సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 944 పాయింట్లు పెరిగి 81,666 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 263 పాయింట్లు వృద్ధిచెంది 25,088 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 202 పాయింట్లు పెరిగి 58,619 వద్దకు చేరింది.

నెలల తరబడి నిరీక్షణకు తెరదించుతూ.. ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్ కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఫలితంగా మొత్తం మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ కనిపిస్తోంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,832.46 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,446.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
భారత్- అమెరికా వాణిజ్యం ఒప్పందం ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్ కనిపించనుంది. ఈరోజు స్టాక్ మార్కెట్ అతి భారీ లాభాలతో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 800 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం- స్టాక్ మార్కెట్లకు ఎందుకు కీలకం?
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై విధించిన 25 శాతం 'రెసిప్రోకల్ టారిఫ్'ను అమెరికా పూర్తిగా రద్దు చేశారు. దీనితో పాటు సాధారణ దిగుమతి సుంకాలను కూడా 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అంటే, ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే.. భారత్‌పై ట్రంప్ విధించిన మొత్తం సుంకాల భారం 50 శాతం నుంచి ఒక్కసారిగా 18 శాతానికి తగ్గిపోనుంది.
వాస్తవానికి ఏడాది కాలంలో భారత్ స్టాక్ మార్కెట్లు పెద్దగా పెరగలేదు. ఇందుకు ప్రధాన కారణం ట్రంప్ విధించిన టారిఫ్‌లు. ఈ కారణంగానే ఎఫ్ఐఐలు ఇండియా స్టాక్ మార్కెట్లో విపరీతంగా అమ్మకాలు చేస్తూ వస్తున్నారు. ట్రేడ్ డీల్ కుదిరితే భారత్‌కు లాభం జరుగుతుందని మార్కెట్లు చాలా నెలల పాటు ఎదురుచూశాయి. కానీ వాణిజ్య ఒప్పందం చాలా ఆలస్యమైంది. చివరికి ఇప్పుడు డీల్ కుదిరింది.
{{/usCountry}}వాస్తవానికి ఏడాది కాలంలో భారత్ స్టాక్ మార్కెట్లు పెద్దగా పెరగలేదు. ఇందుకు ప్రధాన కారణం ట్రంప్ విధించిన టారిఫ్‌లు. ఈ కారణంగానే ఎఫ్ఐఐలు ఇండియా స్టాక్ మార్కెట్లో విపరీతంగా అమ్మకాలు చేస్తూ వస్తున్నారు. ట్రేడ్ డీల్ కుదిరితే భారత్‌కు లాభం జరుగుతుందని మార్కెట్లు చాలా నెలల పాటు ఎదురుచూశాయి. కానీ వాణిజ్య ఒప్పందం చాలా ఆలస్యమైంది. చివరికి ఇప్పుడు డీల్ కుదిరింది.
{{/usCountry}}ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ మార్కెట్లకు ఈ వాణిజ్య ఒప్పందం ఒక భారీ ఊరటనిచ్చే పరిణామమని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా స్టాక్ మార్కెట్ దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిస్తుందని, ఇలాంటి సానుకూల వార్తల వల్ల వచ్చే ప్రయోజనాలను మార్కెట్ ముందే అంచనా వేస్తుందని వారు పేర్కొన్నారు. దీని ప్రభావంతో మంగళవారం మార్కెట్లు 'గ్యాప్-అప్' (భారీ లాభాలతో) ప్రారంభమయ్యే అవకాశం ఉందని, నిఫ్టీ 50 సూచీ త్వరలోనే 25,500 పాయింట్ల కీలక రెసిస్టెన్స్‌ని అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్ కుదిరిన వేళ.. ప్రధానంగా ఫార్మా, ఆటో, ఐటీ, టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి ఎగుమతి ఆధారిత రంగాల షేర్లపై దృష్టి సారించాలని ఇన్వెస్టర్లకు నిపుణులు సూచిస్తున్నారు.
ఎస్‌ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సీమా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "ఈ వాణిజ్య ఒప్పందం దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులకు (డీఐఐ), విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు (ఎఫ్ఐ) ఒక స్పష్టతను ఇస్తుంది. ఇప్పటి వరకు భారత్‌లో అమ్మకాలకు మొగ్గు చూపిన ఎఫ్ఐఐలు, ఇకపై తమ ధోరణిని మార్చుకుని మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించే అవకాశం ఉంది. చైనా, దక్షిణ కొరియా మార్కెట్ల నుంచి పెట్టుబడులు భారత్ వైపు మళ్లవచ్చు. మంగళవారం మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమవుతుందని నేను భావిస్తున్నాను. ఈ ఒప్పందంపై పూర్తి వివరాలు వెలువడ్డాక.. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలు సరికొత్త రికార్డు స్థాయిలను తాకవచ్చు" అని వివరించారు.
గ్రీన్ పోర్ట్‌ఫోలియో పీఎంఎస్ కో-ఫౌండర్ దివం శర్మ ఈ ఒప్పందాన్ని "భారత మార్కెట్లకు లభించిన అతిపెద్ద సానుకూల అంశం"గా అభివర్ణించారు. "ప్రస్తుతం మార్కెట్లలో నెలకొన్న నిరాశావాదం మాయమైపోతుంది. షార్ట్ కవరింగ్ వల్ల మార్కెట్లు వేగంగా పుంజుకుంటాయి. అమెరికా నుంచి వచ్చే విదేశీ పెట్టుబడులకు భారత్ ఇప్పుడు ఒక వ్యూహాత్మక కేంద్రంగా మారుతుంది. దీనివల్ల రీటైల్ ఇన్వెస్టర్లు, డీఐఐల నుంచి పెట్టుబడుల ప్రవాహం పెరిగి మార్కెట్ పరుగులు తీస్తుంది," అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఒప్పందం వల్ల ప్రధానంగా ప్రయోజనం పొందే రంగాలను ఆయన ఇలా వివరించారు:
టెక్స్‌టైల్స్- అపెరల్స్ (దుస్తులు)
ఆటో విడిభాగాలు, ఇంజనీరింగ్
స్పెషాలిటీ కెమికల్స్
అగ్రో- సీఫుడ్ ఎగుమతులు
అమెరికాకు ఎగుమతులు చేసే ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ గూడ్స్ సంస్థలు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.05 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.54శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.56 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
హిందుస్థాన్ పెట్రోలియం- బై రూ. 453, స్టాప్ లాస్ రూ. 437, టార్గెట్ రూ. 485
ఐటీసీ హోటల్స్- బై రూ. 185.65, స్టాప్ లాస్రూ. 179, టార్గెట్ రూ. 199
డీఎల్ఎఫ్- బై రూ. 625, స్టాప్ లాస్ రూ. 610, టార్గెట్ రూ. 642
బీఈఎల్- బై రూ. 439, స్టాప్ లాస్ రూ. 430, టార్గెట్ రూ. 454
ఎల్టీఎఫ్- బై రూ. 277, స్టాప్ లాస్ రూ. 272, టార్గెట్ రూ. 290