గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. మే 15, అనగా రేపు సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. మే 15 నుంచి జూన్ 15 దాకా సూర్యుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

2026 మే నెలలో జరిగే ఈ మార్పు చాలా కీలకమైనది. సూర్యుడు కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు; ఆత్మకు, ఆత్మవిశ్వాసానికి, తండ్రికి, అధికారానికి కారకుడు. నెలరోజుల పాటు సూర్య సంచారం కారణంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో చాలామంది జీవితాల్లో ఆకస్మిక మార్పులను చూస్తారు. ఆర్థిక లాభాలు, ఉద్యోగ మార్పులు, మానసిక ఒత్తిడి ఇలా రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రత్యేక గ్రహగమనం 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య సంచారం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సూర్యుడు బలంగా ఉన్నట్లయితే మనుషుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా ఏర్పడుతుంది. ఈ నెల రోజుల పాటు సూర్యుడి ప్రభావం కారణంగా కోపం, అహంకారం లాంటివి పెరిగే ప్రమాదం ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సూర్యుని మంత్రాలను పఠించడం, ఆరాధించడం, ధ్యానం చేయడం వంటివి ప్రశాంతతను కలిగిస్తాయి.
సూర్యుడిని ఎప్పుడు ఆరాధించాలి?
సూర్యుని అనుగ్రహం కలగాలంటే సూర్యోదయం తర్వాత మొదటి గంటలో చేసే సాధన మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించండి. రాగి పాత్రలో నీళ్లు తీసుకుని, ఎర్రటి పువ్వులు, అక్షతలు వేయండి. తూర్పు వైపు నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. “ఓం ఘృణి సూర్యాయ నమః” 21 సార్లు జపిస్తే మంచిది. సూర్యుని ఆరాధించిన తర్వాత బెల్లాన్ని దానంగా ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ద్వాదశ రాశులపై ప్రభావం
మేష రాశి
మేష రాశి వారికి కెరీర్ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. కుటుంబంలో కాస్త ఉద్రిక్తతలు చోటు చేసుకోవచ్చు. ఆదివారం నాడు గోధుమలు, బెల్లాన్ని దానం చేయడం వలన మంచి ఫలితాలను చూస్తారు.
వృషభ రాశి
{{/usCountry}}మేష రాశి వారికి కెరీర్ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. కుటుంబంలో కాస్త ఉద్రిక్తతలు చోటు చేసుకోవచ్చు. ఆదివారం నాడు గోధుమలు, బెల్లాన్ని దానం చేయడం వలన మంచి ఫలితాలను చూస్తారు.
వృషభ రాశి
{{/usCountry}}ఈ రాశి వారికి ఖర్చులు పెరగవచ్చు. పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధిత సమస్యలు ఉండొచ్చు. 108 సార్లు సూర్య మంత్రాన్ని పఠిస్తే మంచిది.
మిథున రాశి
ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కమ్యూనికేషన్ రంగాల వారికి బాగుంటుంది. మానసిక శాంతి కలగాలంటే రాగి పాత్రలో నీళ్లు తాగండి.
కర్కాటక రాశి
ఈ రాశి వారు బాకీలను వసూలు చేస్తారు. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదివారం ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను దానం చేస్తే మంచిది.
సింహ రాశి
ఈ రాశి వారికి ఈ సమయం కీలకమైనది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అహంకారానికి దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.
కన్య రాశి
ఈ రాశి వారు వ్యాపారంలో మంచి మార్పులను చూస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనాన్ని పాటించాలి. గోవులకు రొట్టెలు, బెల్లాన్ని సమర్పించండి.
తులా రాశి
తులా రాశి వారికి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం నాడు సూర్యుని ఆలయానికి వెళ్లి దీపారాధన చేస్తే మంచిది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఈ సమయంలో శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. హనుమాన్ చాలీసాను పఠిస్తే కూడా శుభ ఫలితాలను చూస్తారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేస్తారు. విదేశీ వ్యాపారులకు బాగుంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. సూర్యుడికి ఎర్రటి పూలతో పూజ చేయండి.
మకర రాశి
ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వెన్నెముక, ఎముకల సమస్యలు రావచ్చు. బెల్లం, నువ్వులను దానం చేస్తే మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో ఒడిదుడుకులను చూస్తారు. సామాజికంగా హోదా పెరుగుతుంది. ఆదివారం నాడు పేదలకు స్వీట్లను పంచితే దోషాలు తొలగిపోవచ్చు.
మీన రాశి
ఆర్థిక లాభాలు ఉన్నా ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆధ్యాత్మికత వైపు దృష్టి పెడతారు. రావి చెట్టు కింద దీపారాధన చేస్తే మనశ్శాంతి కలుగుతుంది.