నాగుల చవితి 2026: మహిళలు తప్పక పాటించాల్సిన 6 నియమాలు.. పూజలో ఈ తప్పులు చేయకండి.. కాలసర్ప దోషానికి ప్రత్యేక పరిహారం!
మన హిందూ సంప్రదాయంలో నాగుల చవితికి ఎంతో విశిష్టత ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య, ఐశ్వర్యాల కోసం మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. అయితే పూజా సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పొరపాట్లు చేయకూడదో ఈ కథనంలో తెలుసుకుందాం.
మన హిందూ సంప్రదాయంలో నాగుల చవితికి ఎంతో విశిష్టత ఉంది. నాగుల చవితి నాడు నాగదేవతను ప్రత్యేకించి పూజిస్తారు. మహిళలు కుటుంబ సౌభాగ్యం, సంతాన క్షేమం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖ సంతోషాల కోసం నాగేంద్రుడిని నాగుల చవితి నాడు ప్రత్యేకించి పూజించడం జరుగుతుంది. నాగుల చవితి రోజున ఉపవాసం కూడా ఉంటారు. పుట్టలో పాలు పోయడం, వివిధ రకాల పరిహారాలను కూడా అనుసరిస్తూ ఉంటారు.

నాగుల చవితి నాడు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. మహిళలు తప్పకుండా ఈ ఆరు నియమాలు పాటించేటట్టు చూసుకోండి. అలాగే జాతకంలో కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి కూడా ఈ పరిహారాలను పాటించవచ్చు.
నాగుల చవితి నాడు పొరపాటున కూడా మహిళలు చేయకూడని ఆరు పొరపాట్లు, పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి
1.తెల్లవారుజామున స్నానం
నాగుల చవితి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అలాగే ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసి అలంకరించాలి.
2.ఉపవాసం
కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఉపవాసం ఉంటే మంచిది. ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉపవాసం పాటించండి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే పాలు, పండ్లు వంటివి తీసుకోండి.
3.నాగదేవతకు ప్రత్యేక పూజ
నాగేంద్రుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు పసుపు, కుంకుమలు, పూలు సమర్పించి ప్రత్యేకించి పూజలు చేయాలి.
4.నాగ స్తోత్రాలు, మంత్రాల పఠనం
ఆ రోజు నాగదేవతను స్మరిస్తూ నాగ స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం వంటివి చదువుకోండి. భక్తితో నాగేంద్రుడిని ఆరాధించండి.
5.దానాలు
ఈ పవిత్రమైన రోజు శక్తి మేరకు దానాలు చేయడం మంచిది. అన్నదానం, వస్త్రదానం ఇలాంటివి ఆచరించవచ్చు.
6.కుటుంబ క్షేమం కోసం ప్రార్థన
మహిళలు భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని నాగదేవతను ప్రార్థిస్తే కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది.
నాగుల చవితి పూజలో ఈ తప్పులు చేయకండి
- పూజ చేసే ప్రదేశాన్ని అపరిశుభ్రంగా ఉంచడం మంచిది కాదు.
- అలాగే నిర్లక్ష్యంగా నాగేంద్రుడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచకండి.
- పూజ సమయంలో కోపం, కలహాలకు దూరంగా ఉంటే మంచిది.
- పుట్టలో చేతులు పెట్టడం, కర్రలతో తవ్వడం వంటి తప్పులు చేయకూడదు.
- పూజలో ఉపయోగించే పండ్లు, పూలు, నైవేద్యాలు శుభ్రంగా, తాజాగా ఉండేటట్టు చూసుకోవాలి.
- పుట్టలో పాలు పోస్తే పాములకు హాని కలగవచ్చు. కనుక పాములకు నేరుగా పాలు పోయొద్దు. నాగదేవత విగ్రహానికి లేదా చిత్రపటానికి మాత్రమే పాలు సమర్పించడం మంచిది.
కాలసర్ప దోష నివారణకు నాగుల చవితి నాడు ఈ పరిహారాన్ని పాటించండి
కొంతమంది జాతకంలో కాలసర్ప దోషం ఉంటుంది. రాహు, కేతువుల మధ్య మిగిలిన గ్రహాలు ఉన్నప్పుడు జాతకంలో ఈ కాలసర్ప దోషం ఏర్పడుతుంది. ఈ దోషం ఉన్నట్లయితే పెళ్లి ఆలస్యం అవుతుంది. జీవితంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి.
ఈ దోషంతో సతమతమవుతున్నట్లయితే నాగుల చవితి నాడు ఈ పరిహారాన్ని పాటించండి. ఈ పరిహారాన్ని పాటిస్తే నాగ, సర్ప దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య విశ్వాసం.
ఉదయాన్నే స్నానం చేసి శివాలయానికి వెళ్లి శివలింగానికి భక్తితో అభిషేకం చేయాలి. నాగేంద్రుడికి పసుపు, కుంకుమలు, పుష్పాలు సమర్పించండి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని అర్చన చేయించుకోండి.
కుదిరితే 'ఓం నమః శివాయ' లేదా 'ఓం సర్పేభ్యో నమః' అనే మంత్రాలను భక్తితో జపించండి.
నాగేంద్రుడికి ఇష్టమైన పూలు, నైవేద్యాలు
నాగేంద్రుడికి మల్లెపూలు, మందార పూలు, చామంతి పూలు, గన్నేరు పూలు, తామర పూలు సమర్పిస్తే నాగేంద్రుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చని భక్తుల నమ్మకం.
అలాగే నాగుల చవితి నాడు నాగేంద్రుడికి పాలు, చలిమిడి, వడపప్పు, అరటిపండ్లు, కొబ్బరికాయ, చిమ్మిలి, బెల్లం పాయసం వంటివి నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


