సెప్టెంబర్ 27 ఆదివారం: ఈ రాశులకు కొత్త అవకాశాలు.. మరి కొందరికి జాగ్రత్త అవసరం!
ఆదివారం సూర్యదేవుడి ఆరాధనకు ప్రత్యేకమైన రోజుగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. 2026 సెప్టెంబర్ 27 ఆదివారం, సూర్యుడు కన్యా రాశిలో ఉండి హస్త నక్షత్రంలోకి ప్రవేశించే రోజు అని పంచాంగ, గ్రహస్థితి వివరాలు సూచిస్తున్నాయి.
హిందూ సంప్రదాయంలో ఆదివారం సూర్య దేవ పూజకు ఎంతో విశిష్టమైన రోజు. ప్రతి రోజు మారుతున్న గ్రహాల గతుల ఆధారంగా మేషం మొదలు మీనం వరకు అన్ని రాశుల వారికి ఫలితాలు మారుతుంటాయి. కొందరికి కొత్త బాధ్యతలు దక్కితే, మరికొందరికి ఊహించని ధనలాభం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే నేటి దినఫలాలను వివరంగా పరిశీలిద్దాం.

1. మేష రాశి:
మేష రాశి వారికి నేడు వృత్తిపరంగా కొన్ని నూతన బాధ్యతలు ఎదురుకావచ్చు. మొదట్లో పనిభారం ఎక్కువగా అనిపించినా, సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే సవాళ్లను సులభంగా అధిగమిస్తారు. ఉద్యోగంలో అధికారులతో కీలక చర్చలు జరిగే సూచనలున్నాయి. పాత పరిచయాలు వ్యాపారంలో లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.
2. వృషభ రాశి:
వృషభ రాశి వారికి గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ వేగవంతం అవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు పడే శ్రమకు తగిన గుర్తింపు లభించి, కీలకమైన బాధ్యతలను అందుకుంటారు. పాత కస్టమర్ల నుంచి మళ్లీ ఆర్డర్లు రావడం వల్ల వ్యాపారం పుంజుకుంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కుటుంబంలో పెద్దల సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
3. మిథున రాశి:
మిథున రాశి వారు నేడు తమ మాటతీరుతో కష్టతరమైన పనులను సులభంగా పూర్తి చేసుకుంటారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుంది. ఆకస్మిక ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల బాధ్యతలను మీరే స్వయంగా చక్కబెట్టాల్సి వస్తుంది.
4. కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ రోజు తీరిక లేని క్షణాలు గడవాల్సి వస్తుంది. ఒకేసారి అనేక బాధ్యతలు రావడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు. పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం ఉత్తమం. వ్యాపారంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందైనా పూర్తి సమారాన్ని సేకరించండి. కుటుంబ పెద్దల అండదండలు మీకు లభిస్తాయి. నిద్రలేమి కారణంగా అలసట ఆవహించవచ్చు.
5. సింహ రాశి:
సింహ రాశి వారికి నేడు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. కొత్త ఒప్పందాల విషయమై వ్యాపార వర్గాల్లో చర్చలు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా మారుతుంది. ఎంతోకాలంగా రావలసిన బాకీలు తిరిగి చేతికి అందే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలపై చర్చిస్తారు.
6. కన్యా రాశి:
కన్యా రాశి వారు నేడు ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యమైన పత్రాలు, ఆఫీసు రిపోర్ట్‌లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల పనులు చెడిపోయే ప్రమాదం ఉంది. వ్యాపారంలో నగదు లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండండి. అనవసర కొనుగోళ్లకు స్వస్తి చెప్పడం ద్వారా ఆర్థికంగా నిలకడ సాధించవచ్చు.
7. తులా రాశి:
తులా రాశి వారికి ఇతరుల సహకారం లభించడం వల్ల కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. తోటి ఉద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అయితే నిబంధనలను క్షుణ్ణంగా చదవడం మంచిది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి.
8. వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. గతంలోని కొన్ని పాత బాధ్యతలు మళ్లీ మీ ముందుకు రావచ్చు. కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. కుటుంబ సభ్యులతో మీ మనసులోని భావాలను పంచుకోవడం వల్ల మనసు తేలికవుతుంది.
9. ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లేందుకు నేడు అద్భుతమైన రోజు. ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైన సమాచారం అందే అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన పరిచయాలు పురోభివృద్ధిని ఇస్తాయి. కుటుంబంలో సుఖసంతోమలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది, అయినప్పటికీ బయటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.
10. మకర రాశి:
మకర రాశి వారు నేడు ప్రతీ విషయంలోనూ క్రమశిక్షణను పాటించడం చాలా ముఖ్యం. సమయానికి పనులు పూర్తి చేసే ఒత్తిడి ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఆర్థిక లావాదేవీల పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య మీలో కొంత ఆందోళన కలిగిస్తుంది.
11. కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బట్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. గతంలో చేసిన పనులకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు నిలిచిపోయిన ధనం తిరిగి చేతికి అందుతుంది. మిత్రులతో సమయం గడపడం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది. జీవిత భాగస్వామి నుంచి సంతోషకరమైన వార్త వింటారు. అతిగా తిరగడం వల్ల శారీరక అలసట కలుగుతుంది.
12. మీన రాశి:
మీన రాశి వారికి ఉదయం పూట పనులు నెమ్మదిగా సాగినా, మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. సహోద్యోగి సాయంతో ఒక క్లిష్టమైన సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో ఎలాంటి కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండటమే మంచిది. కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కొద్దిగా నీరసంగా అనిపించవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


