ఈరోజు వసంత పంచమి వేళ గజకేసరి రాజయోగం, మూడు రాశుల వారి జీవితంలో ఊహించని లాభాలు!

గ్రహాలు సంచారంలో మార్పు వస్తే, అది ద్వాదశ రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులను తీసుకు వస్తుంది. ఈరోజు వసంత పంచమి సందర్భంగా గజకేసరి రాజయోగం ఏర్పడడం విశేషం. గజకేసరి రాజయోగంతో 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు రానున్నాయి. వసంత పంచమితో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Jan 23, 2026, 10:01:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది ద్వాదశ రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులను తీసుకు వస్తుంది. ఈరోజు వసంత పంచమి సందర్భంగా గజకేసరి రాజయోగం ఏర్పడడం విశేషం. గజకేసరి రాజయోగంతో 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు రానున్నాయి. వసంత పంచమితో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వసంత పంచమి వేళ గజకేసరి రాజయోగంతో ఈ రాశుల వారికి ఊహించని లాభాలు (pinterest)
వసంత పంచమి వేళ గజకేసరి రాజయోగంతో ఈ రాశుల వారికి ఊహించని లాభాలు (pinterest)

వసంత పంచమి వేళ గజకేసరి రాజయోగం

ఈ యోగంతో కొన్ని రాశుల వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తెలివితేటలు ఎక్కువ అవుతాయి. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. కెరీర్‌లో కూడా మంచి మార్పులు ఉంటాయి. అలాగే సరస్వతి దేవి ప్రత్యేక అనుగ్రహాన్ని కూడా పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

వసంత పంచమి వేళ గజకేసరి రాజయోగంతో ఈ రాశుల వారికి ఊహించని లాభాలు కలగనున్నాయి

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. సక్సెస్‌ను అందుకుంటారు. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. భవిష్యత్తులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది.

కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. పని ప్రదేశంలో కూడా ఊహించని మార్పులు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు చేపడతారు. వ్యాపారంలో కూడా బాగా లాభాలు వస్తాయి. కెరీర్‌లో పురోగతిని చూస్తారు.

2.మిథున రాశి

మిథున రాశి వారికి ఇది శుభ సమయం. ఈరోజు వసంత పంచమి వేళ గజకేసరి రాజయోగం మిథున రాశి వారికి ఊహించని మార్పులను తీసుకు వస్తుంది. పాత స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.

అలాగే కొత్త ప్రాజెక్టులను చేపడతారు. కెరీర్‌లో కూడా మంచి మార్పులు ఉంటాయి. తల్లిదండ్రులతో కూడా ఎక్కువ సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగం కుదిరే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా భారీ లాభాలను పొందుతారు.

3.కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు గజకేసరి రాజయోగం శుభ ఫలితాలను తీసుకు రానుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కష్టాలు తొలగిపోతాయి. సక్సెస్‌ను అందుకుంటారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.

విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది. పని ప్రదేశంలో కూడా సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది. వరుసగా విజయాలు రావడంతో మీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు, వ్యాపారంలో కూడా అనేక అవకాశాలు మీ వద్దకు వస్తాయి. ఇలా మొత్తం మీద గజకేసరి రాజయోగంతో మీకు బాగా కలిసి వస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More