సెప్టెంబర్ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారుతున్నాయి. ఈ గ్రహాల సంచారం వల్ల మేషం, మిథునం, కన్య, తులా మరియు మకర రాశుల వారికి కెరీర్, ఆర్థిక రంగాల్లో ఊహించని లాభాలు దక్కనున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెల అత్యంత కీలకమైన ఖగోళ మార్పులకు వేదిక కానుంది. నెల ప్రారంభం నుంచే గ్రహాల గమనంలో వేగం పుంజుకోనుంది. ఈ నెలలో సంపద, ఐశ్వర్యాలకు కారకుడైన శుక్రుడు, బుద్ధి ప్రదాత బుధుడు, ఆత్మకారకుడు సూర్యుడు, పరాక్రమ కారకుడు కుజుడు వంటి నాలుగు ప్రధాన గ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. ఈ గ్రహాల గమన మార్పుల ప్రభావం ద్వాదశ రాశులపై విభిన్న రీతిలో పడనుంది.
సెప్టెంబర్ 2న శుక్రుడి రాశి మార్పు
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సెప్టెంబర్ నెల తొలి ఘట్టంగా సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. జ్యోతిషంలో తులా రాశి శుక్రుడికి స్వక్షేత్రం కావడంతో ఈ గోచారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శుక్రుడు భౌతిక సుఖాలు, సంపద, ప్రేమ, కళలు మరియు బాంధవ్యాలకు అధిపతిగా వ్యవహరిస్తాడు. ఈ సంచార ప్రభావంతో ఆర్థిక లావాదేవీల్లో నూతన అవకాశాలు లభించడంతో పాటు వ్యక్తిగత బంధాలు మరింత బలపడతాయి.
సెప్టెంబర్ 7న బుధ గోచారం
ఇక సెప్టెంబర్ 7న బుధ భగవానుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. మేధస్సు, వాక్చాతుర్యం, వ్యాపారం, లెక్కలు మరియు నిర్ణయ సామర్థ్యానికి బుధుడు కారకుడు. కన్యా రాశిలో బుధుడు అత్యంత బలంగా ఉంటాడు. దీనివల్ల ఉద్యోగ, వ్యాపారాలు, విద్యా రంగం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లే వారికి ఈ కాలం కలిసి వస్తుంది.
సెప్టెంబర్ 17న సూర్య సంచారం
నెల మధ్యలో అంటే సెప్టెంబర్ 17న సూర్య భగవానుడు కన్యా రాశిలోకి సంచారం చేస్తాడు. సూర్యుడి ఈ మార్పు వల్ల వృత్తిపరమైన బాధ్యతల్లో చురుకుదనం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మరింత క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు తమ ప్రణాళికలను మరింత పక్కాగా అమలు చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
సెప్టెంబర్ 18న కుజ గోచారం
{{/usCountry}}నెల మధ్యలో అంటే సెప్టెంబర్ 17న సూర్య భగవానుడు కన్యా రాశిలోకి సంచారం చేస్తాడు. సూర్యుడి ఈ మార్పు వల్ల వృత్తిపరమైన బాధ్యతల్లో చురుకుదనం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మరింత క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు తమ ప్రణాళికలను మరింత పక్కాగా అమలు చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
సెప్టెంబర్ 18న కుజ గోచారం
{{/usCountry}}నెల చివరి భాగంలో సెప్టెంబర్ 18న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంగారకుడు శక్తి, సాహసం, భూములు, ఆస్తులు మరియు దూకుడు స్వభావానికి ప్రతీక. అయితే కర్కాటక రాశిలో కుజుడు సంచరించే సమయంలో అత్యంత సంయమనం పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని తెస్తాయి. కుటుంబ, ఆస్తి వివాదాల్లో కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి?
ఈ గ్రహాల కదలికల వల్ల అన్ని రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ.. మేషం, మిథునం, కన్య, తులా మరియు మకర రాశుల వారికి సెప్టెంబర్ నెలలో కెరీర్ పరంగా, ఆర్థికంగా అద్భుతమైన వృద్ధి సాధించే సువర్ణావకాశాలు లభిస్తున్నాయి.