Shadashtaka Yogam: ఈరోజే సూర్య, గురువుల కలయికతో షడాష్టక యోగం.. మూడు రాశుల వారి జీవితంలో కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం షడాష్టక యోగాన్ని చాలా శక్తివంతమైన యోగంగా పేర్కొంటారు. డిసెంబర్ 15, సోమవారం ఉదయం 7:57కి సూర్యుడు, గురువు కలిసి షడాష్టక యోగాన్ని ఏర్పరిచారు. ఇది చాలా మంచి యోగం. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక లాభాలు కలుగుతాయి. మరి ఈ యోగం ఏ రాశులకు బాగా కలిసి రాబోతోంది?
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు తీసుకొస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారం కారణంగా శుభ యోగాలు ఏర్పడితే, ఒక్కోసారి అశుభ యోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 15, అంటే ఈ రోజు, గురువు–సూర్యుల కలయికతో షడాష్టక యోగం ఏర్పడుతోంది.
సూర్య, గురువుల కలయికతో షడాష్టక యోగం
సూర్య, గురువుల కలయికతో షడాష్టక యోగం
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం షడాష్టక యోగాన్ని చాలా శక్తివంతమైన యోగంగా పేర్కొంటారు. డిసెంబర్ 15, సోమవారం ఉదయం 7:57కి సూర్యుడు, గురువు కలిసి షడాష్టక యోగాన్ని ఏర్పరిచారు. ఇది చాలా మంచి యోగం. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక లాభాలు కలుగుతాయి. మరి ఈ యోగం ఏ రాశులకు బాగా కలిసి రాబోతోంది? అదృష్ట రాశులు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య, గురువుల షడాష్టక యోగం.. ఈ మూడు రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు
1.మిథున రాశి
మిథున రాశి వారికి ఈ షడాష్టక యోగం బాగా కలిసి రాబోతోంది. సూర్య, గురువుల కలయికతో ఈ యోగం ఏర్పడింది. ఇది కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలను తీసుకు రాబోతోంది. ఈ రాశి వారు కొత్త అవకాశాలను వెతుక్కుంటూ ఉన్నట్లయితే, అద్భుతమైన అవకాశాలు వారి చేతికి వస్తాయి.
పెద్ద సమస్యలన్నీ తొలగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ టాలెంట్‌ను అందరూ ప్రశంసిస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం.
2.సింహ రాశి
సింహ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. గురువు, సూర్యుల కలయిక ఈ రాశి వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం, ఎక్కువ లాభాలను పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
3.ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఈ రెండు గ్రహాల కలయిక ఈ రాశి వారికి చాలా మంచి చేయబోతోంది. సమస్యలు తొలగిపోతాయి, కష్టాలు తీరుతాయి. వ్యాపారస్తులు కూడా ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.