...
...
Next Story

Ugadi 2026 Karkataka Rasi Horoscope: కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉంటుంది? నెలల వారీగా రాశి ఫలాలు తెలుసుకోండి!

Ugadi 2026 Karkataka Rasi Horoscope: కొత్త తెలుగు నామ సంవత్సరం కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకు రాబోతోంది. కర్కాటక రాశి వారికి పెళ్లికాని వారికి పెళ్లయ్యే యోగం ఉంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. కొత్త తెలుగు సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Mar 12, 2026, 13:30:38 IST
Advertisement

ఇంకొన్ని రోజుల్లో పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త తెలుగు నామ సంవత్సరం కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకు రాబోతోంది. కర్కాటక రాశి వారికి కొత్త తెలుగు సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి:

Ugadi 2026 Karkataka Rasi Horoscope: కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉంటుంది? (pinterest)
Ugadi 2026 Karkataka Rasi Horoscope: కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉంటుంది? (pinterest)

ఆదాయం – 2, వ్యయం – 11, రాజపూజ్యం – 4, అవమానం – 7.

కర్కాటక రాశి వారికి కొత్త తెలుగు సంవత్సరం ఎలా ఉంటుంది?

గురు సంచారం

రాశి వారికి గురువు జూన్ ఒకటి దాకా వ్యయ స్థానంలో ఉండడం వలన సౌభాగ్యకరమైన ఫలితాలు అందుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ వృద్ధి కలుగుతుంది. జూన్ 2 నుంచి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే 2026 డిసెంబర్ 5 వరకు రాహువు, కేతువులు నవమ, తృతీయ స్థానంలో ఉండడంతో సామాన్య ఫలితాలు కలుగుతాయి. డిసెంబర్ 6వ తేదీ నుంచి అతి సామాన్య ఫలితాలు కలుగుతాయి.

గురు సంచారం వలన ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరిశోధన, వృత్తి నైపుణ్యాలను సాధిస్తారు. పదవులను కూడా పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా ఈ ఏడాది కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. జన్మ రాశిలో గురువు సంచారం ఇతరులకు ప్రోత్సాహకారిగా ఉంటూ స్ఫూర్తిని తీసుకొస్తుంది. నామినేటెడ్ పదవికి ఎంపిక అవుతారు. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ అహంకార స్వభావం, కొంచెం తొందరపడి మాట్లాడటం వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అప్పుడప్పుడు అతిగా ఆశపడితే ఇబ్బందులు వస్తాయి.

శని సంచారం

డిసెంబర్ నుంచి ఏడాది చివరి వరకు జన్మరాశిలో గురు, శుక్ర సంచారం, కేతు సంచారం వలన అధిక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం మంచిది. ఉదర, కాలేయ సంబంధిత సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. డిసెంబర్ దాకా రాహు, కేతువుల సంచారం వలన పెద్దగా కలిసి రాదు. ఏ పని మొదలుపెట్టినా కూడా మంచి ఫలితాలు ఉండవు. కర్కాటక రాశి వారికి సోమవారం, మంగళవారం, గురువారం బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్య 2. ఇక నెలవారీ ఫలితాలు కూడా చూద్దాం.

మార్చి 2026:

ధ్యానం, ఆధ్యాత్మికతపై దృష్టి పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. కష్టపడి, క్రమశిక్షణతో పని చేస్తే అనుకున్నవన్నీ సాధిస్తారు.

ఏప్రిల్ 2026:

పెళ్లికాని వారికి పెళ్లయ్యే యోగం ఉంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి కూడా అన్ని రంగాల్లో పురోగతి ఉంటుంది.

మే 2026:

నెల నుంచి ఆలోచన, వ్యక్తిత్వంలో మార్పు ఉంటుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారు విజయాన్ని అందుకుంటారు.

జూన్ 2026:

సంపద, శ్రేయస్సు, ఆరోగ్యంలో మంచి మార్పులు వస్తాయి. అత్యవసర సమయంలో ఇతరులకు సాయం చేస్తారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.

జులై 2026:

విద్యార్థులకు చదువులో బాగా కలిసి వస్తుంది. ప్రభుత్వ పథకాల ద్వారా ధనలాభం ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని చూస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు.

ఆగస్టు 2026:

ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. షేర్లు, పెట్టుబడులు బాగా కలిసొస్తాయి. విద్యార్థులు బాగా రాణిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా ఇది శుభసమయం.

సెప్టెంబర్ 2026:

కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఇది శుభ సమయం. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. విదేశీ విద్య, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అద్భుతమైన సమయం.

అక్టోబర్ 2026:

ఈ నెల మీ జీవన విధానం మెరుగుపడుతుంది. వ్యక్తిగత విలువలను పెంపొందించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పురోగతిని చూస్తారు.

నవంబర్ 2026:

ఏదో ఒక అభ్యాసం చేస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. విజయాలను అందుకుంటారు. ఈ నెల కూడా ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.

డిసెంబర్ 2026:

విద్య పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఇతరులను గౌరవిస్తారు. సంతానం నుంచి కూడా శుభవార్తలు వింటారు. ఇతరులను గౌరవించాలని కట్టుబడి ఉంటారు.

జనవరి 2027:

బంధుమిత్రులతో, కుటుంబంతో సంబంధాలను బలోపేతం చేసుకుంటారు. మానసిక స్థిరత్వం కనిపిస్తుంది. అందరి సపోర్ట్ మీకు ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

ఫిబ్రవరి 2027:

పని ఒత్తిడి, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కొనసాగించడంపై దృష్టి పెట్టాలి. వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరం ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఇతరులపై ప్రతిసారి కోపానికి గురవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. మాట తీరు బాగా ఉంచుకుంటే మంచిది.

మార్చి, ఏప్రిల్ 2027:

ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరికీ కలిసి వచ్చేలా చూస్తారు. కలలను నెరవేర్చుకుంటారు. నచ్చిన వాటిలో బాగా రాణిస్తారు. ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe