Upcoming SUVs : రెండేళ్లు.. 10 మోడళ్లు! ఇండియాలో లాంచ్‌కి రెడీ అవుతున్న టాప్ ఎస్‌యూవీలు ఇవే..
భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న ఈ విభాగంలో రాబోయే రెండేళ్లలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి! పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు ఈవీ, హైబ్రిడ్, సీఎన్జీ ఆప్షన్లతో కొన్ని మోడల్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఆ వివరాలు..
Upcoming SUVs in India : భారతీయ ఆటోమొబైల్ రంగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ముందు వరుసలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండాతో పాటు విదేశీ బ్రాండ్లు కూడా తమ సరికొత్త మోడళ్లను సిద్ధం చేస్తున్నాయి. 2026 - 2028 మధ్య మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఆ 10 ఎస్‌యూవీల వివరాలపై ఇక్కడ ఓ లుక్కేయండి..

1. విన్‌ఫాస్ట్ వీఎఫ్ 3..
వియత్నాంకు చెందిన ప్రముఖ ఈవీ బ్రాండ్ విన్‌ఫాస్ట్.. భారత్‌లో ‘వీఎఫ్ 3’ అనే మైక్రో ఎస్‌యూవీని విడుదల చేయనుంది. ఇందులో 18.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండబోతోంది. బడ్జెట్ ధరలో మోడ్రన్ ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే సిటీ రైడర్లను లక్ష్యంగా చేసుకుని ఈ కారు వస్తోంది.
2. హ్యుందాయ్ కాంపాక్ట్ ఈవీ..
ఎలక్ట్రిక్ వాహన ప్రియుల కోసం హ్యుందాయ్ సంస్థ ఒక సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో రాబోతున్న ఈ ఈవీ సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 400 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ ఇవ్వగలదని తెలుస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ కోరుకునే మిడిల్ క్లాస్ కస్టమర్లకు ఇది మంచి ఆప్షన్ కానుంది.
3. కియా సైరోస్ ఈవీ..
కియా సంస్థ భారతదేశంలో తమ ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు కాంపాక్ట్ సెగ్మెంట్‌లో ‘సైరోస్ ఈవీ’ని లాంచ్ చేయబోతోంది. ఇండియన్ ఈవీ మార్కెట్లో తమ వాటాను పెంచుకోవడానికి కియాకు ఇది వ్యూహాత్మక మోడల్ కానుంది. ఈ మోడల్‌కి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
4. నెక్ట్స్ జనరేషన్ కియా సోనెట్..
కియా మోటార్స్ తమ పాపులర్ మోడల్ సోనెట్‌ను మరింత అధునాతనంగా మార్చబోతోంది. 2027 చివరి నాటికి రానున్న ఈ నెక్ట్స్ జనరేషన్ సోనెట్, పెద్ద పరిమాణంతో కూడిన సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై రానుంది. దీని ఇంటీరియర్స్, ఫీచర్లలో గ్లోబల్ స్టాండర్డ్స్ టెక్నాలజీని వాడనున్నారు.
5. రెనాల్ట్ బ్రిడ్జర్..
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్, ఈ విభాగంలో గట్టి పోటీ ఇచ్చేందుకు 2027 మధ్యలో ‘బ్రిడ్జర్' అనే ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఈ కారులో 48వీ మైల్డ్ హైబ్రిడ్ సాంకేతికతను అందించబోతున్నారు. తక్కువ ధరలోనే హైబ్రిడ్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
6. ఫోక్స్ వ్యాగన్ టెరా..
ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీని కోరుకునే వారి కోసం వోక్స్వ్యాగన్ సంస్థ ‘టెరా’ను తీసుకురానుంది. 2027 మధ్యలో రానున్న ఈ కారును భారత్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన 'MQB A0 IN' ఆర్కిటెక్చర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో 1.0-లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. దీని లుక్స్.. ఇటీవల వచ్చిన స్కోడ్ కైలాక్ కారును పోలి ఉంటాయని సమాచారం.
7. మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్..
అన్నింటికంటే ముందుగా మార్కెట్లోకి రాబోతున్న కారు బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్! ఈ కొత్త మోడల్‌లో కంపెనీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ కిట్‌ను కారు కింది భాగంలో అమర్చబోతోంది. దీనివల్ల బూట్ స్పేస్ (డిక్కీ స్థలం) ఏమాత్రం తగ్గదు. దీనితో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా రానుంది.
8. మహీంద్రా విజన్ ఎస్..
మహీంద్రా నుంచి 2027 ప్రారంభంలో రాబోతున్న మోడల్ ‘విజన్ ఎస్’. దీనిని 'NU IQ' ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేస్తున్నారు. ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. చూడటానికి ఇది పాపులర్ స్కోర్పియో ఎన్ కారుకు చిన్న వెర్షన్ లాగా, అగ్రెసివ్, బోల్డ్ లుక్‌తో రోడ్లపైకి రానుంది.
9. నెక్ట్స్ జనరేషన్ టాటా నెక్సాన్..
భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా పేరు తెచ్చుకున్న టాటా నెక్సాన్.. సరికొత్త అవతారంలో 2027 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెక్ట్స్ జనరేషన్ మోడల్‌లో పొడవైన వీల్‌బేస్, పూర్తిగా మార్చిన బాడీ డిజైన్ ఉండబోతున్నాయి. ఇది టర్బో పెట్రోల్, ఐసీఎన్జీ, ప్యూర్ ఎలక్ట్రిక్ వంటి మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో లభించనుంది.
10. హోండా సబ్-4 మీటర్ ఎస్‌యూవీ..
హోండా సంస్థ ఎట్టకేలకు భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలోకి అడుగుపెట్టబోతోంది. 2028 ప్రారంభంలో విడుదల కానున్న ఈ కారు సరికొత్త 'హోండా అమేజ్' ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపొందే అవకాశం ఉంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు అడ్వాన్స్‌డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందించవచ్చని అంచనా.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


