వేద జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు, భావోద్వేగాలకు, మానసిక ప్రశాంతతకుకారకుడిగా పరిగణిస్తారు. ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి చంద్రుడు తన రాశిని మారుస్తుంటాడు. పంచాంగ గణణాల ప్రకారం, నవంబర్ 14, 2026 న చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

నవంబర్ 17 వరకు సరిగ్గా నాలుగు రోజుల పాటు చంద్రుడు ఇదే రాశిలో సంచరిస్తాడు. మకర రాశికి ఆధిపత్య గ్రహం శనిదేవుడు. శని క్షేత్రంలో చంద్రుడి సంచారం వల్ల మనుషులలో బాధ్యతాయుతమైన ప్రవర్తన, క్రమశిక్షణ, గంభీరత పెరుగుతాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ వృత్తిపరమైన బాధ్యతలపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఈ గ్రహాల కలయిక మరియు సంచార ప్రభావం వల్ల పలు రాశుల వారికి ధనలాభంతో పాటు కెరీర్లో గొప్ప విజయాలు అందుతాయి.
మేష రాశి:
చంద్ర గోచార ప్రభావం వల్ల మేష రాశి వారికి తలపెట్టిన పనుల్లో అద్భుతమైన విజయాలు లభిస్తాయి. పని చేసే ప్రదేశంలో సరికొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు దక్కడంతో పాటు ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. ఆర్థిక పరంగా మంచి లాభాలున్నాయి. ఎంతోకాలంగా నిలిచిపోయిన పాత బాకీలు లేదా ధనం తిరిగి మీ చేతికి అందుతుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ చంద్ర సంచారం ఎంతో లాభదాయకంగా మారుతుంది. ఈ కాలంలో అదృష్టం పూర్తిగా మీ వెంటే ఉంటుంది. దైవ కార్యాలపై, ఆధ్యాత్మిక విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, దీని వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు అంచనాలకు మించి రాణిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ గోచారం వైవాహిక జీవితంలో సరికొత్త మాధుర్యాన్ని నింపుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది.
తులా రాశి:
{{/usCountry}}కర్కాటక రాశి వారికి ఈ గోచారం వైవాహిక జీవితంలో సరికొత్త మాధుర్యాన్ని నింపుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది.
తులా రాశి:
{{/usCountry}}చంద్రుడి రాశి మార్పు కారణంగా తులా రాశి వారికి కుటుంబంలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయి. ఆస్తి లేదా ధన సంబంధిత వివాదాలలో మీకు విజయం వస్తుంది. ఆర్థిక పరిస్థితిలో స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది. ఆత్మీయుల అండదండలు లభిస్తాయి. జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. అదృష్టం తోడై వ్యాపారాలు బలపడతాయి.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ నక్షత్ర, రాశి సంచారాల వల్ల ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. తోబుట్టువుల నుంచి మీకు తగిన సహాయ సహకారాలు అందుతాయి. మీరు చేసే ప్రయాణాలు లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపారం చేసే వారికి సంస్థను విస్తరించడానికి మంచి మార్గాలు దొరుకుతాయి. శుభవార్తలు వినడం వల్ల మనసు ఉత్సాహంగా మారుతుంది. మీ వ్యక్తిగత ప్రతిభ మరింత మెరుగవుతుంది.
మకర రాశి:
మకర రాశిలోనే చంద్రుడు సంచరిస్తుండటం వల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా తిరుగులేని లాభాలు కలుగుతాయి. మీ ధన ప్రవాహం మెరుగవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిగతం మరియు వృత్తిగత ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడానికి చక్కటి సమయం ఇది. స్టాక్ మార్కెట్ లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త మార్గాల ద్వారా ఆదాయం సమకూరడంతో పాటు పాత పెట్టుబడులు కూడా లాభాలను అందిస్తాయి.
మీన రాశి:
మీన రాశి వారికి ఆర్థిక పరంగా అనేక అదృష్ట అవకాశాలు తారసపడతాయి. ఆదాయం పెరగడానికి కొత్త దారులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆప్యాయత, సహకారం లభిస్తాయి. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి తగ్గి ప్రశాంత వాతావరణం ఉంటుంది. సొంత వ్యాపారం నిర్వహించే వారికి మంచి లాభదాయకమైన డీల్స్ కుదిరే అవకాశం ఉంది.