నవగ్రహాలకు అధిపతి, ప్రసన్నతకు ప్రాణప్రదాత అయిన సూర్య భగవానుడు తన సొంత రాశి అయిన సింహ రాశిని వీడి, కన్యారాశిలోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. 2026 సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 07:07 గంటలకు సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తాడు. అక్టోబర్ 17వ తేదీ వరకు నెల రోజుల పాటు సూర్య భగవానుడు ఇదే రాశిలో కొనసాగుతాడు.

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని 'సంక్రాంతి' అంటారు. ఈ క్రమంలో బుధుడి స్వక్షేత్రమైన కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశించే ఈ విశేష ఘట్టాన్ని 'కన్యా సంక్రాంతి' అని పిలుస్తారు. ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యుడు, బుధుల మధ్య మైత్రీ భావం ఉంటుంది. వేద జ్యోతిషంలో కన్యారాశి అనేది 'భూమి తత్వాన్ని' సూచిస్తుంది. ఇది క్రమశిక్షణ, నిస్వార్థ సేవ, తార్కిక ఆలోచన, పనిలో సామర్థ్యానికి ప్రతీక. మరోవైపు సూర్యుడు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ పటిమ మరియు పితృకారకుడు.
బుధుడి రాశిలో సూర్యుడి ప్రవేశంతో ఏర్పడే ఈ శుభ సంయోగం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ…. ఈ కన్యా సంక్రాంతి ప్రభావంతో ప్రత్యేకంగా 5 రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో వీరికి ఊహించని విజయాలు వరిస్తాయి.
1. సింహ రాశి :
సింహ రాశికి అధిపతి స్వయంగా సూర్య భగవానుడే. కన్యా సంక్రాంతి ప్రభావంతో ఈ రాశి జాతకులకు ఆత్మవిశ్వాసం, పట్టుదల విపరీతంగా పెరుగుతాయి.
- పరిపాలనా రంగాలు , ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఇంటర్వ్యూలలో పాల్గొనే వారికి విజయం లభిస్తుంది. ధైర్యంతో అడుగులు వేసి తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.
- వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు అత్యంత లాభదాయకంగా మారుతాయి. పట్టినదల్లా బంగారమై ఆర్థిక పురోగతి సాధిస్తారు. అదృష్టం సంపూర్ణంగా కలసివస్తుంది.
- ఆదివారం రోజున పేదలకు లేదా నిరుపేదలకు పండ్లను దానం చేయడం ద్వారా సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది.
2. కన్యా రాశి :
సూర్యుడి సంచారం కన్యారాశిలోనే జరుగుతుండటంతో ఈ రాశి వారికి సమాజంలోనూ, ఉద్యోగంలోనూ విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
- ఆఫీసులో మీ పనితనానికి ప్రశంసలు లభించడంతో పాటు హోదా పెరుగుతుంది. ఉద్యోగార్థులకు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించేందుకు సరైన మార్గాలు సుగమం అవుతాయి.
- మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభించి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తూ చిన్నపాటి విభేదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
- ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య భగవానుడికి ఆర్ఘ్యం (నీటిని సమర్పించడం) ఇవ్వడం వల్ల మరింత శుభ ఫలితాలు లభిస్తాయి.
3. వృశ్చిక రాశి :
{{/usCountry}}సూర్యుడి సంచారం కన్యారాశిలోనే జరుగుతుండటంతో ఈ రాశి వారికి సమాజంలోనూ, ఉద్యోగంలోనూ విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
- ఆఫీసులో మీ పనితనానికి ప్రశంసలు లభించడంతో పాటు హోదా పెరుగుతుంది. ఉద్యోగార్థులకు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించేందుకు సరైన మార్గాలు సుగమం అవుతాయి.
- మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభించి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తూ చిన్నపాటి విభేదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
- ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య భగవానుడికి ఆర్ఘ్యం (నీటిని సమర్పించడం) ఇవ్వడం వల్ల మరింత శుభ ఫలితాలు లభిస్తాయి.
3. వృశ్చిక రాశి :
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఈ సంచార కాలం ఒక 'స్వర్ణ యుగం' లాంటిదని చెప్పవచ్చు. సామాజికంగా మీ కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపిస్తాయి.
- దీర్ఘకాలంగా నిలిచిపోయిన రాబడి తిరిగి చేతికి అందుతుంది. తండ్రి వైపు నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు ఉంటాయి.
- అన్నాచెల్లెళ్లు, స్నేహితుల నుంచి సాయం అందుతుంది. సంతానం లేని వారికి లేదా పిల్లల పురోగతి కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వింటారు. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి.
- సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తూ నీటిని సమర్పించడం మంచిది.
4. ధనుస్సు రాశి :
ధనుస్సు రాశి జాతకులకు కన్యా సంక్రాంతి అపారమైన ఆనందాన్ని, శుభవార్తలను మోసుకొస్తుంది.
- స్థిరాస్తులైన భూమి…. ఇల్లు లేదా నూతన వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది.
- కార్యాలయంలో మీ స్థానం బలపడుతుంది. ఉన్నతాధికారుల నుంచి పెద్ద బాధ్యతలు లేదా ప్రమోషన్లు అందుకోవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇవి భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి.
- ఆదివారం పూట ఉపవాస దీక్ష ఆచరించడం వల్ల సూర్య గ్రహ దోషాలు తొలగి శుభం కలుగుతుంది.
5. మీన రాశి :
మీన రాశి వారికి సూర్యుని కన్యా రాశి సంచారం ఎంతో శ్రేష్ఠమైనది. వీరి అదృష్ట నక్షత్రం ప్రకాశించి ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది.
- మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. తండ్రి లేదా గురువుల మార్గదర్శకత్వం మీ ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుంది.
- సూర్యుడి అనుగ్రహంతో ధన యోగం కలగడమే కాకుండా పొదుపు చేయడంలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారం పుంజుకుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
- ఆదివారం రోజున ఆలయంలో లేదా పేదలకు బెల్లం దానం చేయడం ఎంతో శుభకరం.