...
...
Next Story

కోట్లు కొల్లగొట్టేదెవరో? నేడే ఐపీఎల్ 2026 వేలం.. అందరి ఫోకస్ గ్రీన్ పైనే.. లైవ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

అబుదాబిలో ఈ రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మినీ వేలం జరగనుంది. ఈ వేలంలో ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టబోతున్నారు. మరి ఈ ఈవెంట లైవ్ ను ఎప్పుడు? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

Published on: Dec 16, 2025, 10:41:34 IST
Advertisement

ఆ రోజు వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 మినీ వేలం మంగళవారం, డిసెంబర్ 16న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబిలో జరగనుంది. ఈ వేలంలో 359 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలనుంది. ఆటగాళ్ల వేలంలో పాల్గొనడానికి మొత్తం 1390 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, ఫ్రాంచైజీల నుండి స్పందనల అనంతరం 359 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది బీసీసీఐ.

లైవ్ స్ట్రీమింగ్

ఐపీఎల్ వేలం (BCCI)
ఐపీఎల్ వేలం (BCCI)

ఐపీఎల్ 2026 మినీ వేలం అన్ని స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ వేలం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో జరుగుతుంది. మినీ వేలం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతుంది. ఈ మినీ వేలం జియోహాట్‌స్టార్‌ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్‌గా స్ట్రీమ్ కానుంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో దీన్ని చూడొచ్చు.

గ్రీన్ పై ఫోకస్

ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ కామెరాన్ గ్రీన్ వేలంలో అతిపెద్ద ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అతను నిలిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. వేలంలో మొత్తం 111 మంది విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అయితే 240 మందికి పైగా భారతీయులు పది ఫ్రాంచైజీలలో ఏదైనా ఒక దాని ద్వారా ఎంపికయ్యే అవకాశం ఉంది. అన్ని పది జట్లు మొత్తం 77 అందుబాటులో ఉన్న స్లాట్ల కోసం పోటీపడతాయి. ఇందులో 31 విదేశీ ఆటగాళ్ల కోసం రిజర్వ్ చేశారు.

రూ.2 కోట్లు

మూడుసార్లు ఛాంపియన్లైన కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో అతిపెద్ద పర్స్ (రూ.64.30 కోట్లు) కలిగి ఉంది. తరువాత ఐదుసార్లు ఛాంపియన్లైన చెన్నై సూపర్ కింగ్స్ (రూ.43.40 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ.25.50 కోట్లు) ఉన్నాయి. ఐదుసార్లు ఛాంపియన్లైన ముంబై ఇండియన్స్ అతి తక్కువ పర్స్ కలిగి ఉంది. ఎందుకంటే ఫ్రాంచైజీకి కేవలం రూ.2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks