Rahu Favorite Rasis: రాహువుకు ఈ రాశులంటే మహా ప్రీతి.. ఎల్లప్పుడూ మద్దతు పొందుతారు!
జాతకంలో రాహువు స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశుల వారికి మాత్రం రాహువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. రాహువుకు కొన్ని రాశులు అంటే పరమ ప్రీతి. మరి ఏ రాశుల వారికి ఎల్లప్పుడూ రాహువు అనుగ్రహం ఉంటుంది? ఏ రాశి వారు రాహువుకు ఎక్కువ ఇష్టం వంటి విషయాలను తెలుసుకుందాం.
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువుని నీడ గ్రహం అని అంటారు. జాతకంలో రాహువు స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. విదేశీ అవకాశాలు, టెక్నికల్, పొలిటికల్ రంగాల్లో కూడా సక్సెస్‌ను అందుకుంటారు. అదే ఒకవేళ రాహువు స్థానం బలహీనంగా ఉన్నట్లయితే కన్ఫ్యూజన్, స్థిరత్వం లేకపోవడం, నష్టాలు వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ రాశుల వారికి మాత్రం రాహువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. రాహువుకు కొన్ని రాశులు అంటే పరమ ప్రీతి. మరి ఏ రాశుల వారికి ఎల్లప్పుడూ రాహువు అనుగ్రహం ఉంటుంది? ఏ రాశి వారు రాహువుకు ఎక్కువ ఇష్టం వంటి విషయాలను తెలుసుకుందాం.
రాహువు ప్రభావం
రాహువు ప్రభావంతో జీవితంలో లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. ఈ గ్రహం ఆకస్మాత్తు సంఘటనలు, ఆసక్తి, మోహం, లోభం వంటి అంశాలతో సంబంధం ఉంటుంది. దీని ప్రభావం చర్మ సమస్యలు, ప్రయాణాలు, ఆధునిక సాంకేతికతకు సంబంధించిన రంగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జాతకంలో రాహువు ఎక్కడ ఉన్నా కూడా మార్పులను తీసుకొస్తుంది. వ్యక్తిని కొత్త పరిస్థితులకు పరిచయం చేస్తుంది.
రాహువుకు ఈ రాశులంటే మహా ప్రీతి
1.మిథున రాశి:
మిథున రాశి వారికి రాహువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశి వారు చాలా తెలివైన వారు. అలాగే బాగా మాట్లాడతారు. రాహువు ఎప్పుడూ కూడా ఈ రాశి వారికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడు. ఈ రాశి వారు ఊహించని విధంగా కెరీర్‌లో, వ్యాపారంలో లాభాలను పొందుతారు. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. ఈ రాశి వారు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడరు. రాహువు అనుగ్రహంతో జీవితంలో పురోగతి ఉంటుంది.
2.కన్యా రాశి:
కన్యా రాశి అంటే కూడా రాహువుకి ఎంతో ఇష్టం. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా బ్యాలెన్స్‌గా ఉంటారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఈ రాశి వారు ఎప్పుడూ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి తప్పులు చేయరు. రాహువు అనుగ్రహంతో ఈ రాశి వారు అన్నిటిలో బాగా రాణించగలరు. టెక్నాలజీ, మేనేజ్మెంట్ రంగాల్లో బాగా రాణిస్తారు. ఎప్పుడూ కూడా కచ్చితంగా ఉంటారు. సరైన టైంలో నిర్ణయాలు తీసుకోవడం వీరికి బాగా తెలుసు.
3.కుంభ రాశి:
కుంభ రాశి వారికి రాహువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా రాహువు సపోర్ట్ చేస్తాడు. ఊహించని లాభాలను పొందుతారు. రాహువు కారణంగా ఎప్పుడూ కూడా అనుకోని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా సులభంగా సాధిస్తారు. సానుకూల మార్పులు చూస్తారు. రాహువు అనుగ్రహంతో ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


