Tesla India : ఇండియాలోకి టెస్లా 6 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ- 715 కి.మీ రేంజ్‌తో.. ధర చూస్తే షాక్!
Tesla Model Y L :టెస్లా తన గ్లోబల్ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'మోడల్ వై'లో సరికొత్త త్రీ-రో వర్షెన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. దీని రేంజ్ 715 కి.మీ వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ చూసేయండి..
Tesla Sales India : ఇండియాలో టెస్లా ఫ్యాన్స్‌కి బిగ్ న్యూస్! అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కి చెందిన ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.. తన బెస్ట్ సెల్లింగ్ 'మోడల్ వై'కి చెందిన 3-రో, 6 సీటర్ వర్షెన్‌ని భారత దేశంలో లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీని పేరు టెస్లా మోడల్ వై ఎల్. మీడియా కథనాల ప్రకారం ఈ ఈవీ వచ్చే వారమే ఇండియాలో అడుగుపెట్టనుంది.

గతేడాది చైనాలో విడుదలైన ఈ లాంగ్-వీల్‌బేస్ వెర్షన్, ఆరు సీట్ల కాన్ఫిగరేషన్‌తో రాబోతోంది. 2025 జులైలో స్టాండర్డ్ మోడల్ వై లాంచ్ అయిన తర్వాత, భారత్‌లో టెస్లా నుంచి వస్తున్న రెండో ప్రధాన ఆఫరింగ్ ఇదే కానుంది.
ఈ నేపథ్యంలో ఈ టెస్లా మోడల్ వై ఎల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
విక్రయాల పుంజుకోవడమే లక్ష్యంగా..
భారత మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, టెస్లా ఆశించిన స్థాయిలో సేల్స్ అందుకోలేకపోయింది. వాహన్ డేటా ప్రకారం.. 2025లో కేవలం 227 మోడల్ వై యూనిట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఏడాదికి 2,500 యూనిట్ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్న టెస్లాకు ఇది భారీ ఎదురుదెబ్బే! భారీ ఇంపోర్ట్ డ్యూటీల కారణంగా ధరలు ఎక్కువగా ఉండటమే.. సేల్స్ అత్యల్పంగా ఉండాటనికి ప్రధాన కారణం.
ఈ నేపథ్యంలోనే ఈ 6-సీటర్ వేరియంట్‌తో దేశీయ లగ్జరీ ఎస్‌యూవీ ప్రియులను ఆకట్టుకోవాలని ఎలాన్ మస్క్ బృందం భావిస్తోంది.
టెస్లా మోడల్ వై ఎల్: ప్రత్యేకతలు ఇవే!
ఈ కొత్త వర్షెన్ సాధారణ మోడల్ వై కంటే పొడవుగా ఉంటుంది. దీని వీల్‌బేస్‌ను 150 ఎంఎం పెంచారు. దీనివల్ల లోపల మూడో వరుస సీట్లకు చోటు దక్కింది.
డిజైన్: కొత్త స్టైలిష్ 'స్టార్‌లైట్ గోల్డ్' కలర్, 19-ఇంచ్ వీల్స్, బ్లాక్-అవుట్ రియర్ స్పాయిలర్, వెనుక భాగంలో 'వైవైవై' బ్యాడ్జింగ్‌తో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది.
క్యాబిన్ & కంఫర్ట్: ఈ టెస్లా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 2+2+2 సీటింగ్ అమరిక ఉంటుంది. రెండో వరుసలో హీటెడ్, వెంటిలేటెడ్ కెప్టెన్ సీట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. మూడో వరుస ప్రయాణికుల కోసం కూడా హీటెడ్ సీట్లు, ప్రత్యేక ఏసీ వెంట్లను అందించారు.
టెక్నాలజీ: ఈ టెస్లా ఈవీ లోపల పెద్దదైన 16-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 18-స్పీకర్ల సౌండ్ సిస్టమ్ హైలైట్‌గా నిలవనున్నాయి.
టెస్లా మోడల్ వై ఎల్- పవర్, రేంజ్..
ఈ మోడల్ వై ఎల్ కేవలం 'లాంగ్ రేంజ్' స్పెసిఫికేషన్‌లో మాత్రమే లభిస్తుంది.
బ్యాటరీ: 82 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్.
రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 751 కిలోమీటర్ల (సీఎల్టీసీ రేంజ్) ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంటోంది.
పర్ఫార్మెన్స్: డ్యూయల్ మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఇది కేవలం 4.5 సెకన్లలోనే 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 201 కిమీ.
చైనాలో దీని ధర సుమారు 339,000 యువాన్లు (సుమారు రూ. 45.97 లక్షలు) ఉండగా, భారత్‌లో పన్నుల కారణంగా దీని ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది! షాంఘై గిగాఫ్యాక్టరీ నుంచి ఈ కార్లను భారత్‌కు దిగుమతి చేయనున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. టెస్లా మోడల్ వై ఎల్లో ఎన్ని సీట్లు ఉంటాయి?
ఇది 6-సీటర్ వెర్షన్. ఇందులో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లతో సహా మొత్తం మూడు వరుసల సీటింగ్ ఉంటుంది.
2. దీని రేంజ్ ఎంత?
సింగిల్ ఛార్జ్‌పై ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 751 కిలోమీటర్ల రేంజ్ (CLTC ప్రమాణాల ప్రకారం) ఇస్తుందని అంచనా.
3. భారత్‌లో దీని ధర ఎంత ఉండవచ్చు?
చైనా ధరతో పోలిస్తే భారత్‌లో ఇంపోర్ట్ డ్యూటీల వల్ల దీని ధర సుమారు రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


