భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలను మరింత ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ…. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 601 కిలోమీటర్ల మేర కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 24,815 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టులు రైలు రద్దీని తగ్గించడమే కాకుండా…. పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ఊతం ఇవ్వనున్నాయి.

రాజమండ్రి-విశాఖ మధ్య మొత్తం 198 కి.మీ మేర రూ.9,889 కోట్లతో కొత్తగా రెండు రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిడదవోలు-దువ్వాడను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించాలని నిర్ణయించింది. రద్దీ ఎక్కువగా ఉన్న చెన్నై-హౌడా మధ్య ఈ సెక్షన్‌లో నాలుగు లైన్లు తీసుకురావాలని నిర్ణయించింది.
రాజమండ్రి - విశాఖపట్నం 3వ, 4వ లైన్లు:
- పొడవు - 198 కిలోమీటర్లు.
- వ్యయం - రూ. రూ. 9,889 కోట్లు
- జిల్లాల పరిధి - తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లె, విశాఖపట్నం జిల్లాల మీదుగా ఈ కొత్త లైన్ల నిర్మాణం ఉంటుంది.
- విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కాకినాడ ఓడరేవులకు కనెక్టివిటీ పెరుగుతుంది.
- ప్రస్తుతం ఇక్కడ లైన్ సామర్థ్యం వినియోగం 130 శాతానికి చేరుకోవడంతో…. కొత్త లైన్ల వల్ల రద్దీ తగ్గి సరుకు రవాణా వేగవంతం కానుంది.
ఈ కీలకమైన ప్రాజెక్టుతో సరుకు రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా… కార్బన్ ఉద్గారాలు కూడా భారీగా తగ్గుతాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.అంతేకాకుండా ఆధ్యాత్మిక పర్యాటకానికి సంబంధించి.. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం (ఏపీ), నైమిషారణ్య, గర్ముక్తేశ్వర్ ఘాట్ (యూపీ) వంటి పుణ్యక్షేత్రాలకు రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఇక ఢిల్లీ - గౌహతి నెట్వర్క్లో కీలకమైన ఈ మార్గంలో 403 కిలోమీటర్ల మేర 3వ మరియు 4వ లైన్లను నిర్మించనున్నారు. ఘజియాబాద్, హాపూర్, మొరాదాబాద్, బరేలీ, షాజహాన్పూర్ వంటి 9 జిల్లాలను ఇది కలుపుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో లైన్ సామర్థ్యం వినియోగం 168 శాతంగా ఉంది. ఈ ప్రాజెక్టుతో ఆ రద్దీ గణనీయంగా తగ్గుతుంది.
{{/usCountry}}ఇక ఢిల్లీ - గౌహతి నెట్వర్క్లో కీలకమైన ఈ మార్గంలో 403 కిలోమీటర్ల మేర 3వ మరియు 4వ లైన్లను నిర్మించనున్నారు. ఘజియాబాద్, హాపూర్, మొరాదాబాద్, బరేలీ, షాజహాన్పూర్ వంటి 9 జిల్లాలను ఇది కలుపుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో లైన్ సామర్థ్యం వినియోగం 168 శాతంగా ఉంది. ఈ ప్రాజెక్టుతో ఆ రద్దీ గణనీయంగా తగ్గుతుంది.
{{/usCountry}}ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదనలు 'పీఎం-గతి శక్తి' జాతీయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. ఇది ప్రజల కదలికలకు, వస్తువుల రవాణాకు అతుకులు లేని కనెక్టివిటీని అందిస్తుంది. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.