బీకేర్ఫుల్.. ఈ పది వస్తువులనూ పొరపాటున కూడా ఇతరుల నుంచి తీసుకోవద్దు, లేదంటే ఈ బాధలు తప్పవు!

మన వద్ద లేని వస్తువులను ఇతరుల నుంచి తీసుకుంటూ ఉంటాము. కానీ కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం మంచిది కాదు. ఈ వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం వలన సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి ఎప్పుడైనా ఈ వస్తువులను ఇతరుల దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించుకోండి.

Published on: Jan 31, 2026, 10:00:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సాధారణంగా మన వద్ద లేని వస్తువులను ఇతరుల నుంచి తీసుకుంటూ ఉంటాము. కానీ కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం మంచిది కాదు. ఈ వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం వలన సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి ఎప్పుడైనా ఈ వస్తువులను ఇతరుల దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించుకోండి.

బీకేర్ఫుల్.. ఈ పది వస్తువులనూ పొరపాటున కూడా ఇతరుల నుంచి తీసుకోవద్దు (pinterest)
బీకేర్ఫుల్.. ఈ పది వస్తువులనూ పొరపాటున కూడా ఇతరుల నుంచి తీసుకోవద్దు (pinterest)

ఈ వస్తువులు ఇతరుల నుంచి తీసుకుంటే మాత్రం కష్టాలు ఎదురవుతాయి

చీపురును ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర నుంచి తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే ధనవ్యయం, స్థిరత్వ లోపంతో బాధపడాల్సి ఉంటుంది.

ఎవరి దగ్గర నుంచి కూడా అద్దాన్ని తీసుకోకూడదు. అద్దాన్ని తీసుకున్నట్లయితే అదృష్టం తగ్గిపోతుంది అని చెబుతారు. కాబట్టి అద్దాన్ని కూడా ఇతరుల నుంచి తీసుకోవడం మంచిది కాదు.

అలాగే ఇతరుల దగ్గర నుంచి నగలను తీసుకోకూడదు. అలా చేసినట్లయితే గ్రహబాధలు, మనశ్శాంతి లోపం వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర నుంచి సూదిని తీసుకోకూడదు. దాని వలన వివాదాలు ఎక్కువవుతాయి.

అప్పుల (Debts) భారాన్ని పెంచే నూనెను కూడా ఇతరుల దగ్గర నుంచి తీసుకోకూడదు. నూనె తీసుకుంటే అప్పులు ఎక్కువైపోతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల నుంచి నూనె తీసుకోవద్దు.

బట్టలను కూడా ఇతరుల దగ్గర నుంచి తీసుకోకూడదు. అలా చేసినట్లయితే నెగటివ్ శక్తి పెరుగుతుంది.

పాత వస్తువులను ఇతరుల దగ్గర నుంచి తీసుకోవడం మంచిది కాదు. అలా చేస్తే అనవసరమైన ఆటంకాలతో బాధపడాల్సి ఉంటుంది.

ఇతరుల దగ్గర నుంచి ఉప్పును తీసుకుంటే ఆర్థిక ఒత్తిడి ఎక్కువవుతుంది.

ఇతరుల దగ్గర నుంచి చెప్పులు తీసుకుంటే శని సంబంధిత బాధలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

ఇతరుల దగ్గర నుంచి దువ్వెనను తీసుకుంటే అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. కనుక ఈ వస్తువులను ఎవరి దగ్గర నుంచి కూడా ఉచితంగా తీసుకోవద్దు.

చీపురు విషయంలో మరి కొన్ని జాగ్రత్తలు పాటించడం కూడా ముఖ్యం

చాలా మంది చీపురు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వంటగదిలో చీపురును పెట్టడం మంచిది కాదు. అలాగే చీపురు విషయంలో ఇవి కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి.

శుక్రవారం చీపురును కొనుగోలు చేస్తే ఇల్లంతా డబ్బుతో నిండుతుంది అని నమ్మకం.

శనివారం పాత చీపురును పడేస్తే మంచిదని చెబుతారు.

ఇంటికి వచ్చిన అతిథులకు మీ ఇంట్లో ఉన్న చీపురు కనపడితే సంపద తగ్గిపోతుంది.

ఈశాన్య దిశలో చెత్తను పోగు పెట్టడం వలన ధననష్టంతో బాధపడాల్సి ఉంటుంది.

చీపురును ఎప్పుడూ కూడా గోడకు ఆనించి పెట్టకూడదు. చీపురును కాలితో తొక్కడం, చీకటి పడిన తర్వాత చీపురును ఉపయోగించడం వంటి పొరపాట్లు చేయకూడదు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More