...
...
Next Story

రేవతి నక్షత్రంలోకి శని సంచారం - ఈ 5 రాశుల వారికి తిరుగులేని రాజయోగం…!

శని దేవుడు రేవతి నక్షత్రం మొదటి దశలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 9 వరకు కొనసాగే ఈ సంచారంతో ఐదు రాశుల వారి జాతకం మారనుంది.

Published on: Aug 20, 2026, 11:46:45 IST
Advertisement

జ్యోతిష్యశాస్త్రంలో న్యాయాధిపతిగా, కర్మఫల దాతగా భావించే శనిదేవుడు అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. ఒక్కో రాశిచక్రంలో తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి శనికి సుమారు 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ క్రమంలో శని తన నక్షత్రరాశిని, స్థానాలను మారుస్తూ ఉన్నప్పుడు దాని ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంపైనా తీవ్రంగా ఉంటుంది. 2026 ఆగస్టు 20న శనిదేవుడు రేవతి నక్షత్రం మొదటి దశలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్ర సంచారం అక్టోబర్ 9 వరకు కొనసాగుతుంది.

రేవతి నక్షత్రంలోకి శని సంచారం
రేవతి నక్షత్రంలోకి శని సంచారం

రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడి నక్షత్రంలో శని ప్రవేశించడం అనేది వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ, పాత కర్మల ముగింపు, అలాగే పెండింగ్‌లో ఉన్న పనుల పూర్తీకరణకు సంకేతంగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. రేవతి నక్షత్రంలో శని సంచరించడం వల్ల వ్యక్తికి నిజాయితీ, ధైర్యం, కష్టపడే తత్వం, ఆత్మగౌరవం పెరుగుతాయి. ఈ సమయంలో ప్రజల దృష్టి ఆధ్యాత్మికత, మతం, దాతృత్వం వైపు ఎక్కువగా మళ్లుతుంది. మొత్తం 12 రాశులపై దీని ప్రభావం ఉన్నప్పటికీ….. ఐదు రాశుల వారికి మాత్రం ఈ సంచారం అదృష్టాన్ని, విపరీతమైన ధనలాభాన్ని తెచ్చిపెట్టనుంది.

లబ్ధి పొందే రాశుల వివరాలు….

వృషభ రాశి :

శని నక్షత్ర మార్పు వల్ల వృషభ రాశి వారికి సోదరులతో ఉన్న అనుబంధం మెరుగుపడుతుంది. మీ దీర్ఘకాలిక కలలు, లక్ష్యాలు నెరవేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలో మీ సీరియస్‌నెస్‌ని చూసి సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులు మీతో పరిచయాలు పెంచుకుంటారు. కొత్త ఆదాయ మార్గాలు తెరవడమే కాకుండా, పాత మార్గాల నుంచి కూడా డబ్బు అందుతుంది. అయితే, ఈ సమయంలో ఎలాంటి షార్ట్‌కట్‌ మార్గాలను ఎంచుకోవద్దు. వ్యాపారంలో లేదా స్నేహంలో ఎవరికీ గుడ్డిగా వాగ్దానాలు చేయవద్దు.

మిథున రాశి :

కన్యా రాశి వారికి కొత్త వ్యాపార భాగస్వామ్యాలు లభిస్తాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. దంపతుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి వైవాహిక జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఆర్థికంగా బలోపేతం కావడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ, వ్యాపారం, కుటుంబ విషయాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. అయితే మాట్లాడేటప్పుడు కఠినమైన పదాలను ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి.

తులా రాశి :

తులారాశి వారికి పనిలో ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. శని ఇచ్చే క్రమశిక్షణ వల్ల మీ ఆరోగ్యం కుదుటపడటమే కాకుండా కెరీర్‌లో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. రావలసిన పాత బాకీలు లేదా నిలిచిపోయిన నిధులు చేతికి అందుతాయి. దీని వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కానీ సామర్థ్యానికి మించి పనిచేసి మానసిక ఒత్తిడికి గురికావద్దని పండితులు సూచిస్తున్నారు.

మకర రాశి :

మకర రాశి వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో చేసే చిన్నపాటి ప్రయాణాలు కూడా మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపారంలో ఆశించిన విజయం సాధిస్తారు. మీ మాట్లాడే తీరు మారి… సంబంధాలను చక్కగా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగవుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe