జూలైలో పుట్టిన వారు ఇలా ఉంటారు.. ఆగస్టులో పుట్టిన వారిలో ఈ ప్రత్యేక లక్షణాలు ఉంటాయట!
జూలై లేదా ఆగస్టు నెలలో పుట్టారా? అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి. జూలైలో జన్మించిన వారి సున్నితమైన స్వభావం, ఆగస్టులో పుట్టిన వారి నాయకత్వ లక్షణాలు, ఈ రెండు నెలల్లో పుట్టిన వారిలో కనిపించే ప్రత్యేక గుణాలు ఏమిటో ఈ కథనంలో చదవండి.
పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలను చెప్పచ్చు. జూలై, ఆగస్టు నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు? వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది? ఇతరులతో పోల్చుకుంటే ఈ నెలలో పుట్టిన వారు ఎలా విభిన్నంగా ఉంటారు? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా జూలై లేదా ఆగస్టు నెలలో పుట్టారా? అయితే మీ వ్యక్తిత్వం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

జూలై నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు?
ఒక వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే అంశాల్లో కుటుంబం, విద్య, పెంపకం వంటివి ఎన్నో ఉంటాయి. అలాగే వాటితో పాటు జన్మించిన నెల ఆధారంగా కూడా సాధారణ వ్యక్తిత్వ లక్షణాలు కనిపిస్తాయి. జూలై, ఆగస్టు నెలలో పుట్టిన వారి స్వభావం గురించి ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి.
జూలై నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారనేది చూస్తే, వీరు ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల ప్రేమ, అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతరుల భావాలను కూడా ఈ నెలలో పుట్టిన వారు సులువుగా అర్థం చేసుకుంటారు. సమస్యల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పగలరు. అవసరమైనప్పుడు తోడుగా ఉంటారు.
ఈ నెలలో పుట్టిన వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. అన్ని కోణాల్లో బాగా ఆలోచించి ముందుకు వెళ్లడాన్నే ఈ నెలలో పుట్టిన వారు ఇష్టపడతారు. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. సంగీతం, కళలు, రచన వంటి సృజనాత్మక రంగాలపై ఆసక్తి చూపిస్తారు. కొన్నిసార్లు ఈ నెలలో పుట్టిన వారు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఆగస్టు నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు?
ఆగస్టు నెలలో పుట్టారా? అయితే మీ వ్యక్తిత్వం ఇలా ఉంటుంది. ఆగస్టు నెలలో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ. అందుకే కొత్త బాధ్యతలను స్వీకరించడానికి కూడా ఇష్టపడతారు. కష్టమైన పరిస్థితుల్లో కూడా ముందుకే వెళతారు తప్ప వెనకడుగు వేయరు.
లక్ష్యాలను సాధించడానికి ఈ నెలలో పుట్టిన వారు ఎంతో కష్టపడి శ్రమిస్తారు. ఇతరులను ప్రోత్సహించే గుణం ఈ నెలలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే సమాజంలో గౌరవం పొందాలని అనుకుంటారు. ఉదార స్వభావంతో అవసరమైనప్పుడు ఇతరులకు సాయం చేయడానికి కూడా ఈ నెలలో పుట్టిన వారు ముందుంటారు. అలాగే కొన్నిసార్లు తమ అభిప్రాయాలపై గట్టిగా నిలబడతారు.
ఈ రెండు నెలల్లో పుట్టిన వారిలో సాధారణ లక్షణాలు
ఈ రెండు నెలల్లో పుట్టిన వారు బాధ్యతగా ఉంటారు. అలాగే కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులను కాపాడుకుంటారు. కష్టపడి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఈ రెండు నెలల్లో పుట్టిన వారు ఇతరుల పట్ల గౌరవం చూపిస్తారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. అంతేకాదు, ఈ రెండు నెలల్లో పుట్టిన వారు మంచి గుణాలు కలిగి ఉంటారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో సమతుల్యతను పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


