ఈరోజే తొలి ఏకాదశి: ఈ వ్రతం చేస్తే పాప విముక్తి, వైకుంఠ ప్రాప్తి.. ఈ నియమాలు తప్పక పాటించండి!

హిందూ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన వ్రతాల్లో దేవశయని (తొలి) ఏకాదశి ఒకటి. ఈ రోజుతో చాతుర్మాస్యం ప్రారంభమవుతుందని, శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఉపవాసం ఉండి, శ్రీహరిని, మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల అక్షయ పుణ్యం.

Published on: Jul 25, 2026, 08:00:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే 'దేవశయని ఏకాదశి'కి ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈరోజే ఈ పవిత్ర వ్రతం ఆచరలించాలి. ఈ ఏకాదశితోనే చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరాసాగరంలో యోగనిద్రలోకి వెళ్తారని, ఈ సమయంలో సృష్టి నిర్వహణ బాధ్యతలను భోజన ప్రియుడైన ఆ పరమశివుడు చూసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి.

ఈరోజే తొలి ఏకాదశి: ఈ వ్రతం చేస్తే పాప విముక్తి, వైకుంఠ ప్రాప్తి.. ఈ నియమాలు తప్పక పాటించండి!
ఈరోజే తొలి ఏకాదశి: ఈ వ్రతం చేస్తే పాప విముక్తి, వైకుంఠ ప్రాప్తి.. ఈ నియమాలు తప్పక పాటించండి!

ఈ పవిత్రమైన రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఆచరించి, శ్రీహరిని పూజిస్తారు. కేవలం పూజలు మాత్రమే కాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుందని విశ్వాసం. నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే విష్ణుమూర్తితో పాటు మహాలక్ష్మి కటాక్షం కూడా సంపూర్ణంగా లభిస్తుంది.

దేవశయని/ తొలి ఏకాదశి తేదీ, ముహూర్తం

హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది జూలై 25, 2026 శనివారం నాడు దేవశయని ఏకాదశి వ్రతాన్ని ఆచరించనున్నారు. రేపు అంటే జూలై 26న ఉదయం నిర్ణీత సమయంలో ద్వాదశి పారణతో వ్రతాన్ని ముగిస్తారు. ఈ పర్వదినాన విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అర్చిస్తారు.

తొలి ఏకాదశి వ్రతంతో కలిగే ముఖ్య లాభాలు

పాపాల నుంచి విముక్తి: పురాణాల ప్రకారం, దేవశయని ఏకాదశి రోజున మనసారా ఉపవాసం ఉంటే, జీవితంలో తెలిసీ తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి. భగవంతుని అనుగ్రహంతో కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి.

మోక్ష ప్రాప్తి: ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు లౌకిక సుఖాలను అనుభవించిన తర్వాత అంతిమంగా వైకుంఠ ప్రాప్తిని పొందుతారని నమ్ముతారు. శ్రీహరి, లక్ష్మీదేవి సంయుక్త పూజ జీవితంలో అపారమైన విజయాలను తెచ్చిపెడుతుంది.

అక్షయ పుణ్య ఫలం: పద్మ పురాణం ప్రకారం, దేవశయని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ఏకంగా 88 వేల యజ్ఞాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. ఈ రోజు దానధర్మాలు చేయడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది.

ఇంటా బయటా ప్రశాంతత: ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. మనిషిలో సానుకూల ఆలోచనలు పెరిగి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

ఇంద్రియ నిగ్రహం: ఏకాదశి వ్రతం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక నిగ్రహాన్ని ఇస్తుంది. ఈ రోజు భగవన్నామ స్మరణ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది.

ఈ ఏకాదశి రోజు ఈ నియమాలు పాటించాలి

ఏకాదశి పర్వదినాన కొన్ని ప్రత్యేక నియమాలను విధిగా పాటించాలి.

ముఖ్యంగా ఈ రోజు తులసి చెట్లను తాకకూడదని పెద్దలు చెబుతుంటారు.

హిందూ ధర్మంలో తులసిని సాక్షాత్తూ లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఆ తల్లి కూడా ఏకాదశి వ్రతం ఆచరిస్తుందని, ఈ రోజు తులసిని తాకడం వల్ల ఆ వ్రత భంగం కలుగుతుందని భక్తుల నమ్మకం. కాబట్టి ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More