్వే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఎదురుచూస్తున్న దేశంలోని నిరుద్యోగులకు అలర్ట్! భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీ కోసం చేపట్టిన రిక్రూట్‌మెంట్‌లోని రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ ఆర్ఆర్బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2026 (CEN 01/2026)' ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 11,127 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవెల్-2 కింద నెలకు రూ. 19,900 ప్రారంభ ప్రాథమిక వేతనంతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు లభిస్తాయి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 15, 2026న అధికారికంగా ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 14, 2026 రాత్రి 11:59 గంటల లోపు రైల్వే శాఖ అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.
ఆర్ఆర్బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు ఇవే..
నోటిఫికేషన్ విడుదల తేదీ: మార్చి 21, 2026
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: మే 15, 2026
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: జూన్ 14, 2026 (రాత్రి 11:59 గంటల వరకు)
ఆర్ఆర్బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2026- అర్హత ప్రమాణాలు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిర్దేశిత అర్హతలను కలిగి ఉండాలి.
విద్యా అర్హతలు, మెడికల్ స్టాండర్డ్స్:
ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి స్థాయి విద్యా అర్హతలు, సాంకేతిక అర్హతలు, వైద్య ప్రమాణాల వివరాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు తమ అధికారిక వెబ్‌సైట్లలో పొందుపరిచిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ (CEN No. 01/2026) లో స్పష్టంగా వివరించాయి. సాధారణంగా ఐటీఐ, డిప్లొమా లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులుగా ఉంటారు.
వయోపరిమితి :
జులై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కింది విధంగా ఉండాలి:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు (పీడబ్ల్యూబీడీ) వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఆర్ఆర్బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2026- జీతం, ఇతర ప్రయోజనాలు..
రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్‌గా ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలు అందుతాయి.
పే స్కేల్: లెవెల్-2 (7వ వేతన సంఘం ప్రకారం)
ప్రారంభ బేసిక్ పే: నెలకు రూ. 19,900
రైల్వే నిబంధనల ప్రకారం లభించే డీఏ, హెచ్‌ఆర్‌ఏ, రన్నింగ్ అలవెన్స్ వంటి ఇతర భత్యాలు అదనంగా లభిస్తాయి.
ఆర్ఆర్బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2026- ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి!
ఆర్ఆర్బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే ముందు అభ్యర్థులు తమ ఆధార్ వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రత్యేకంగా సూచించింది. ఆధార్ కార్డులో ఉన్న అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ వివరాలు.. టెన్త్ క్లాస్ (మ్యాట్రికులేషన్) సర్టిఫికేట్‌లో ఉన్న వివరాలతో ఖచ్చితంగా సరిపోలాలి. అంతేకాకుండా, పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ తనిఖీల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి అభ్యర్థులు తమ ఆధార్ కార్డులో తాజా ఫోటోగ్రాఫ్, బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
ఆర్ఆర్బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2026- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా?
అర్హత గల అభ్యర్థులు కింది సాధారణ స్టెప్స్ ఫాలో అయి దరఖాస్తు చేసుకోవచ్చు:
మొదటగా రైల్వే అధికారిక దరఖాస్తు పోర్టల్ rrbapply.gov.in ను సందర్శించండి.
వెబ్‌సైట్‌లో అడిగిన ప్రాథమిక వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో లాగిన్ అయి, ఆర్ఆర్బీ ఏఎల్‌పీ అప్లికేషన్ ఫామ్‌ను జాగ్రత్తగా భర్తీ చేయండి.
అభ్యర్థి సంతకం, ఫోటో, అవసరమైన సర్టిఫికేట్లను స్క్యాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
మీ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్/డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించండి.
చివరగా అప్లికేషన్ ఫామ్‌ను సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింటవుట్ తీసుకొని దగ్గర ఉంచుకోండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


