చంద్రుడి రాశి మార్పు.. ఈ 7 రాశులకు నవంబర్ 14 నుంచి సిరుల వర్షం!
నవంబర్ 14 నుంచి శని రాశి అయిన మకరంలో చంద్రుడి సంచారం ప్రారంభం కానుంది. ఈ గోచార ప్రభావం వల్ల ఏడు రాశుల వారికి ఆర్థికంగా, కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు దక్కనున్నాయి.
వేద జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు, భావోద్వేగాలకు, మానసిక ప్రశాంతతకుకారకుడిగా పరిగణిస్తారు. ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి చంద్రుడు తన రాశిని మారుస్తుంటాడు. పంచాంగ గణణాల ప్రకారం, నవంబర్ 14, 2026 న చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

నవంబర్ 17 వరకు సరిగ్గా నాలుగు రోజుల పాటు చంద్రుడు ఇదే రాశిలో సంచరిస్తాడు. మకర రాశికి ఆధిపత్య గ్రహం శనిదేవుడు. శని క్షేత్రంలో చంద్రుడి సంచారం వల్ల మనుషులలో బాధ్యతాయుతమైన ప్రవర్తన, క్రమశిక్షణ, గంభీరత పెరుగుతాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ వృత్తిపరమైన బాధ్యతలపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఈ గ్రహాల కలయిక మరియు సంచార ప్రభావం వల్ల పలు రాశుల వారికి ధనలాభంతో పాటు కెరీర్లో గొప్ప విజయాలు అందుతాయి.
మేష రాశి:
చంద్ర గోచార ప్రభావం వల్ల మేష రాశి వారికి తలపెట్టిన పనుల్లో అద్భుతమైన విజయాలు లభిస్తాయి. పని చేసే ప్రదేశంలో సరికొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు దక్కడంతో పాటు ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. ఆర్థిక పరంగా మంచి లాభాలున్నాయి. ఎంతోకాలంగా నిలిచిపోయిన పాత బాకీలు లేదా ధనం తిరిగి మీ చేతికి అందుతుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ చంద్ర సంచారం ఎంతో లాభదాయకంగా మారుతుంది. ఈ కాలంలో అదృష్టం పూర్తిగా మీ వెంటే ఉంటుంది. దైవ కార్యాలపై, ఆధ్యాత్మిక విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, దీని వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు అంచనాలకు మించి రాణిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ గోచారం వైవాహిక జీవితంలో సరికొత్త మాధుర్యాన్ని నింపుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది.
తులా రాశి:
చంద్రుడి రాశి మార్పు కారణంగా తులా రాశి వారికి కుటుంబంలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయి. ఆస్తి లేదా ధన సంబంధిత వివాదాలలో మీకు విజయం వస్తుంది. ఆర్థిక పరిస్థితిలో స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది. ఆత్మీయుల అండదండలు లభిస్తాయి. జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. అదృష్టం తోడై వ్యాపారాలు బలపడతాయి.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ నక్షత్ర, రాశి సంచారాల వల్ల ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. తోబుట్టువుల నుంచి మీకు తగిన సహాయ సహకారాలు అందుతాయి. మీరు చేసే ప్రయాణాలు లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపారం చేసే వారికి సంస్థను విస్తరించడానికి మంచి మార్గాలు దొరుకుతాయి. శుభవార్తలు వినడం వల్ల మనసు ఉత్సాహంగా మారుతుంది. మీ వ్యక్తిగత ప్రతిభ మరింత మెరుగవుతుంది.
మకర రాశి:
మకర రాశిలోనే చంద్రుడు సంచరిస్తుండటం వల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా తిరుగులేని లాభాలు కలుగుతాయి. మీ ధన ప్రవాహం మెరుగవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిగతం మరియు వృత్తిగత ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడానికి చక్కటి సమయం ఇది. స్టాక్ మార్కెట్ లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త మార్గాల ద్వారా ఆదాయం సమకూరడంతో పాటు పాత పెట్టుబడులు కూడా లాభాలను అందిస్తాయి.
మీన రాశి:
మీన రాశి వారికి ఆర్థిక పరంగా అనేక అదృష్ట అవకాశాలు తారసపడతాయి. ఆదాయం పెరగడానికి కొత్త దారులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆప్యాయత, సహకారం లభిస్తాయి. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి తగ్గి ప్రశాంత వాతావరణం ఉంటుంది. సొంత వ్యాపారం నిర్వహించే వారికి మంచి లాభదాయకమైన డీల్స్ కుదిరే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


