Sun Transit: రేపటి నుంచి ఈ రాశులకు రాజయోగం.. సూర్య సంచారంతో పన్నెండు రాశులపై ప్రభావం.. వారు కోటీశ్వరులు కావడం ఖాయమా?
Sun Transit: 2026 మే నెలలో జరిగే ఈ మార్పు చాలా కీలకమైనది. మే 15 నుంచి జూన్ 15 వరకు సూర్యుడి రాశి మార్పు వల్ల 12 రాశులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎవరికి ధన లాభం? ఎవరికి ఇబ్బందులు? సూర్య గ్రహ దోష నివారణకు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, రాశి ఫలాలు ఇక్కడ చూడండి.
గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. మే 15, అనగా రేపు సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. మే 15 నుంచి జూన్ 15 దాకా సూర్యుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

2026 మే నెలలో జరిగే ఈ మార్పు చాలా కీలకమైనది. సూర్యుడు కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు; ఆత్మకు, ఆత్మవిశ్వాసానికి, తండ్రికి, అధికారానికి కారకుడు. నెలరోజుల పాటు సూర్య సంచారం కారణంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో చాలామంది జీవితాల్లో ఆకస్మిక మార్పులను చూస్తారు. ఆర్థిక లాభాలు, ఉద్యోగ మార్పులు, మానసిక ఒత్తిడి ఇలా రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రత్యేక గ్రహగమనం 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య సంచారం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సూర్యుడు బలంగా ఉన్నట్లయితే మనుషుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా ఏర్పడుతుంది. ఈ నెల రోజుల పాటు సూర్యుడి ప్రభావం కారణంగా కోపం, అహంకారం లాంటివి పెరిగే ప్రమాదం ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సూర్యుని మంత్రాలను పఠించడం, ఆరాధించడం, ధ్యానం చేయడం వంటివి ప్రశాంతతను కలిగిస్తాయి.
సూర్యుడిని ఎప్పుడు ఆరాధించాలి?
సూర్యుని అనుగ్రహం కలగాలంటే సూర్యోదయం తర్వాత మొదటి గంటలో చేసే సాధన మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించండి. రాగి పాత్రలో నీళ్లు తీసుకుని, ఎర్రటి పువ్వులు, అక్షతలు వేయండి. తూర్పు వైపు నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. “ఓం ఘృణి సూర్యాయ నమః” 21 సార్లు జపిస్తే మంచిది. సూర్యుని ఆరాధించిన తర్వాత బెల్లాన్ని దానంగా ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ద్వాదశ రాశులపై ప్రభావం
మేష రాశి
మేష రాశి వారికి కెరీర్ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. కుటుంబంలో కాస్త ఉద్రిక్తతలు చోటు చేసుకోవచ్చు. ఆదివారం నాడు గోధుమలు, బెల్లాన్ని దానం చేయడం వలన మంచి ఫలితాలను చూస్తారు.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఖర్చులు పెరగవచ్చు. పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధిత సమస్యలు ఉండొచ్చు. 108 సార్లు సూర్య మంత్రాన్ని పఠిస్తే మంచిది.
మిథున రాశి
ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కమ్యూనికేషన్ రంగాల వారికి బాగుంటుంది. మానసిక శాంతి కలగాలంటే రాగి పాత్రలో నీళ్లు తాగండి.
కర్కాటక రాశి
ఈ రాశి వారు బాకీలను వసూలు చేస్తారు. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదివారం ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను దానం చేస్తే మంచిది.
సింహ రాశి
ఈ రాశి వారికి ఈ సమయం కీలకమైనది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అహంకారానికి దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.
కన్య రాశి
ఈ రాశి వారు వ్యాపారంలో మంచి మార్పులను చూస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనాన్ని పాటించాలి. గోవులకు రొట్టెలు, బెల్లాన్ని సమర్పించండి.
తులా రాశి
తులా రాశి వారికి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం నాడు సూర్యుని ఆలయానికి వెళ్లి దీపారాధన చేస్తే మంచిది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఈ సమయంలో శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. హనుమాన్ చాలీసాను పఠిస్తే కూడా శుభ ఫలితాలను చూస్తారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేస్తారు. విదేశీ వ్యాపారులకు బాగుంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. సూర్యుడికి ఎర్రటి పూలతో పూజ చేయండి.
మకర రాశి
ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వెన్నెముక, ఎముకల సమస్యలు రావచ్చు. బెల్లం, నువ్వులను దానం చేస్తే మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో ఒడిదుడుకులను చూస్తారు. సామాజికంగా హోదా పెరుగుతుంది. ఆదివారం నాడు పేదలకు స్వీట్లను పంచితే దోషాలు తొలగిపోవచ్చు.
మీన రాశి
ఆర్థిక లాభాలు ఉన్నా ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆధ్యాత్మికత వైపు దృష్టి పెడతారు. రావి చెట్టు కింద దీపారాధన చేస్తే మనశ్శాంతి కలుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


