...
...
Next Story

తులారాశిలోకి శుక్రుడి రాకతో 'మాలవ్య రాజయోగం' - ఈ 9 రాశుల వారికి అపార ధనయోగం!

సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడంతో అత్యంత శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడుతోంది. నవంబర్ 5 వరకు ఏ రాశుల వారికి అదృష్టం కలసిరానుందో, ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి….

Published on: Sep 1, 2026, 19:33:26 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో అందం, ప్రేమ, విలాసాలు, కళలు, ఐశ్వర్యానికి కారకుడిగా భావించే శుక్ర గ్రహం తన నక్షత్ర సంచారాన్ని, రాశి స్థానాన్ని మార్చుకోబోతోంది. ప్రస్తుతం కన్యారాశిలో ఉన్న శుక్రుడు…. హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 2, మధ్యాహ్నం 01:51 గంటలకు తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలో శుక్రుడు నవంబర్ 5 వరకు సుదీర్ఘకాలం సంచరిస్తాడు.

తులారాశిలోకి శుక్రుడి ప్రవేశం
తులారాశిలోకి శుక్రుడి ప్రవేశం

జ్యోతిష్య నిపుణుల ప్రకారం….. శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించినప్పుడు అత్యంత శుభప్రదమైన 'మాలవ్య రాజయోగం' రూపుదిద్దుకుంటుంది. వేద జ్యోతిష్యంలో ఈ రాజయోగానికి విశేష ప్రాధాన్యత ఉంది. మాలవ్య యోగం వల్ల జాతకులకు ఆకస్మిక ధన లాభాలు, సుఖసంతోషాలు, వ్యాపారాభివృద్ధి, శ్రేయస్సు సిద్ధిస్తాయి. ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ అందించిన వివరాల ప్రకారం…. ఈ శుక్ర గోచారం వల్ల ఏకంగా 9 రాశుల వారికి అదృష్టం ప వరిస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.

మాలవ్య రాజయోగంతో లబ్ది పొందే 9 రాశులు:

  1. మేష రాశి : శుక్రుడి తులా సంక్రమణం మేష రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఆర్థిక స్థితి వేగంగా మెరుగుపడుతుంది. విభిన్న మార్గాల నుంచి అనుకోని ధన లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
  2. మిథున రా శి: ఈ సంచారం మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలంగా రావాల్సి ఉండి ఆగిపోయిన పాత బాకీలు, మొండి బాకీలు మళ్లీ చేతికి అందుతాయి.
  3. కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఇంట్లో శ్రేయస్సు, సుఖసంతోషాలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది.
  4. సింహ రాశి : వ్యాపార రంగంలో ఉన్న సింహ రాశి వారికి ఇది గోల్డెన్ టైమ్. కొత్త బిజినెస్ డీల్స్ కుదురుతాయి. మంచి లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు.
  5. కన్యా రాశి : కన్యా రాశి వారి వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాలు ఎంతో శృంగారభరితంగా, ఆనందంగా సాగుతాయి. సంబంధాలు మరింత బలపడతాయి.
  6. తులా రాశి : సొంత రాశిలోకి శుక్రుడి రాక వల్ల తులా రాశి వారికి ప్రతి పనిలో శుభవార్తలు వింటారు. మనస్సు ఎంతో ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటుంది.
  7. ధనుస్సు రాశి : ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఉన్న ధనుస్సు రాశి వారికి కెరీర్‌లో అద్భుతమైన ప్రగతి కనిపించడమే కాక మంచి లాభాలు నమోదవుతాయి.
  8. మకర రాశి : మకర రాశి వారికి ఈ సంచార సమయం ఎంతో సానుకూలమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది. కొత్త ప్రయత్నాలు త్వరగా ఫలిస్తాయి.
  9. కుంభ రాశి : ఈ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో విశేష లాభాలు సమకూరుతాయి. ఆదాయ వనరులు పెరిగి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

జాగ్రత్తలు వహించాల్సిన రాశులు….

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe