గుడ్ ఫ్రైడే నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 185 పాయింట్లు పెరిగి 73,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్లు వృద్ధిచెంది 22,713 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 51,549 వద్దకు చేరింది.
ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లో తీవ్ర అస్థిరత నెలకొంది. దీనికి ముగింపు ఎప్పుడు పడుతుంది? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేకపోవడంతో సూచీల్లో ఒత్తిడి కనిపిస్తోంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9,931.13 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,208.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
PPF : మెచ్యూరిటీ కంటే ముందే పీపీఎఫ్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చా? రూల్స్ ఇవి..
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 135 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“టెక్నికల్స్ని చూస్తే.. నిఫ్టీ50కి 22,450- 22,500 లెవల్స్ వద్ద సపోర్ట్ ఉంది. 22,840- 22,900 లెవల్స్ వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని చాయిస్ బ్రోకింగ్‌కి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గుడ్ ఫ్రైడే నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లకు కూడా సెలవే. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అక్కడి స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.13 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.11శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.18 శాతం పెరిగింది.
{{/usCountry}}గుడ్ ఫ్రైడే నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లకు కూడా సెలవే. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అక్కడి స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.13 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.11శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.18 శాతం పెరిగింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లలో చాలా వరకు సోమవారం సెలవులో ఉన్నాయి. మిగిలినవి ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
చమురు ధరలు..
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1.6శాతం పెరిగి బ్యారెల్‌కు 110.74 డాలర్లకు చేరింది.
FD returns : సీనియస్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్న టాప్ బ్యాంకులు ఇవి..
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఇన్ఫోసిస్- బై రూ. 1300.8, స్టాప్ లాస్ రూ. 1240, టార్గెట్ రూ. 1400
కళ్యాన్ జ్యువెల్లర్స్- బై రూ. 394.35, స్టాప్ లాస్ రూ. 374, టార్గెట్ రూ. 430
సుప్రియ లైఫ్‌సైన్సెస్- బై రూ. 394.35, స్టాప్ లాస్ రూ. 374, టార్గెట్ రూ. 430
ఎంఎం ఫోర్జింగ్స్- బై రూ. 412.05, స్టాప్ లాస్- రూ. 390, టార్గెట్ రూ. 460
వేదాంత- బై రూ. 687.65, స్టాప్ లాస్ రూ. 650, టార్గెట్ రూ. 755