...
...
Next Story

తులారాశిలో శుక్రుడి సంచారం - ఈ 8 రాశుల వారికి గోల్డెన్ టైమ్..! సంపదే సంపద!

అక్టోబర్ 30న తులారాశిలో శుక్రుడు ఉదయించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం…. శుక్రుడి ఈ మార్పు వల్ల మేషం, వృషభం, తుల, కుంభం సహా 8 రాశుల వారికి విపరీతమైన ధనలాభం, కెరీర్‌లో పురోగతి లభిస్తాయి.

Published on: Sep 28, 2026, 16:16:23 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శుక్రుడిని సంపద, వైభవం, భోగభాగ్యాలు, ఆకర్షణ, శ్రేయస్సుకు కారకుడిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో భౌతిక సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. ప్రస్తుతం అస్తమయ స్థితిలో ఉన్న శుక్రుడు, ద్రిక్ పంచాంగం ప్రకారం రాబోయే అక్టోబర్ 30న స్వక్షేత్రమైన తులారాశిలో ఉదయించబోతున్నాడు.

తులారాశిలోకి శుక్రుడు
తులారాశిలోకి శుక్రుడు

సాధారణంగా శుక్రుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు అస్తమిస్తాడు. అలాగే సూర్యుడికి తగినంత దూరంలోకి వెళ్లినప్పుడు ఉదయిస్తాడు. అక్టోబర్ చివర్లో జరగబోయే శుక్రుడి ఈ ఉదయ ప్రభావం వల్ల ప్రధానంగా 8 రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆయా రాశుల వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోయి, నూతన ఆదాయ మార్గాలు సుగమం కానున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం…..

మేష రాశి :

శుక్రుడి ఉదయంతో మేష రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో సరికొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఉన్నతాధికారులు మీ పనితీరును ప్రశంసించి ప్రోత్సహిస్తారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తికావడంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులు, ఆత్మీయుల మద్దతు లభించి సౌకర్యాలు పెరుగుతాయి.

వృషభ రాశి:

ఈ రాశికి అధిపతి స్వయంగా శుక్రుడే. శుక్రుడి ఉదయం వల్ల మీ పనుల్లో వేగం పెరుగుతుంది. నిలిచిపోయిన పాత బాకీలు లేదా డబ్బులు చేతికి అందుతాయి. సంబంధ బాంధవ్యాల్లో మధురిమలు పెరుగుతాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్ఠలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరింత మెరుగుపడతాయి.

మిథున రాశి:

కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. అదనపు ఆదాయ వనరులు లభించి, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి దాంపత్య జీవితం మధురంగా మారుతుంది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి భౌతిక సుఖసంతోషాలు లభిస్తాయి. దీర్ఘకాలిక కోరికలు, లక్ష్యాలు నెరవేరుతాయి. సొంత ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే ప్రణాళికలు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి అవకాశాలు వస్తాయి. ప్రేమ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

తులా రాశి :

స్వక్షేత్రంలోనే శుక్రుడు ఉదయిస్తుండటంతో తులా రాశి వారికి మహర్దశ పడుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి శుక్రుడి సంచారం సకల సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీ వ్యక్తిత్వం నలుగురినీ ఆకట్టుకుంటుంది. కొన్ని శుభవార్తలు మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారంలో లాభాల బాట పడతారు. పాత, కొత్త మార్గాల ద్వారా ధనాగమనం ఉంటుంది.

మకర రాశి :

మకర రాశి ఉద్యోగులకు పదోన్నతులు, జీతాల పెంపు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కెరీర్‌లో సరికొత్త శిఖరాలను చేరుకుంటారు. ఆర్థికంగా బలమైన స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. కష్టకాలంలో తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks