భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం, పర్యావరణ స్పృహ పెరుగుతుండటంతో పాటు మెరుగైన ఈవీ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటంతో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ ఊపందుకుంది. 2026 చివరి నాటికి భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు మెర్సిడెస్ బెంజ్, బీవైడీకి చెందిన డెంజా, మినీ, హోండా వంటి అగ్రగామి గ్లోబల్ బ్రాండ్లు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి.
లగ్జరీ ఎస్‌యూవీలు, ప్రీమియం ఎంపీవీలు, హ్యాచ్‌బ్యాక్ లవర్స్ కోసం భారతీయ మార్కెట్లోకి రాబోతున్న 5 మోస్ట్ అవేటెడ్ ఎలక్ట్రిక్ కార్ల సమగ్ర వివరాలు ఇక్కడ చూద్దాం..
1. మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ ఎలక్ట్రిక్..
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తమ పాపులర్ ఎస్‌యూవీకి ఈవీ వర్షన్‌ను నవంబర్ 4, 2026న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది.
పర్ఫార్మెన్స్ అండ్ రేంజ్: ఇది ప్రారంభంలో 'జీఎల్సీ 400 4మ్యాటిక్' వేరియంట్లో రానుంది. ఇందులో 94కేడబ్ల్యూహెచ్ భారీ బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 490hp పవర్, 800Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.3 సెకన్లలోనే అందుకోగలదు. సింగిల్ ఛార్జ్‌పై 715 కిలోమీటర్ల డబ్ల్యూఎల్టీపీ మైలేజ్ ఇస్తుంది.
ఫీచర్లు, ధర: ఇందులో డ్యాష్‌బోర్డ్ అంతటా విస్తరించి ఉండే 39.1-అంగుళాల 'ఎంబీయూఎక్స్ హైపర్‌స్క్రీన్', పనోరమిక్ గ్లాస్ రూఫ్, బర్మెస్టర్ 4డీ సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ సీట్లు ఉంటాయి. భారత్‌లో ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అంచనా ధర రూ. 80 లక్షల నుంచి రూ. 90 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
2. డెంజా జెడ్9 జీటీ..
బీవైడీ సంస్థకు చెందిన లగ్జరీ ఈవీ బ్రాండ్ 'డెంజా' నవంబర్ 13, 2026న భారత్‌లోకి అధికారికంగా రీ-ఎంట్రీ ఇస్తోంది. సూపర్‌కార్ ప్రేమికులకు అనువుగా రూపొందించిన జెడ్9 జీటీ స్పోర్టీ మోడల్‌ను లాంచ్ చేయనుంది.
{{/usCountry}}బీవైడీ సంస్థకు చెందిన లగ్జరీ ఈవీ బ్రాండ్ 'డెంజా' నవంబర్ 13, 2026న భారత్‌లోకి అధికారికంగా రీ-ఎంట్రీ ఇస్తోంది. సూపర్‌కార్ ప్రేమికులకు అనువుగా రూపొందించిన జెడ్9 జీటీ స్పోర్టీ మోడల్‌ను లాంచ్ చేయనుంది.
{{/usCountry}}పర్ఫార్మెన్స్ అండ్ రేంజ్: ఇందులో 122.5కేడబ్ల్యూహెచ్ పవర్ఫుల్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ట్రై-మోటార్ (మూడు మోటార్లు) సెటప్‌తో వస్తున్న ఈ కారు నమ్మశక్యం కాని 1,156హెచ్‌పీ పవర్, 1,210ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. కేవలం 2.7 సెకన్లలోనే 0-100 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ ఛార్జ్‌పై 600 కిమీల రేంజ్ ఇస్తుంది.
ఫీచర్లు, ధర: డెవియాలెట్ 20-స్పీకర్ సౌండ్ సిస్టమ్, బహుళ డిజిటల్ స్క్రీన్స్, వెంటిలేటెడ్ మసాజ్ సీట్లు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ (అడాస్) ఫీచర్లు ఉన్నాయి. దీని అంచనా ధర రూ. 1.2 కోట్ల నుంచి రూ. 1.5 కోట్ల పరిధిలో ఉంటుంది.
3. డెంజా డీ9 ఎలక్ట్రిక్ ఎంపీవీ..
నవంబర్ నాటికి డెంజా బ్రాండ్ తీసుకురాబోయే మరో ప్రతిష్టాత్మక మోడల్ 'డీ9' లగ్జరీ ఎంపీవీ. ఇది టయోటా వెల్ఫైర్, లెక్సస్ ఎల్ఎంలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
పర్ఫార్మెన్స్ అండ్ రేంజ్: ఇందులో 103.36కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చారు. ఫ్రంట్-వీల్ డ్రైవ్ (313hp), ఆల్-వీల్ డ్రైవ్ (374hp) ఆప్షన్లలో లభిస్తుంది. ఒకే ఛార్జ్‌పై 520 కిమీ రేంజ్ అందిస్తుంది.
ఫీచర్లు, ధర: 7-సీటర్ లేఅవుట్లో వచ్చే ఈ కారులో రెండవ వరుసలో హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ సదుపాయాలు ఉన్న కెప్టెన్ సీట్లు ఉంటాయి. 15.6-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్, 14-స్పీకర్ డైనాడియో సౌండ్ సిస్టమ్ కలవు. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీ అంచనా ధర రూ. 80 లక్షల నుంచి రూ. 1.10 కోట్లు.
4. న్యూ మినీ కూపర్ ఎస్ఈ..
యూత్ అండ్ ప్రీమియం ఐకానిక్ హ్యాచ్‌బ్యాక్ లవర్స్ కోసం 2వ జనరేషన్ మినీ కూపర్ ఎస్ఈ నవంబర్ 27, 2026న భారతీయ రోడ్లపైకి రానుంది. ఈ కారుతో పాటు స్పెషల్ 'పాల్ స్మిత్ ఎడిషన్' కూడా రానుంది.
పర్ఫార్మెన్స్ అండ్ రేంజ్: 54.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 218hp పవర్, 330Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 402 కిమీ రేంజ్ ఇస్తూ, 6.7 సెకన్లలో 0-100 వేగాన్ని అందుకోగలదు.
ఫీచర్లు: కొత్త ఆక్టాగోనల్ గ్రిల్, రీ-డిజైన్ చేసిన ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, అల్లాయ్ వీల్స్, ఎక్స్‌క్లూజివ్ ఇంటీరియర్ కలర్స్‌తో ఈ స్పోర్టీ కారు లభిస్తుంది.
5. హోండా ఆల్ఫా ఈవీ..
జపాన్ కార్ల తయారీ దిగ్గజం హోండా సంస్థ గ్లోబల్ మార్కెట్ల కోసం భారత్‌లోనే ఉత్పత్తి చేయనున్న తొలి మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఆల్ఫా' డిసెంబర్ 2, 2026న ఆవిష్కృతం కానుంది.
ఉత్పత్తి, పోటీ: రాజస్థాన్‌లోని తపుకారా ప్లాంట్‌లో తయారయ్యే ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి కానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతీ సుజుకీ విటారా ఈవీ, టాటా సఫారీ/సియెర్రా ఈవీలకు పోటీగా రానుంది.
బ్యాటరీ అంచనా: ఈ హోండా ఆల్ఫా ఈవీలో 65కేడబ్ల్యూహెచ్ నుంచి 75కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చని అంచనా. హోండా రీ-డిజైన్ చేసిన కొత్త 'H' లోగోతో భారత మార్కెట్లోకి రాబోతున్న తొలి మోడల్ ఇదే కావడం విశేషం.