Unstoppable Rasis: న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారితో గెలవడం అంత సులువు కాదు!

న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా గెలవాలనే అనుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై గెలవడం అంత సులువు కాదు. వారితో గెలవాలంటే చాలా కష్టమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అద్భుతమైన మనోబలం కలిగి ఉంటారు.

Published on: Mar 28, 2026, 11:00:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా గెలవాలనే అనుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై గెలవడం అంత సులువు కాదు. వారితో గెలవాలంటే చాలా కష్టమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా అద్భుతమైన మనోబలం, తెలివితేటలను కలిగి ఉంటారు. కాబట్టి వారితో పోటీ పడటం అంత ఈజీ కాదు. మరి న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వారితో పోటీ పడడం కష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.

Unstoppable Rasis: న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారితో గెలవడం అంత సులువు కాదు! (pinterest)
Unstoppable Rasis: న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారితో గెలవడం అంత సులువు కాదు! (pinterest)

ఈ తేదీల్లో పుట్టిన వారితో గెలవడం అంత ఈజీ కాదు.. ఎంతో కష్టపడితే కానీ గెలవలేము

రాడిక్స్ సంఖ్య 1

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా దృఢంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సూర్యుడు గ్రహాలకు రాజు.

సూర్యుని అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. పైగా ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయ్యే దాకా ఏమాత్రం ఆగరు. వీరితో గెలవడం చాలా కష్టంతో కూడుకున్నది. ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. కష్ట సమయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

రాడిక్స్ సంఖ్య 8

ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. వీరు గంభీరంగా, ఓపికతో ఉంటారు. వీళ్లతో గెలవడం అంత ఈజీ కాదు. వీరిని ఓడించడానికి చాలా కష్టపడాలి. సరైన ప్లాన్, ఓర్పు ఉంటేనే గెలవడం సాధ్యం.

వీరు బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ సరైన టైమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విజయాలను అలా వారు దక్కించుకుంటారు. మానసికంగా వీరిని దెబ్బతీయడం కూడా కష్టం. ఈ తేదీల్లో పుట్టిన వారితో గెలవాలంటే వారిని మిత్రులుగా చేసుకోవాలి. అలాగే మేధస్సు, పని తనంతో ముందుకు వెళ్ళాలి.

రాడిక్స్ సంఖ్య 9

ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 9 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి కుజుడు. కుజుడు యుద్ధ వీరుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా సాహసవంతులు. వీరితో గెలవడం సులువు కాదు. దేనికి భయపడరు.

పైగా కష్ట పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు. రెట్టింపు ఉత్సాహంతో ఓటమి నుంచి బయటకు వస్తారు. పోరాటపటిమ వీరి బలం. శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరిని ఓడించడం అంత ఈజీ కాదు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More