జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు ఛాయా గ్రహాలు ఎప్పుడూ వ్యతిరేక దిశలో అంటే వక్ర గతిలో ప్రయాణిస్తుంటాయి. ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి సుమారు ఏడాదిన్నర సమయం పడుతుంది. ఈ గ్రహాలు తమ స్థానాన్ని మార్చినప్పుడల్లా పన్నెండు రాశుల వారి జీవితాల్లోనూ ఊహించని మార్పులు వస్తుంటాయి.

ప్రస్తుత సంవత్సరంలో రాహువు శని కుంభ రాశిలోనూ, కేతువు సూర్య భగవానుని సింహ రాశిలోనూ సంచరిస్తున్నారు. అయితే, రాబోయే డిసెంబర్ నెలలో ఈ రెండు గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి. ఈ పరిణామం కారణంగా రాబోయే 68 రోజుల కాలంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఏయే రాశుల అదృష్టం తలకిందులు కానుందో ఇప్పుడు పరిశీలిద్దాం.
మేష రాశి: వృత్తి జీవితంలో సరికొత్త మైలురాళ్లు
మేష రాశి వారికి రాహు-కేతువుల ఈ గోచార మార్పు ఎంతో లాభదాయకంగా మారుతుంది. రాబోయే కాలం ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారికి ప్రగతి మార్గాలు తెరుచుకుంటాయి. వృత్తి జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయి, ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తోటి ఉద్యోగులు, అధికారుల సహకారంతో అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారు.
కన్యా రాశి: విద్యా సంబంధిత ప్రయాణాలు
కన్యా రాశి వారికి రాహు-కేతువుల ప్రభావం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులకు, పరిశోధన రంగంలో ఉన్నవారికి ఈ సమయం సువర్ణావకాశం అని చెప్పవచ్చు. కొందరు ముఖ్యమైన విద్యా విషయక పర్యటనలు చేసే సూచనలున్నాయి. ఈ ప్రయాణాల ద్వారా భవిష్యత్తుకు ఉపయోగపడే విలువైన జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.
ధనుస్సు రాశి: అత్మవిశ్వాసంతో ముందడుగు
ధనుస్సు రాశి వారికి ఈ గోచారం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ కాలంలో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని తలపెట్టినా వెనుకంజ వేయకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. నలుగురితో కలిసిమెలిసి తిరగడంలో, కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడంలో దూసుకుపోతారు. ఈ సామాజిక చొరవ భవిష్యత్తులో మీకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి.
మిథున రాశి: గురువుల ఆశీస్సులతో కష్టాల కడతేర్పు
{{/usCountry}}ధనుస్సు రాశి వారికి ఈ గోచారం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ కాలంలో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని తలపెట్టినా వెనుకంజ వేయకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. నలుగురితో కలిసిమెలిసి తిరగడంలో, కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడంలో దూసుకుపోతారు. ఈ సామాజిక చొరవ భవిష్యత్తులో మీకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి.
మిథున రాశి: గురువుల ఆశీస్సులతో కష్టాల కడతేర్పు
{{/usCountry}}మిథున రాశి వారికి ఈ గ్రహాల సంచారం ఎంతో సానుకూల ఫలితాలను అందిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు గురువులు లేదా శ్రేయోభిలాషుల సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. వారి సమయస్ఫూర్తి, సహాయసహకారాలతో ఎలాంటి క్లిష్టమైన సమస్యలనైనా ఇబ్బంది లేకుండా సులభంగా అధిగమిస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
తులా రాశి: విద్యార్థులకు తిరుగులేని విజయం
తులా రాశి వారికి రాహు-కేతువుల గమనం అత్యంత శుభప్రదంగా మారుతోంది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలలో అద్భుతమైన మార్కులు సాధించి కుటుంబానికి పేరు తెస్తారు. మేథోపరమైన చర్చల్లో విజయం సాధిస్తారు.
మీన రాశి: ఆధ్యాత్మిక చింతన - మానసిక ప్రశాంతత
మీన రాశి వారికి ఈ గోచార కాలం అత్యంత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. లౌకిక విషయాల కంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీ మనస్సు ఎక్కువగా నిమలమవుతుంది. దైవ దర్శనాలు, పూజలు, సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దీనివల్ల మనసుకు అంతులేని ప్రశాంతత లభించడంతో పాటు ఇంటా బయటా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.