Samsung Smartphones : శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్- వచ్చే వారమే లాంచ్..
Samsung Galaxy A57 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన తదుపరి తరం గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లను భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. మార్చి 25న జరగనున్న ఈ లాంచ్ ఈవెంట్‌లో గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37 మోడళ్లు సందడి చేయనున్నాయి. అదిరిపోయే డిజైన్, ఎక్సినోస్ చిప్‌సెట్ వీటి ప్రధాన ఆకర్షణలు.
శాంసంగ్ ప్రియులకు అదిరిపోయే వార్త! వచ్చే వారం భారత మార్కెట్లోకి సరికొత్త గెలాక్సీ ఏ-సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఒక టీజర్ వీడియోను విడుదల చేసింది. ఈ ఫోన్ల పేర్లను నేరుగా వెల్లడించనప్పటికీ, లాంచ్ అయ్యేవి గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37 మోడళ్లు అయి ఉంటాయని టెక్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

ఈ నేపథ్యంలో శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
శాంసంగ్ గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37- లాంచ్ వివరాలు..
ఈ కొత్త ఫోన్లు మార్చి 25వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు భారత్‌లో విడుదల కానున్నాయి. ఈ ఫోన్ల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పొందాలనుకునే వారు శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోని “Notify Me” బటన్‌పై క్లిక్ చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37- డిజైన్, కలర్స్..
ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ ఈ ఫోన్లకు సంబంధించిన స్పష్టమైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
డిజైన్: శాంసంగ్ గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37 రెండు ఫోన్లలోనూ సంస్థ సిగ్నేచర్ ‘కీ ఐలాండ్ 2.0’ డిజైన్ కనిపించనుంది. వెనుకవైపు మూడు కెమెరాలు నిలువుగా (Vertical) అమర్చి ఉంటాయి.
డిస్‌ప్లే: ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో హోల్-పంచ్ కటౌట్ ఉంది.
రంగులు: గెలాక్సీ ఏ57 - గ్రే, ఐసీ బ్లూ, లైలాక్, బ్లాక్ రంగుల్లో లభించనుంది. గెలాక్సీ ఏ37 - చార్‌కోల్, గ్రేగ్రీన్, లావెండర్ రంగుల్లో రానుంది.
Realme 16 5G : 7000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ తరహా డిజైన్‌తో రియల్మీ 16- ఇండియాలో త్వరలోనే లాంచ్..!
శాంసంగ్ గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37- కీలక ఫీచర్లు..
లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ల సాంకేతిక వివరాలు ఇలా ఉండవచ్చు:
డిస్‌ప్లే: గెలాక్సీ ఏ57 స్మార్ట్‌ఫోన్‌లో 6.6- ఇంచ్ ఫుల్-హెచ్‌డీ+ అమోలెడ్ స్క్రీన్, గెలాక్సీ ఏ37లో 6.7- ఇంచ్ ప్యానెల్ ఉండే అవకాశం ఉంది.
ప్రాసెసర్: గెలాక్సీ ఏ57 'ఎక్సినోస్ 1680' చిప్‌సెట్‌తో, గెలాక్సీ ఏ37 'ఎక్సినోస్ 1480' చిప్‌సెట్‌తో పనిచేయనున్నాయి.
కెమెరా: రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
రక్షణ: దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఈ ఫోన్లకు ఐపీ68 రేటింగ్ లభించే అవకాశం ఉంది.
ఈ రెండు స్మార్ట్ఫోన్లు ప్రీమియం లుక్‌తో పాటు మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునే ధరల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
లాంచ్ రోజున వీటి పూర్తి ధరలు, ఆఫర్ల వివరాలు తెలియనున్నాయి. వాటిని హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అప్డేట్ చేస్తాము. స్టే ట్యూన్డ్!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


