స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే విధానం వేగంగా మారుతోంది. కేవలం ఒకే కంపెనీ షేరుపై ఆధారపడకుండా, నిర్దిష్ట థీమ్‌లు లేదా రంగాలు ఆధారంగా పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే 'స్టాక్ బాస్కెట్' (Stock Basket) అనే నూతన వ్యూహం మార్కెట్‌లో విశేష ప్రజాదరణ పొందుతోంది.

ఒక్కో షేరును విడివిడిగా రీసెర్చ్ చేసి కొనుగోలు చేసే శ్రమ లేకుండా, ఒకే లావాదేవీ ద్వారా సమర్థవంతమైన షేర్ల సమూహంలో ఇన్వెస్ట్ చేసేందుకు స్టాక్ బాస్కెట్లు అద్భుతమైన మార్గం.
అసలు 'స్టాక్ బాస్కెట్' అంటే ఏమిటి?
ఒక నిర్దిష్ట రంగం, థీమ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహం ఆధారంగా నిపుణులు ఎంపిక చేసిన షేర్ల సమూహాన్నే 'స్టాక్ బాస్కెట్' అంటారు. ప్రతీ షేరును విడివిడిగా కొనే బదులు, మొత్తం బాస్కెట్‌ను ఒకేసారి కొనుగోలు చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్లు లేదా ఈటీఎఫ్‌ల (ETFs) మాదిరిగానే ఇవి పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని అందిస్తాయి. అయితే, వాటితో పోలిస్తే ఇక్కడ అధిక పారదర్శకత, పూర్తి నియంత్రణ లభిస్తాయి.
సాధారణంగా అనుభవజ్ఞులైన మార్కెట్ నిపుణులు లేదా బ్రోకరేజ్ సంస్థలు వీటిని తయారుచేస్తాయి. ఇవి ప్రధానంగా మూడు విధానాల్లో ఉంటాయి.
- సెక్టార్ ఆధారిత (Sector-specific): బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా వంటి రంగాలు.
- థీమ్ ఆధారిత (Theme-based): గ్రీన్ ఎనర్జీ, కన్జంప్షన్, డిజిటల్ ఇండియా వంటి అంశాలు.
- వ్యూహాత్మక (Strategy-driven): డివిడెండ్ ఇచ్చే కంపెనీలు, గ్రోత్ స్టాక్స్, వాల్యూ పిక్స్.
ఈ విధానం ఎలా పనిచేస్తుంది?
స్టాక్ బాస్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, కేటాయించిన సొమ్ము ఆ బాస్కెట్‌లోని షేర్ల నిష్పత్తికి అనుగుణంగా పంపిణీ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో యూనిట్లు మాత్రమే లభిస్తాయి, కానీ స్టాక్ బాస్కెట్ ద్వారా కొనుగోలు చేసే షేర్లు నేరుగా డిమాట్ ఖాతాలోకి జమ అవుతాయి. ఆ షేర్లకు ఇన్వెస్టరే పూర్తి యజమానిగా ఉంటారు.
ఉదాహరణకు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లతో కూడిన 'బ్యాంకింగ్ లీడర్స్ బాస్కెట్'లో ₹50,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. నిర్ణీత నిష్పత్తి ప్రకారం (ప్రతి దానికి 20 శాతం) ఒక్కో బ్యాంకు షేరులో ₹10,000 చొప్పున పెట్టుబడి వెళ్లి, ఆ షేర్లు నేరుగా డిమాట్ ఖాతాలోకి వస్తాయి. ప్రతీ షేరుపై విడివిడిగా పరిశోధన చేసే పనిలేకుండానే, ఆయా రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది.
స్టాక్ బాస్కెట్ల ద్వారా లభించే కీలక ప్రయోజనాలు
{{/usCountry}}ఉదాహరణకు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లతో కూడిన 'బ్యాంకింగ్ లీడర్స్ బాస్కెట్'లో ₹50,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. నిర్ణీత నిష్పత్తి ప్రకారం (ప్రతి దానికి 20 శాతం) ఒక్కో బ్యాంకు షేరులో ₹10,000 చొప్పున పెట్టుబడి వెళ్లి, ఆ షేర్లు నేరుగా డిమాట్ ఖాతాలోకి వస్తాయి. ప్రతీ షేరుపై విడివిడిగా పరిశోధన చేసే పనిలేకుండానే, ఆయా రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది.
స్టాక్ బాస్కెట్ల ద్వారా లభించే కీలక ప్రయోజనాలు
{{/usCountry}}సులభమైన వైవిధ్యం: ఒకే లావాదేవీతో విభిన్న షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనివల్ల ఒకే కంపెనీ షేరుపై ఆధారపడే రిస్క్ తగ్గుతుంది.
నిపుణుల పరిశోధన: మార్కెట్ నిపుణులు సాంకేతిక విశ్లేషణ, ట్రెండ్స్ ఆధారంగా ఈ బాస్కెట్లను రూపుదిద్దుతారు.
పారదర్శకత, నియంత్రణ: ఏ ఏ షేర్లు ఎంత నిష్పత్తిలో ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది. అవసరమైతే నిర్దిష్ట షేర్ల నుంచి నిష్క్రమించే వెసులుబాటు ఉంటుంది.
తక్కువ పెట్టుబడితో ప్రారంభం: కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో ₹5,000 లేదా ₹10,000తో కూడా బాస్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు.
కస్టమైజేషన్ ఆప్షన్లు: కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో బాస్కెట్‌లోని షేర్లను ఎడిట్ చేసుకోవడం లేదా రీబ్యాలెన్స్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రకాలు
సెక్టోరల్ బాస్కెట్లు: ఐటీ లేదా బ్యాంకింగ్ వంటి నిర్దిష్ట రంగానికి పరిమితమవుతాయి.
థీమాటిక్ బాస్కెట్లు: ఈవీ (EV) వాహనాలు, మేక్ ఇన్ ఇండియా, ఇన్‌ఫ్రా అభివృద్ధి వంటి అంశాల ఆధారంగా ఉంటాయి.
రిస్క్ ఆధారిత బాస్కెట్లు: ఇన్వెస్టర్ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి కన్జర్వేటివ్, బ్యాలెన్స్‌డ్, అగ్రెసివ్ ఆప్షన్లు ఉంటాయి.
మొమెంటమ్ బాస్కెట్లు: షేర్ ధరల కదలికలు, టెక్నికల్ సిగ్నల్స్ ఆధారంగా ఇవి ఉంటాయి.
లాంగ్ టర్మ్ గ్రోత్ బాస్కెట్లు: బలమైన ఫండమెంటల్స్ ఉన్న బ్లూచిప్ కంపెనీలలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఇవి ఉపయోగపడతాయి.
పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
మార్కెట్ రిస్క్: ఒకే షేరుపై ఆధారపడే రిస్క్‌ను ఇవి తగ్గించినప్పటికీ, మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులకు లోనైనప్పుడు రిస్క్ ఉంటుంది.
ఎప్పటికప్పుడు సమీక్ష: పోర్ట్‌ఫోలియో పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలి.
లక్ష్యాలకు అనుగుణంగా ఎంపిక: ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ అంచనాలకు సరిపోయే థీమ్‌లను మాత్రమే ఎంచుకోవాలి.
ప్లాట్‌ఫామ్ ఛార్జీలు: మ్యూచువల్ ఫండ్లతో పోలిస్తే ఫీజులు తక్కువగా ఉన్నప్పటికీ, ప్లాట్‌ఫామ్ నిర్దేశించే ఛార్జీలను సరిచూసుకోవాలి.
సమర్థవంతమైన వ్యూహంతో పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాలనుకునే వారికి స్టాక్ బాస్కెట్లు ఒక ఆధునిక, పారదర్శకమైన మార్గాన్ని చూపిస్తున్నాయి.
వ్యాసకర్త:
- శ్రీకాంత్ చౌహాన్,
హెడ్, ఈక్విటీస్ రీసెర్చ్,
కోటక్ సెక్యూరిటీస్