Pelli Muhurtham: మూడు నెలల మూఢం తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు.. ముహూర్తాల ఫుల్ లిస్ట్ ఇదిగో!

మూఢం కారణంగా పెళ్లి ముహూర్తాలు లేవు. పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. కానీ ఇక మళ్లీ పెళ్లి సందడిని చూడబోతున్నాము. ఈ నెల 19 నుంచి మళ్లీ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే చాలా మంది పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకుని ఉన్నారు. మూడు నెలల బ్రేక్ తర్వాత ముహూర్తాలు రావడంతో శుభకార్యాల సందడిని చూడబోతున్నాము.

Published on: Feb 10, 2026, 15:00:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు ఒకటవ్వడం మాత్రమే కాదు, రెండు కుటుంబాలు, రెండు మనసులు ఒకటవ్వడం. పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. అయితే ఆ బ్రేక్ ఇప్పుడు ముగిసిపోయే టైం వచ్చింది. త్వరలోనే పెళ్లి భాజలు మళ్లీ వినపడబోతున్నాయి. యువతీ యువకులు మూడు ముళ్లతో ఒకటయ్యే సమయం వచ్చేస్తుంది.

Pelli Muhurtham: మూడు నెలల మూఢం తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు.. ముహూర్తాలు ఫుల్ లిస్ట్ (pinterest)
Pelli Muhurtham: మూడు నెలల మూఢం తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు.. ముహూర్తాలు ఫుల్ లిస్ట్ (pinterest)

మూడు నెలల పాటు మూఢం కారణంగా పెళ్లి ముహూర్తాలు లేవు. పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. కానీ ఇక మళ్లీ పెళ్లి సందడిని చూడబోతున్నాము. ఈ నెల 19 నుంచి మళ్లీ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే చాలా మంది పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకుని ఉన్నారు. మూడు నెలల బ్రేక్ తర్వాత ముహూర్తాలు రావడంతో మళ్లీ శుభకార్యాల సందడిని చూడబోతున్నాము.

మూడు నెలల మూఢం

గత సంవత్సరం నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 13 దాకా మూఢం ఉండడంతో ఎలాంటి శుభకార్యాలు కూడా జరగలేదు. పెళ్లిళ్లు మళ్లీ జరగడానికి ప్రిపరేషన్ కూడా మొదలయ్యింది. మాఘ మాసం మొదలైనప్పటికీ మూఢం వలన ఈ నెల 18 దాకా ఎలాంటి ముహూర్తాలు లేవు. కానీ 19 నుంచి అనగా ఫాల్గుణ మాసం మొదలవడంతో పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్ పడింది.

శుభకార్యాలు షురూ

మూఢం పూర్తయిన తర్వాత మళ్లీ శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలు ఇలా అన్నీ జరగబోతున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకున్న వారు మూఢం తర్వాత ఒకటవబోతున్నారు. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో మళ్లీ చాలామందికి ఉపాధి దొరకబోతోంది. ఇక ముహూర్తాలకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకుందాం.

పెళ్ళి ముహూర్తాలు లిస్ట్ ఇదిగో

ఈ సంవత్సరం ఫిబ్రవరి తో పాటు మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ నెలల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరగబోతున్నాయి. మరి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం.

ఫిబ్రవరి 2026: 19, 20, 21, 24, 25, 26

మార్చి 2026:

5, 6, 7, 8, 11, 12, 13, 14, 20, 21, 25

ఏప్రిల్ 2026:

1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 21, 25, 26, 28, 29, 30

ఇక మూఢం ముగిసిపోతుండడంతో ఫిబ్రవరి 19 నుంచి మళ్లీ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభకార్యాలు జరుపుకోవాలని కుదుర్చుకోవచ్చు. ఇక వరుసగా మూడు నెలల పాటు ముహూర్తాలు ఉన్నందున శుభకార్యాలు నిర్వహించుకునే వారు ముందుగానే అలెర్ట్ అవ్వడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More