India Russia oil : గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తాండవిస్తున్నప్పటికీ.. వాషింగ్టన్ ఇచ్చిన చిన్న మినహాయింపు ద్వారా భారతదేశం ఎలాగోలా నెట్టుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆ కిటికీ కాస్తా శాశ్వతంగా మూతబడటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం (మే 17) నాటితో రష్యా సముద్ర ముడి చమురుపై ఉన్న ఆంక్షల మినహాయింపు గడువును ముగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగితంపై ఇది కేవలం ఒక సాంకేతిక నిర్ణయంలా కనిపించవచ్చు, కానీ ముడి చమురు కోసం ఇరత దేశాలపై ఆధారపడే భారత్ లాంటి దేశాలకు ఇది పెను ఇంధన భారంగా మారనుంది. ఈ వార్తల మధ్య దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
టైమింగ్ చాలా ఘోరం..

అమెరికా ఈ నిర్ణయం తీసుకున్న సమయం భారతదేశానికి అత్యంత ప్రతికూలంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం ‘స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్’ ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా పూర్తిగా అస్తవ్యస్తమైంది. చమురు ట్యాంకర్ల కదలికలు మందగించాయి, ఇన్సూరెన్స్ ఖర్చులు అమాంతం పెరిగాయి. యుద్ధానికి ముందు బ్యారెల్‌కు 72 డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ముడి చమురు ధరలు.. ప్రస్తుతం 110 డాలర్ల మార్కును దాటి దూసుకుపోతున్నాయి. ఇటు మిడిల్ ఈస్ట్ నుంచి చమురు సరఫరా నమ్మకంగా లేదు.. అటు తక్కువ ధరకు వచ్చే రష్యా చమురుపై మళ్లీ ఆంక్షల భయం మొదలైంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 3 పెరిగిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
రష్యా చమురుపై భారత్ ఎంతగా ఆధారపడింది?
గత రెండేళ్లుగా రష్యా నుంచి లభించిన రాయితీ (డిస్కౌంట్) ముడి చమురు భారతదేశానికి ద్రవ్యోల్బణం పెరగకుండా ఒక పెద్ద రక్షణ కవచంలా నిలిచింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాను దూరం పెడితే.. భారత్ మాత్రం భారీగా రష్యా ఆయిల్ కొనుగోళ్లను పెంచింది. ఎందుకంటే ఆ ధరలు భారత్‌కు ఎంతో లాభదాయకంగా ఉన్నాయి. కాలక్రమేణా రష్యా.. భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది.
ఇరాన్ యుద్ధం తీవ్రమయ్యాక, గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ కొరత రాకుండా అమెరికా తాత్కాలికంగా ఆంక్షల అమలును పక్కనబెట్టింది. ఈ గడువును పొడిగించాలని భారత్, ఇండోనేషియా దేశాలు తీవ్రంగా ఒత్తిడి తెచ్చాయి. కానీ, రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయాలనుకుంటున్న పాశ్చాత్య దేశాలు, అమెరికా ఎంపీల నుంచి ఒత్తిడి రావడంతో ట్రంప్ ప్రభుత్వం ఈ మినహాయింపును రద్దు చేసింది.
{{/usCountry}}ఇరాన్ యుద్ధం తీవ్రమయ్యాక, గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ కొరత రాకుండా అమెరికా తాత్కాలికంగా ఆంక్షల అమలును పక్కనబెట్టింది. ఈ గడువును పొడిగించాలని భారత్, ఇండోనేషియా దేశాలు తీవ్రంగా ఒత్తిడి తెచ్చాయి. కానీ, రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయాలనుకుంటున్న పాశ్చాత్య దేశాలు, అమెరికా ఎంపీల నుంచి ఒత్తిడి రావడంతో ట్రంప్ ప్రభుత్వం ఈ మినహాయింపును రద్దు చేసింది.
{{/usCountry}}కేప్లర్ డేటా ప్రకారం.. మే నెలలో రష్యా నుంచి భారత్ చేసిన చమురు దిగుమతులు రోజుకు రికార్డు స్థాయిలో 23 లక్షల బారెళ్లకు చేరాయి. భారత్ మొత్తం దిగుమతుల్లో సగం రష్యా చమురుదే కావడం విశేషం. ఇప్పుడు ఆంక్షల భయంతో రష్యా నుంచి కొనుగోళ్లు ఆపేస్తే.. భారత్ మళ్లీ అస్థిరంగా ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాల వైపే చూడాల్సి వస్తుంది.
ప్రభుత్వం ముందున్న ఆప్షన్లు ఏంటి?
తన చమురు అవసరాలలో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడే భారతదేశంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ముడి చమురు ధరలు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ ధరలు, విమాన ప్రయాణ ఛార్జీలు, రవాణా ఖర్చులు, నిత్యావసరాల ధరలు అన్నీ ఒకేసారి పెరుగుతాయి.
ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు మూడు మార్గాలు ఉన్నాయి:
పన్నులు తగ్గించడం లేదా సబ్సిడీలు ఇవ్వడం: దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడుతుంది.
ప్రభుత్వ చమురు సంస్థలను నష్టాలు భరించమనడం: ఇప్పటికే ఈ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి, మరింత ఒత్తిడి చేస్తే వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది.
పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచడం: ఇది రాజకీయంగా, ప్రజల పరంగా ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే.. గతంలో చమురు సంక్షోభాలు వచ్చినప్పుడు తీసుకున్నట్లుగా.. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం, ఆఫీసు టైమింగ్స్ మార్చడం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం వంటి కఠిన నిర్ణయాలను ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చినా ఆశ్చర్యం లేదని ఎనర్జీ ఎకనామిస్టులు చెబుతున్నారు.
పరిశ్రమలపై ప్రభావం - నిపుణుల మాట..
ఇంధన ధరల పెరుగుదల ప్రభావంపై పెట్రోస్ స్టోన్ ఎల్‌ఎల్‌పీ ఇంటర్నేషనల్ బిజినెస్ డైరెక్టర్ రిషభ్ జైన్ మాట్లాడుతూ.. "లీటరుకు రూ. 3 కంటే ఎక్కువ పెరిగిన ఇంధన ధరల వల్ల దేశీయ లాజిస్టిక్స్, అంతర్జాతీయ ఫ్రైట్ (రవాణా) ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం ఎగుమతిదారులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ఈ రవాణా భారాల ముందు అది చాలా తక్కువ. ప్రస్తుతం పరిశ్రమలు మనుగడ కోసం పోరాడుతున్నాయి. అనేక రకాల తయారీ సంస్థలు ప్రొడక్షన్‌ను నెమ్మదింపజేసి, పాత స్టాక్‌ను క్లియర్ చేయడం ద్వారా వర్కింగ్ క్యాపిటల్‌ను మేనేజ్ చేసుకుంటున్నాయి. పోటీని తట్టుకోలేని చిన్న సంస్థలు మూతపడే పరిస్థితి వస్తోంది," అని విశ్లేషించారు.