భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్.. ఇప్పుడు లగ్జరీ ఈవీ విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తన ప్రతిష్టాత్మక 'అవిన్య' బ్రాండ్ కింద తొలి ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరిలోపు ఆవిష్కరించే/ లాంచ్ చేసే అవకాశం ఉంది. 2025 దిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన 'అవిన్య ఎక్స్' కాన్సెప్ట్ ఆధారంగా ఈ సరికొత్త మోడల్ రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
టాటా అవిన్య ఈవీ- జేఎల్ఆర్ టెక్నాలజీతో..

అవిన్య ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇది జగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)కు చెందిన 'ఎలక్ట్రిఫైడ్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్' (ఈఎంఏ) ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతోంది. దీని కోసం టాటా మోటార్స్, జేఎల్ఆర్‌కు రాయల్టీ కూడా చెల్లించనుంది. అయితే, ఈ టెక్నాలజీని పూర్తిగా లోకలైజేషన్ చేయడం ద్వారా ధరను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం టాటా సుమారు రూ. 18,000 కోట్లను ఇన్వెస్ట్ చేస్తోంది.
టాటా అవిన్య ఈవీ- వినూత్న డిజైన్.. ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు
టాటా అవిన్య ఈవీ చూడటానికి కూపే స్టైల్‌లో, స్లోపింగ్ రూఫ్‌లైన్‌తో చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనిలోని కొన్ని ముఖ్య ఫీచర్లు ఇవే:
నాలుగు తెరల డ్యాష్‌బోర్డ్: డ్యాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్లతో పాటు కన్సోల్ వద్ద మరో పెద్ద స్క్రీన్ ఉండే అవకాశం ఉంది.
అత్యాధునిక టెక్నాలజీ: లెవల్-2 అడాస్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్.
స్మార్ట్ ఫీచర్లు: కారు ద్వారా మరో కారుకు లేదా ఇతర వస్తువులకు పవర్ ఇచ్చే వీ2ఎల్, వీ2వీ ఫంక్షనాలిటీలు.
{{/usCountry}}స్మార్ట్ ఫీచర్లు: కారు ద్వారా మరో కారుకు లేదా ఇతర వస్తువులకు పవర్ ఇచ్చే వీ2ఎల్, వీ2వీ ఫంక్షనాలిటీలు.
{{/usCountry}}డిజైన్ ఎలిమెంట్స్: పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్.
ఈ టాటా అవిన్య ఈవీ బ్యాటరీ, రేంజ్ సహా ఇతర వివరాలపై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది. లాంచ్ టైమ్ నాటికి ఈ వివరాలు అందుబాటులోకి వస్తాయి.
టాటా అవిన్య ఈవీ- ప్రత్యేక షోరూమ్‌లు..
అవిన్య బ్రాండ్ ఉత్పత్తుల కోసం టాటా మోటార్స్ ప్రత్యేకంగా ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా టైర్-1, టైర్-2 నగరాల్లో పెరుగుతున్న లగ్జరీ ఈవీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ షోరూమ్‌లను తీసుకురానున్నారు.
ప్రస్తుతం భారత్‌లోని ఈవీ మార్కెట్లో 43 శాతం వాటా కలిగిన టాటా, అవిన్య లాంచ్‌తో దీనిని 50 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రీమియం ప్లాట్‌ఫామ్, ఆధునిక హంగులతో రానున్న అవిన్య, భారత లగ్జరీ కార్ల మార్కెట్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుందని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టాటా మోటార్స్‌కి ఇండియాలో టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, టాటా హారియర్ ఈవీ, టాటా సఫారీ ఈవీ వంటి మోడల్స్ ఉన్నాయి.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- టాటా అవిన్య ఈవీ రేంజ్ ఎంత? దీనికి ఛార్జింగ్ ఎంత సమయం పడుతుంది?
సమాధానం- టాటా అవిన్య సింగిల్ ఛార్జ్‌పై కనీసం 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని సమాచారం. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది. దీనివల్ల కేవలం 30 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే 500 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా ఛార్జింగ్ చేసుకోవచ్చని తెలుస్తోంది.
ప్రశ్న- అవిన్య ఈవీ ధర ఎంత ఉండవచ్చు? ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది?
సమాధానం- అవిన్య అనేది టాటా నుంచి వస్తున్న అత్యంత లగ్జరీ ఈవీ బ్రాండ్. దీని ప్రారంభ ధర రూ. 30 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. ఈ కారు ప్రొడక్షన్ వెర్షన్ 2026 చివరి నాటికి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి.