దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఇంటర్మీడియట్ అభ్యర్థులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఒక అద్భుతమైన అవకాశాన్ని తెచ్చింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ (సీహెచ్ఎస్ఎల్) 2026 నోటిఫికేషన్‌ను కమిషన్ అధికారికంగా విడుదల చేసింది. ఈ దఫా రిక్రూట్మెంట్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 2,536 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ), లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ) వంటి కీలకమైన ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా తమ అప్లికేషన్లను సమర్పించవచ్చు.
ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 7, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 7, 2026 (రాత్రి 11:00 గంటల వరకు)
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: అక్టోబర్ 8, 2026
అప్లికేషన్ కరెక్షన్ విండో: అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 16, 2026 వరకు
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (టైర్-1, టైర్-2): తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.
ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ విద్యార్హతలు (అక్టోబర్ 7, 2026 నాటికి)..
ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్లో భాగంగా పోస్టులను బట్టి విద్యార్హతల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
డీఈఓ/డీఈఓ గ్రేడ్ 'ఏ' (వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, ఎస్ఎస్సీ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలలో): గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ గ్రూప్‌లో మ్యాథ్స్ (గణితం) ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎల్‌డీసీ /జేఎస్ఏ, ఇతర శాఖల్లోని డీఈఓ పోస్టులకు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉంటే సరిపోతుంది.
{{/usCountry}}ఎల్‌డీసీ /జేఎస్ఏ, ఇతర శాఖల్లోని డీఈఓ పోస్టులకు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉంటే సరిపోతుంది.
{{/usCountry}}ప్రస్తుతం ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారు అక్టోబర్ 7, 2026 నాటికి ఖచ్చితంగా ఉత్తీర్ణత పత్రాలు కలిగి ఉండాలి.
ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ 2026- దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
అభ్యర్థులు ఎస్ఎశ్సీ కొత్త వెబ్‌సైట్ (ssc.gov.in) ద్వారా లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'MySSC' మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దరఖాస్తు చేయవచ్చు.
గతంలో పాత వెబ్‌సైట్‌లో ఒన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకున్న వారు కూడా, ఇప్పుడు కొత్త వెబ్‌సైట్‌లో మళ్లీ కొత్తగా ఓటీఆర్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పాత ఓటీఆర్ ఐడీలు ఇక్కడ పనిచేయవు. ఒక్కసారి కొత్త వెబ్‌సైట్‌లో ఓటీఆర్ పూర్తి చేస్తే, భవిష్యత్తులో ఎస్ఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకు దానినే ఉపయోగించుకోవచ్చు.
"దరఖాస్తు దారులు ఓటీఆర్ ప్రక్రియలో ఆధార్ ఆధారిత ఆథెంటికేషన్ ఎంచుకోవడం అభ్యర్థులకు ఎంతో ప్రయోజనకరం," అని కమిషన్ సూచించింది.
ఆధార్ ఆథెంటికేషన్ ఎంచుకున్న అభ్యర్థుల దరఖాస్తులు ఫొటో లేదా సంతకం సరిగ్గా లేవనే కారణంతో తిరస్కరణకు గురికావు. అంతేకాకుండా, పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా తాజా పాస్‌పోర్ట్ సైజు ఫొటో లేదా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ వేళ అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.