గ్రహాలు కాలక్రమేణా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభయోగాలను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు సమస్యలు వస్తే, కొన్నిసార్లు మాత్రం చాలా విధాలుగా లాభాలు కలుగుతాయి. మరో రెండు రోజుల్లో, అంటే ఏప్రిల్ 19న, శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, శుక్రుడు విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికే కారకుడు. శుక్ర సంచారంలో మార్పు వస్తే, అది ప్రత్యేకమైన యోగాలను కూడా తీసుకొస్తుంది. అది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది.
పంచ మహాపురుష రాజయోగం

ఈసారి శుక్ర సంచారంలో మార్పు రావడంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీనిని పంచ మహాపురుష రాజయోగంలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ పంచ మహాపురుష రాజయోగం వలన కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కెరీర్లలో కూడా మంచి మార్పులను చూస్తారు. మరి అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.
పంచ మహాపురుష రాజయోగంలో ఒకటైన మాలవ్య రాజయోగం.. పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది?
మేషరాశి:
మేషరాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సంతోషంగా ఉంటారు. అదృష్టం పెరుగుతుంది. ఈ రాజయోగంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి మాలవ్య రాజయోగం ప్రయోజనాలు కలిగిస్తుంది. ఆర్థిక పరంగా లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
మిధున రాశి:
మిధున రాశి వారు బాగా ఆలోచించే సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరంగా తొందరపడకండి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం ఆర్థికపరంగా లాభాలను తీసుకువస్తుంది. కెరీర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. మీ పనికి తగ్గ ప్రశంసలను పొందుతారు.
సింహ రాశి:
{{/usCountry}}కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం ఆర్థికపరంగా లాభాలను తీసుకువస్తుంది. కెరీర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. మీ పనికి తగ్గ ప్రశంసలను పొందుతారు.
సింహ రాశి:
{{/usCountry}}సింహ రాశి వారికి కెరీర్ బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. మీ పనికి ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కన్య రాశి:
కన్యా రాశి వారికి ఇది శుభ సమయం అని చెప్పొచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. ఏదైనా ప్రయాణాలు చేయడానికి ప్లాన్ వేస్తారు. మీ సోదరుల నుంచి శుభవార్తలు వింటారు.
తులా రాశి:
తులా రాశి వారికి కాస్త మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు అయితే వస్తాయి. ఊహించని వార్తలను ఈ సమయంలో మీరు విని షాక్ అవుతారు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కొత్త కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారు సహనంతో వ్యవహరించాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరంగా ఆలోచించకుండా మాట్లాడి మీ ప్రేమ జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టుకోకండి. జాగ్రత్తగా వ్యవహరించండి.
మకర రాశి:
మకర రాశి వారికి ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి కెరీర్‌లో కూడా మంచి మార్పులు వస్తాయి. ఈ సమయంలో విద్యార్థులకు కూడా ప్రయోజనాలు కలుగుతాయి.
కుంభ రాశి:
కుంభ రాశి వారు సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. విజయాలను అందుకుంటారు.
మీన రాశి:
మీన రాశి వారు సానుకూల మార్పులు చూస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది.