Vastu Shastra Main Door : హిందూ సంప్రదాయంలో…నూ…. వాస్తు శాస్త్రంలోనూ ఇంటి ప్రధాన ద్వారానికి (మెయిన్ డోర్) అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంటికి కిటికీలు, ఇతర తలుపులు ఎన్ని ఉన్నా.. సానుకూల శక్తి ప్రవేశించేది మాత్రం ప్రధాన ద్వారం నుంచేనని పెద్దలు చెబుతుంటారు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే మార్గం కూడా ఇదే. అందుకే ఇంటిని నిర్మించేటప్పుడు మెయిన్ డోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ద్వారం వద్ద ఉండే పరిసరాలు మన ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు మరియు కుటుంబ ప్రశాంతతను ప్రభావితం చేస్తాయి. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు అస్సలు ఉండకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం….!
ప్రధాన ద్వారం ముందు ఇవి ఉంటే కష్టాలు తప్పవు. చాలామంది ఇంటి ముందు స్థలం ఉంది కదా అని రకరకాల వస్తువులను ఉంచుతుంటారు లేదా ఆ పక్కనే ఇళ్లు నిర్మిస్తుంటారు. కానీ కొన్ని అంశాలు తీవ్రమైన వాస్తు దోషాలకు దారితీస్తాయి.
- నేరుగా ఉండే రోడ్డు : ఇంటి ప్రధాన ద్వారానికి సరిగ్గా ఎదురుగా రోడ్డు ఉండటం మంచిది కాదు. వీధిపోటు లేదా నిటారుగా వచ్చే రహదారి ఉంటే జీవితంలో ఎదుగుదల ఆగిపోవడమే కాకుండా…. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
- నీరు లేదా బురద : ఇంటి గుమ్మం ముందు నీరు నిలవకూడదు. మురికి గుంటలు లేదా బురద ఉంటే ప్రతికూల శక్తులు ఇంటిని ఆవరిస్తాయి. ఇది కుటుంబ సభ్యుల పురోగతిని దెబ్బతీస్తుంది.
- మురుగు కాలువలు : ప్రవేశ ద్వారం ముందు మురుగు నీరు వెళ్లే కాలువ ఉండకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని, ఆర్థిక నష్టాలు సంభవిస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- విద్యుత్ స్తంభాలు : ఇంటి ప్రధాన ద్వారానికి అడ్డంగా కరెంట్ స్తంభం లేదా మరేదైనా స్తంభం ఉంటే అది అశుభం. ఇది ముఖ్యంగా ఇంట్లోని మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
- చెట్లు లేదా నీడ : మెయిన్ డోర్ ముందు భారీ వృక్షాలు ఉండకూడదు. ఆ చెట్టు నీడ నేరుగా ఇంటిపై పడటం కూడా వాస్తు దోషమే. దీనివల్ల కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం ఉంది.
- బావి లేదా ఆలయం : ఇంటి ముందు బావి ఉండటం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే గుడి గోపురం నీడ లేదా గుడికి సరిగ్గా ఎదురుగా ద్వారం ఉండటం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతాయి.
వాస్తు ప్రకారం…. ఇంటి ప్రధాన ద్వారం పరిమాణం కూడా చాలా ముఖ్యం. ఇంటి లోపల ఉండే తలుపుల కంటే ప్రధాన ద్వారం ఎప్పుడూ పెద్దదిగా ఉండాలి. ఒకవేళ మెయిన్ డోర్ చిన్నదిగా ఉండి, వెనుక తలుపులు పెద్దవిగా ఉంటే.. ఆ ఇంట్లో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. సంపాదించిన డబ్బు నిలవదు, ఆర్థిక అస్థిరత ఏర్పడుతుంది.
సరైన దిశ ఏది….?
{{/usCountry}}వాస్తు ప్రకారం…. ఇంటి ప్రధాన ద్వారం పరిమాణం కూడా చాలా ముఖ్యం. ఇంటి లోపల ఉండే తలుపుల కంటే ప్రధాన ద్వారం ఎప్పుడూ పెద్దదిగా ఉండాలి. ఒకవేళ మెయిన్ డోర్ చిన్నదిగా ఉండి, వెనుక తలుపులు పెద్దవిగా ఉంటే.. ఆ ఇంట్లో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. సంపాదించిన డబ్బు నిలవదు, ఆర్థిక అస్థిరత ఏర్పడుతుంది.
సరైన దిశ ఏది….?
{{/usCountry}}వాస్తు శాస్త్రం ప్రకారం….. ఇంటికి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉండటం అత్యంత శ్రేష్ఠం. ఉత్తర దిశ కుబేర స్థానం కాబట్టి ఐశ్వర్యం లభిస్తుంది. ఒకవేళ అది కుదరకపోతే తూర్పు లేదా ఈశాన్య (ఈశాన్యం) దిశల్లో ద్వారం ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ దిశల నుంచి వచ్చే గాలి, వెలుతురు ఇంటికి శుభ ఫలితాలను ఇస్తాయి.
మీరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నా లేదా పాత ఇంట్లో నివసిస్తున్నా.. ప్రధాన ద్వారం ముందు ఎటువంటి అవరోధాలు లేకుండా చూసుకోవడం ద్వారా ఇంట్లో సుఖశాంతులను పెంపొందించుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.