మరికొన్ని రోజుల్లో పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ కొత్త సంవత్సరం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈరోజు తులా రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది? ఈ రాశి వారికి కలిగే లాభాలు, నష్టాలు వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
తులా రాశి వారికి పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది?

పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. గురువు జూన్ నుంచి దశమ స్థానంలో సంచరించడం వలన అనుకూలంగా ఉంటుంది. అలాగే శని ఆరవ స్థానంలో, రాహువు డిసెంబర్ దాకా ఐదవ స్థానంలో, ఆ తర్వాత నాలుగవ స్థానంలో ఉంటాడు. కేతువు డిసెంబర్ దాకా లాభ స్థానంలో ఉంటాడు. ఇలా చూసినట్లయితే తులా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
లాభదాయక ఫలితాలు
ఉద్యోగస్తులకు ఈ ఏడాది బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్‌లు, పదవులు, ట్రాన్స్ఫర్లు వంటివి అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధిలో ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రతి ప్రయత్నంలో కూడా లాభదాయక ఫలితాలు పొందుతారు.
విజయాలు, పదవులు
స్త్రీలకు ఉద్యోగాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతాయి. ముఖ్యమైన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తులా రాశి వారికి ఉన్నత పదవులు కూడా కలిసొస్తాయి. రైతులకు లాభం ఉంటుంది. పంటకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. సినీ రంగం, మీడియా వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. విజయాలు ఉంటాయి, ధన లాభం ఉంటుంది.
పరిహారాలు
ఈ రాశి వారు లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సందర్శనతో మంచి ఫలితాలను పొందుతారు. కనకధార స్తోత్రం పఠిస్తే మంచిది. ఇక నెలవారీ ఫలితాలు కూడా చూద్దాం.
తులా రాశి వారికి మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు ఎలా ఉండబోతుంది?
మార్చి- ఏప్రిల్ 2026:
{{/usCountry}}ఈ రాశి వారు లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సందర్శనతో మంచి ఫలితాలను పొందుతారు. కనకధార స్తోత్రం పఠిస్తే మంచిది. ఇక నెలవారీ ఫలితాలు కూడా చూద్దాం.
తులా రాశి వారికి మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు ఎలా ఉండబోతుంది?
మార్చి- ఏప్రిల్ 2026:
{{/usCountry}}వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది. ఈ రాశి వారు అధికారులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు రావచ్చు.
మే 2026:
వృత్తి, ఉద్యోగ పరంగా ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మిత్రులతో వాదన వాదనలు జరుగుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ఇబ్బందులు రావచ్చు. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్థలు కలిగే అవకాశం ఉంది. భూ లాభం ఉంటుంది. స్త్రీలకు లాభం ఉంటుంది.
జూన్ 2026:
ఈ నెల ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ధన లాభం కలుగుతుంది. అయితే అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా కలుగుతాయి. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. కాబట్టి అన్ని పనులను జాగ్రత్తగా చేయాలి.
జూలై 2026:
ఈ నెల ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఇబ్బందులు కలగవచ్చు. బంధువులతో విరోధాలు కలిగే అవకాశం ఉంది. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది.
ఆగస్టు 2026:
ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగా లేదు. కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆందోళన ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. రుణదాతల ఒత్తిడి కూడా పెరుగుతుంది.
సెప్టెంబర్ 2026:
ఈ నెల కూడా ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు చికాకులు ఉండొచ్చు. తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఉండకపోవచ్చు. స్త్రీల విషయంలో కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటాయి. నింద పడే అవకాశం ఉంది.
అక్టోబర్ 2026:
ఈ నెలలో మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగానే ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల సపోర్ట్ ఉంటుంది. నూతన పరిచయాల కారణంగా అపవాదులు కలగవచ్చు.
నవంబర్ 2026:
ఈ నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధిని చూస్తారు. ధన లాభం కలుగుతుంది. నూతన స్త్రీ పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. స్త్రీలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
డిసెంబర్ 2026:
ఈ నెలలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ధన లాభం కూడా ఉండొచ్చు. ఈ మాసం ఈ రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది.
జనవరి 2027:
ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. అలసట, నిద్రలేమి వంటివి కలుగుతాయి. రుణబాధలు ఉంటాయి. ధన వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం ఏమాత్రం మంచిది కాదని గుర్తుంచుకోండి. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు, చికాకులు పెరగవచ్చు. అలసట, నిద్రలేమి ఉండొచ్చు. రుణబాధలు పెరుగుతాయి.
ఫిబ్రవరి 2027:
ఈ నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉండదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. స్త్రీలకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది.
మార్చి 2027 – ఏప్రిల్ 2027:
ఈ నెలలో మీకు అనుకూలంగా లేదు. ఇబ్బందులు ఉండొచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండవు. స్త్రీలకు చికాకులు, సమస్యలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్థలు కలిగే అవకాశం ఉంది.