ఫిబ్రవరి 17న ఈ ఏడాదిలో వచ్చే మొదటి సూర్య గ్రహణం.. మూడు రాశులకు కష్టకాలం, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ డే జరుపుకోవడంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా జరుపుకుంటాము. శివరాత్రి నాడు శివభక్తులందరూ శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఉపవాసం, జాగరణ వంటి పద్ధతులను పాటిస్తారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సూర్యగ్రహణం కూడా రాబోతోంది.

Published on: Feb 05, 2026 10:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఏటా సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాలు రావడం చూస్తూ ఉంటాం. 2026 ప్రారంభమైంది, అప్పుడే జనవరి నెల కూడా పూర్తయిపోయింది. అయితే ఫిబ్రవరిలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. 2026 లో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడిపోతుంది.

ఫిబ్రవరి 17న ఈ ఏడాదిలో వచ్చే మొదటి సూర్య గ్రహణం (pinterest)
ఫిబ్రవరి 17న ఈ ఏడాదిలో వచ్చే మొదటి సూర్య గ్రహణం (pinterest)

ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ డే ని జరుపుకోవడంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా జరుపుకుంటాము. శివరాత్రి నాడు శివభక్తులందరూ శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఉపవాసం, జాగరణ వంటి పద్ధతులను పాటిస్తారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సూర్యగ్రహణం కూడా రాబోతోంది.

2026లో వచ్చే మొదటి సూర్యగ్రహణం తేదీ, సమయం

2026 లో వచ్చే మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న రాబోతోంది. ఫిబ్రవరి 17 సాయంత్రం 5:31 కి ఇది ప్రారంభమవుతుంది, రాత్రి 7:50 కి ముగుస్తుంది. అయితే భారతదేశంలో కనిపించినప్పుడు మాత్రమే సూతక కాలం పరిగణించబడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనపడదు. కనుక సూతక కాలం చెల్లదు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనపడకపోయినా, సూతక కాలం చెల్లకపోయినా, 12 రాశుల వారిపై గ్రహణం అనేక విధాలుగా ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారికి సూర్యగ్రహణం సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిబ్రవరి 17న ఏర్పడే సూర్యగ్రహణంతో ఈ రాశుల వారికి సమస్యలు.. జాగ్రత్తగా ఉండాలి

ఈ సూర్యగ్రహణం శని గ్రహ అధిపతి అయిన కుంభరాశిలో ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం 12 రాశుల వారిపై అనేక మార్పులను తీసుకొస్తుంది. అయితే కొన్ని రాశుల వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ ప్రభావం 15 రోజుల పాటు ఈ రాశుల వారికి సమస్యలను కలిగించవచ్చు.

1.సింహ రాశి

సింహ రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కెరీర్‌లో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు ఎదురవకుండా చూసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. కాస్త నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి.

2.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వలన మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. సూర్యగ్రహణం కారణంగా ఈ రాశి వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన నిర్ణయాలను ఈ సమయంలో తీసుకోవద్దు. ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే గ్రహణం తర్వాత వారం రోజులు ఆగి, ఆ తర్వాత మొదలు పెట్టడం మంచిది.

3.కుంభ రాశి

ఈ రాశి వారికి సూర్య గ్రహణం కారణంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. బుధుడు, శుక్రుడు కూడా ఈ సమయంలో కుంభరాశిలో ఉంటారు కాబట్టి ఇబ్బందులు రావచ్చు. మీ మెదడులో అనేక ఆలోచనలు ఉండటంతో కాస్త గందరగోళానికి గురవుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరంగా కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.