Vastu: చీపురు వల్ల కూడా వాస్తు దోషాలు వస్తాయా? తెలుసుకోండి ఈ 5 ముఖ్యమైన నియమాలు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఊడ్చే చీపురుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చీపురును ఎలా పడితే అలా పడేయడం, తప్పుడు దిశల్లో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్ష్మీదేవి కటాక్షం కోసం చీపురు విషయంలో పాటించాల్సిన కీలక నియమాలు ఇవే.
హిందూ సంప్రదాయంలో చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకునే గడపల్లోనే సిరిసంపదలు తాండవిస్తాయని పెద్దల నమ్మకం. అయితే, శుభ్రతకు చిహ్నమైన చీపురును అజాగ్రత్తగా వాడితే, అది లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించి, ఇంట్లో వాస్తు దోషాలకు దారితీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. తెలియక మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆర్థిక సంక్షోభాలకు, అనారోగ్య సమస్యలకు మూలకారణం కావచ్చు. చీపురు విషయంలో మీరు తప్పక తెలుసుకోవాల్సిన 5 ప్రధాన నియమాలు ఇక్కడ ఉన్నాయి.

1. సరైన దిశలో భద్రపరచండి
చీపురును ఇంటి ఈశాన్య మూలలో ఎప్పుడూ ఉంచకండి. ఈశాన్య దిశను దైవ స్థానంగా, లక్ష్మీదేవి సంచరించే మార్గంగా పరిగణిస్తారు. అక్కడ చీపురు ఉంచడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. చీపురును ఎల్లప్పుడూ దక్షిణం లేదా నైరుతి దిశలో ఉంచడమే శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.
2. సూర్యాస్తమయం తర్వాత వద్దు
చాలా మంది సాయంత్రం వేళల్లోనూ ఇల్లు ఊడ్చేస్తుంటారు. కానీ, శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం అశుభం. ఇలా చేయడం వల్ల ధన నష్టం జరుగుతుందని నమ్ముతారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల సాయంత్రం పూట ఊడ్చాల్సి వస్తే, ఆ చెత్తను అదే రోజు రాత్రి బయట పడేయకండి. మరుసటి రోజు ఉదయం చెత్తను బయటకు పంపడం ఉత్తమం.
3. కంటికి కనిపించకుండా దాచండి
చీపురును బయటి వ్యక్తుల కంట పడకుండా జాగ్రత్త పడాలి. వచ్చిన అతిథులకు లేదా బయటి వ్యక్తులకు ఇంటి చీపురు కనిపించడం అంత మంచిది కాదు. వీలైతే తలుపు వెనుక దాచి ఉంచండి. బయటకు కనిపించేలా చీపురును ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది.
4. చీపురును తొక్కకండి
చీపురును లక్ష్మీదేవిగా భావించాలి. అందుకే, పొరపాటున కూడా చీపురును కాళ్లతో తొక్కడం లేదా కాళ్లతో పక్కకు నెట్టడం వంటి పనులు చేయకండి. ఇది లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో కలహాలు, ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.
5. వెళ్ళిన వెంటనే శుభ్రం చేయకండి
కుటుంబ సభ్యులు ఎవరైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడ్చడం మంచిది కాదు. వారు వెళ్ళిన కొద్దిసేపటి వరకు వేచి చూడటం మంచిది. వెంటనే ఊడ్చడం వల్ల వారు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


