ఎస్‌యూవీ విభాగంలో తన హవాను కొనసాగిస్తూ, మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా 'ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ'ను భారత్‌లో లాంచ్ చేసింది. బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ అయిన ఎక్స్‌యూవీ700కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్. ఈ ఫీచర్ రిచ్ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.66 లక్షలు. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లలో లభించే టాప్ ఫీచర్లను ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ- అన్ని వేరియంట్లలోని టాప్ ఫీచర్లు..
- చాట్‌జీపీటీ (విత్ అలెక్సా బిల్ట్-ఇన్)-

మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ అన్ని వేరియంట్లలోనూ అలెక్స్ బిల్ట్- ఇన్‌తో కూడిన చాట్‌జీపీటీ ఫీచర్ లభిస్తోంది. ఫలితంగా ఇన్-కార్ అసిస్టెన్స్ మెరుగుపడింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు సరదాగా సంభాషించాలన్నా లేదా క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కావాలన్నా ఈ ఏఐ అసిస్టెంట్ మీకు తోడుగా ఉంటుంది.
2. కోస్ట్ టు కోస్ట్ స్క్రీన్-
ఈ మహీంద్రా కొత్త ఎస్‌యూవీలో 31.24సె.మీ ట్రిపుల్ హెచ్డీ స్క్రీన్లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి. ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళతాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తాయి. వినోదంతో పాటు డ్రైవర్‌కు అవసరమైన సమాచారాన్ని ఇవి స్పష్టంగా అందిస్తాయి. ఈ ఫీచర్‌తో ఈ కారులో మహీంద్రా సంస్థ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, కనెక్టివిటీ, ప్రీమియం క్యాబిన్ ఫీల్‌ని ఒక్కచోటకు తీసుకొచ్చింది.
3. అడ్రెనాక్స్-
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ అన్ని వేరియంట్లలో ADRENOX+ కనెక్ట్ స్టాండర్డ్‌గా వస్తుంది. దీని ద్వారా కస్టమర్లు 93 కనెక్టెడ్ ఫీచర్స్‌ని పొందవచ్చు. ఫలితంగా ప్రతి వేరియంట్ ఒక టెక్-సావీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది.
4. క్రూయిజ్ కంట్రోల్-
ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించి అన్ని వేరియంట్లలో లభిస్తున్న మరొక ఫీచర్ ఈ క్రూయిజ్ కంట్రోల్. బేస్ వేరియంట్లో కూడా ఇది ఉండటం విశేషం. లాంగ్ జర్నీలో డ్రైవర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
{{/usCountry}}ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించి అన్ని వేరియంట్లలో లభిస్తున్న మరొక ఫీచర్ ఈ క్రూయిజ్ కంట్రోల్. బేస్ వేరియంట్లో కూడా ఇది ఉండటం విశేషం. లాంగ్ జర్నీలో డ్రైవర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
{{/usCountry}}5. 6 ఎయిర్‌బ్యాగులు-
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది మహీంద్రా సంస్థ. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులను స్టాండర్డ్‌గా ఇచ్చింది. కర్టెన్ ఎయిర్‌బ్యాగుల ద్వారా 3వ వరుస సీట్లకు కూడా సేఫ్టీ ఉంటుంది.
6. వైర్‌లెస్ కనెక్టివిటీ-
కేబుల్స్ అవసరం లేకుండానే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వాడుకోవచ్చు. ఫలితంగా నేవిగేషన్, మ్యూజిక్, కాల్స్, యాప్స్‌కి యాక్సెస్‌ని పొందవచ్చు.
7. బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్-
రాత్రి వేళల్లో రోడ్డుపై వెలుతురు స్పష్టంగా ఉండేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అంతేకాదు, దీని వల్ల కారుకు ప్రీమియం లుక్ వస్తుంది.
8. పుష్ బటన్ స్టార్ట్/స్టాప్-
సాంప్రదాయ తాళం చెవి అవసరం లేకుండా బటన్ నొక్కగానే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది.
"వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రీమియం అనుభవాన్ని ప్రతి వేరియంట్‌లోనూ అందించడమే మా లక్ష్యం," అని మహీంద్రా తన ఫీచర్ల ఎంపిక ద్వారా చాటిచెప్పింది. మధ్యతరగతి నుంచి ప్రీమియం ఎస్‌యూవీ కోరుకునే వారి వరకు ఈ ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఒక అద్భుతమైన ఎంపిక కానుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ డెలివరీలు..
ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఇప్పటికే మొదలయ్యాయి టెస్ట్ డ్రైవ్ జనవరి 8న ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ల డెలివరీ జనవరి 14న స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్‌లో బేస్, మిడ్ వేరియంట్లను సంస్థ డెలివరీ చేసే అవకాశం ఉంది.
ఎంజీ హెక్టార్, టాటా సఫారీ వంటి దిగ్గజ కార్లకు ఈ ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ గట్టి పోటీ ఇవ్వనుంది.