డిసెంబర్ 11న మీన రాశిలో శని భగవానుడు నేరుగా సంచారం చేస్తాడు, గత కొన్ని నెలలుగా తిరోగమనంలో ఉన్న శని ప్రత్యక్ష సంచారం అన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో కీలక మార్పులు రానున్నాయి.
శని ప్రత్యక్ష సంచారం

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మ ప్రదాతగా, న్యాయకారకుడిగా పరిగణిస్తారు. గత జూలై 27 నుంచి వక్రీ స్థితిలో ఉన్న శని డిసెంబర్ 11న తిరిగి సాధారణ మార్గంలో పయనించనున్నారు. రాశి మారకపోయినా, ఆయన చలనం మారడం వల్ల నిలిచిపోయిన పనులన్నీ వేగవంతం కానున్నాయి.
మేష రాశి
మేష రాశి వారు ఈ కాలంలో ఖర్చుల విషయంలో తీవ్ర అప్రమత్తత పాటించాలి. వృత్తిరీత్యా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విదేశాలకు సంబంధించిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం వల్ల క్షణం తీరిక ఉండదు. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం అత్యంత ముఖ్యం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఆదాయం, లాభాలకు సంబంధించిన అంశాలు చాలా కీలకం. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పాత పరిచయాల ద్వారా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులతో కలిసి పనిచేసేందుకు ఇది సరైన సమయం. ఆర్థిక స్థితిని పటిష్టం చేసుకునే ప్రణాళికలు సఫలమవుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారి కార్యక్షేత్రంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి అద్భుతమైన అవకాశాలు తలపు తడుతాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలి. వ్యాపారంలో పాత ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి పూర్తి దృష్టి విద్య, కెరీర్ మరియు భవిష్యత్తు ప్రణాళికలపై ఉంటుంది. ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు ప్లాన్ చేసుకుంటారు. వృత్తిపరమైన నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలు ఎంతో ఉపయోగపడతాయి.
సింహ రాశి
{{/usCountry}}కర్కాటక రాశి వారి పూర్తి దృష్టి విద్య, కెరీర్ మరియు భవిష్యత్తు ప్రణాళికలపై ఉంటుంది. ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు ప్లాన్ చేసుకుంటారు. వృత్తిపరమైన నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలు ఎంతో ఉపయోగపడతాయి.
సింహ రాశి
{{/usCountry}}సింహ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఊహించని ఖర్చులు రావడం వల్ల బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం ఉంది. పాత ఆస్తులు లేదా పెట్టుబడులకు సంబంధించిన విషయాల కోసం తిరగాల్సి వస్తుంది. ఎలాంటి ఆర్థిక ఒప్పందం కుదుర్చుకునే ముందే పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి వైవాహిక జీవితం, వ్యాపార భాగస్వామ్యాలు చాలా ముఖ్యం. జీవిత భాగస్వామితో గతంలో ఉన్న మనస్పర్థలను చర్చల ద్వారా పరిష్కరించుకోండి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు షరతులను పూర్తిగా చదవడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారికి ఉద్యోగంలో మరియు దైనందిన జీవితంలో పెద్దఎత్తున ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పని ఒత్తిడిని బూచిగా చూపి విశ్రాంతిని నిర్లక్ష్యం చేయవద్దు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి విద్యార్థులు, ప్రేమ వ్యవహారాలు, సంతానానికి సంబంధించిన విషయాలపై ఎక్కువగా చర్చిస్తారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి. ప్రేమ బంధంలో ఉన్నవారు భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ పాత అభిరుచులకు మళ్లీ సమయం కేటాయిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి గృహ, కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇల్లు లేదా భూమికి సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి. కుటుంబంలో ఒకరి పెద్ద బాధ్యతను మీరే భుజాన వేసుకోవాల్సి వస్తుంది. ఆఫీస్ పనికి, కుటుంబ జీవితానికి మధ్య సమతుల్యత పాటించడం చాలా అవసరం.
మకర రాశి
మకర రాశి వారు తోబుట్టువులతో సంబంధాలు మరియు చిన్న ప్రయాణాలపై దృష్టి పెట్టాలి. కొత్త పరిచయాలు వ్యాపార విస్తరణకు బాటలు వేస్తాయి. ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారు ధనం మరియు కుటుంబ వ్యవహారాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పొదుపును పెంచే మార్గాలపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో మేలు జరుగుతుంది. కుటుంబంలో ఏదైనా అంశంపై చర్చ జరిగేటప్పుడు మాటపై సంయమనం పాటించండి.
మీన రాశి
మీన రాశి వారికి శని మార్గి కావడమనేది ఒక కీలక పరిణామం. కార్యాలయంలో బాధ్యతలు భారీగా పెరుగుతాయి. పాత సమస్యలను పరిష్కరించుకోవడానికి తీవ్రంగా శ్రమించాలి. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగండి.