...
...
Next Story

కెప్టెన్‌గా ధోని రాజీనామా.. ఆ రోజు ఏం జ‌రిగింది? బీసీసీఐ ఫోర్స్.. అర్ధ‌రాత్రి ఈమెయిల్‌.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు

ఇండియా టీమ్ అత్యంత సక్సెస్ ఫుల్ కెప్లెన్లలో ఎంఎస్ ధోని ఒకరు. ఇండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అలాంటి ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకునే ముందు కొన్ని సంచలన విషయాలు జరిగాయి. ఇవి తాజాగా బయటకు వచ్చాయి.

Published on: Feb 14, 2026, 16:30:04 IST
Advertisement

అది 2017, జనవరి.. కెప్టెన్సీకి ధోని పూర్తిగా వీడ్కోలు పలికిన సమయం. అప్పటికే మహేంద్ర సింగ్ ధోని ఇండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఎదిగాడు. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఇండియాను నంబర్ వన్ టెస్టు టీమ్ గా నిలబెట్టాడు. అంతకంటే రెండేళ్ల క్రితమే టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. అయితే అప్పుడు ధోని కెప్టెన్సీని వదిలేయడం వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ధోనిపై బీసీసీఐ ఫోర్స్

ఎంఎస్ ధోని (x/BCCI)
ఎంఎస్ ధోని (x/BCCI)

అప్పటికే టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనిపై పూర్తిగా కెప్టెన్సీ వదిలేయాలని బీసీసీఐ ఫోర్స్ తెచ్చింది. అప్పటి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్, సెలక్టర్ జతిన్ పరంజపే కలిసి ఓ షోలో ఈ విషయాలు వెల్లడించారు.

‘‘అప్పుడు మహి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను గంటసేపు బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. మేము (ఎంఎస్కే, నేను) ఒకరినొకరం చూసుకుంటూ ఉన్నాం. మేం అతని దగ్గరకు వెళ్లి ‘మహి, ముందుకు సాగడానికి ఇదే సరైన సమయం’ అని చెప్పాం. అప్పుడు ఎంఎస్కేతో ధోని.. 'అన్నా, ఇది సరైన నిర్ణయం. నా నుంచి మీకు ఏం కావాలో చెప్పండి’ అని అడిగాడు’’ అని ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షోలో జతిన్ తెలిపాడు.

అర్ధరాత్రి ఈ మెయిల్

‘‘మీరు కెప్టెన్సీ వదిలేసి, ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నారని మాకు రాతపూర్వకంగా తెలియజేయాలని ధోనీతో ఎంఎస్కే అన్నాడు. అలాగే చేస్తానని ధోని చెప్పాడు. ఆ రోజు అర్ధరాత్రి మాకు మెయిల్ వచ్చింది. కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నానని అందులో ధోని పేర్కొన్నాడు. దీంతో ఈ నిర్ణయాన్ని మేం ప్రకటించాం. ఇందుకు మేం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని జతిన్ సంచలన విషయాలు బయటపెట్టాడు.

కోహ్లీకి సపోర్ట్

కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీది అద్భుతమైన రికార్డు. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ అతడు. ఇండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని ధోని అందించాడు. అతని నాయకత్వంలో ఇండియా నంబర్ వన్ టెస్టు టీమ్ గానూ నిలిచింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks