...
...
Next Story

ఈరోజు నాగ పంచమి వేళ ఏ రాశి వారు ఏం చేయాలి? 12 రాశులకు ప్రత్యేక పూజా పరిహారాలు!

నాగ పంచమి ఉపే 2026: నాగ పంచమి రోజున పాము దేవత మరియు శివుడిని ఆరాధించడమే కాకుండా, ప్రజలు జీవితంలో ఆనందం, శాంతి మరియు ఆనందం కోసం కూడా చర్యలు తీసుకుంటారు. రాశిచక్రం ప్రకారం ఏ చర్యలు ఈ రోజు మీకు ఆర్థిక శ్రేయస్సును ఇస్తాయో కూడా మీకు తెలుసు.

Published on: Aug 17, 2026, 09:17:13 IST
Advertisement

శ్రావణ మాసంలో శుక్ల పంచమి తిథిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 17న సోమవారం రోజున నాగ పంచమి పర్వదినం వచ్చింది. ఈ విశేషమైన రోజున భోళా శంకరుడితో పాటు నాగ దేవతలను పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.

ఈరోజు నాగ పంచమి వేళ ఏ రాశి వారు ఏం చేయాలి? 12 రాశులకు ప్రత్యేక పూజా పరిహారాలు!
ఈరోజు నాగ పంచమి వేళ ఏ రాశి వారు ఏం చేయాలి? 12 రాశులకు ప్రత్యేక పూజా పరిహారాలు!

ముఖ్యంగా శ్రావణ సోమవారంతో కలిసిరావడం వల్ల ఈ రోజంతా శివనామస్మరణతో మార్మోగుతోంది. ఈ పవిత్ర దినాన శని, రాహు-కేతువుల దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి, అదృష్టాన్ని ఆకర్షించడానికి జ్యోతిష్య శాస్త్రం కొన్ని అద్భుతమైన మార్గాలను సూచించింది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ప్రతి రాశి వారూ తమ జన్మరాశిని బట్టి పూజా విధానాలను ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

మేష రాశి: ఈ రాశి వారు నాగ పంచమి నాడు శివలింగానికి చందనం కలిపిన జలాన్ని సమర్పించాలి. అలాగే నాగ దేవతకు శెనగలను నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

వృషభ రాశి: వృషభ రాశి వారు ఈ పర్వదినాన శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయాలి. దీని వల్ల భోళా శంకరుడి కటాక్షంతో కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

మిథున రాశి: శివలింగానికి మారేడు దళాలు సమర్పించడం ఈ రాశి వారికి చాలా మంచిది. దీని వల్ల జాతకంలో రాహువు వల్ల కలిగే అశుభ ప్రభావాలు తొలగిపోతాయి.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు ఈ రోజు నిష్టతో శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఇది ఆర్థిక పరమైన ఇబ్బందులను తొలగించి సిరి సంపదలను తెస్తుంది.

కన్యా రాశి: కన్యా రాశి వారు శివునికి గరిక సమర్పించి, నాగ దేవతకు పాలు పోయాలి. ఆవు పేడతో నాగుపాము బొమ్మను గీసి పూజించడం కూడా ఎంతో శుభప్రదం.

తులా రాశి: నాగ పంచమి రోజు నాగ దేవతకు పరమాన్నం నైవేద్యం పెట్టాలి. శివలింగంపై వెండి నాగుపాముల జంటను సమర్పిస్తే కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.

వృశ్చిక రాశి: జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించడానికి ఈ రాశి వారు చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు నాగ దేవతకు శనగ పప్పును సమర్పించాలి. ఇలా చేయడం వల్ల భక్తుల మనోభీష్మాలు నెరవేరుతాయి.

మకర రాశి: అపరాజిత పుష్పాలను శివలింగానికి సమర్పించడం ద్వారా రాహు-కేతువుల చెడు ప్రభావం తగ్గి శివానుగ్రహం లభిస్తుంది.

కుంభ రాశి: కుంభ రాశి వారు ఈ పవిత్ర రోజున 'ఓం నమః శివాయ' మంత్రాన్ని నిష్టతో జపించాలి. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని చేకూరుస్తుంది.

మీన రాశి: మీన రాశి వారు నాగ దేవతతో పాటు సంపూర్ణ శివ కుటుంబాన్ని పూజించాలి. దీనివల్ల జీవితంలోని సమస్త అడ్డంకులు తొలగిపోతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe