శుక్రుడి సంచారంతో ఈ రాశులకు మహర్దశ.. ఆర్థిక లాభాలు, సంతోషం.. 12 రాశులకు ఎలా ఉంటుందంటే?

శుక్రుడి ప్రత్యక్ష సంచారం నవంబర్ 14 నుంచి 12 రాశుల వారిపై ప్రభావం చూపనుంది. జ్యోతిష్య అంచనాల ప్రకారం, కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార పురోగతి, ప్రేమ జీవితంలో సంతోషం కలిగే సూచనలు ఉన్నాయి.  

Published on: Oct 14, 2026, 14:00:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకొస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు కనిపిస్తే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శుక్రుడి సంచారంతో ఈ రాశులకు మహర్దశ.. ఆర్థిక లాభాలు, సంతోషం.. 12 రాశులకు ఎలా ఉంటుందంటే? (AI)
శుక్రుడి సంచారంతో ఈ రాశులకు మహర్దశ.. ఆర్థిక లాభాలు, సంతోషం.. 12 రాశులకు ఎలా ఉంటుందంటే? (AI)

శుక్రుడు కన్యా రాశిలో నేరుగా సంచారం చేస్తాడు. నవంబర్ 14 నుంచి శుక్రుడు ప్రత్యక్ష సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక రకాల లాభాలు కలగబోతున్నాయి. అదృష్ట రాశులు ఎవరు? ఇప్పుడు చూద్దాం.

శుక్రుడి ప్రత్యక్ష సంచారం 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ రాశికి ఎలా ఉంటుంది?

మేష రాశి: మేష రాశి వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే, వ్యాపారస్తులు కాస్త సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి: వృషభ రాశి వారికి శుక్రుడి ప్రత్యక్ష సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. భాగస్వామితో సంతోషంగా ఉండొచ్చు. విద్యార్థులకు కూడా ఇదే శుభ సమయం.

మిథున రాశి: మిథున రాశి వారికి శుక్రుడు నేరుగా సంచరించడంతో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రేమ జీవితంలో సంతోషం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. చిన్న చిన్న ట్రిప్పులు వేస్తారు.

సింహ రాశి: సింహ రాశి వారికి శుక్రుడి ప్రత్యక్ష సంచారం ఆర్థికపరంగా లాభాలను అందిస్తుంది. ఉద్యోగస్తులు సహనంతో పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి.

కన్యా రాశి: కన్యా రాశి వారికి ఇది మంచి సమయం. ఈ సమయంలో అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది.

తులా రాశి: తులా రాశి వారికి శుక్రుడి ప్రత్యక్ష సంచారం బాగా కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆశతో వ్యవహరించాలి.

వృశ్చిక రాశి: వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. స్నేహితుల సపోర్ట్ అందుకుంటారు. పెళ్లయిన వారికి కూడా సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా కాస్త రిలీఫ్ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు.

మకర రాశి: మకర రాశి వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. పని ప్రదేశంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. సంతోషం రెట్టింపు అవుతుంది.

కుంభ రాశి: కుంభ రాశి వారికి శుక్రుడు నేరుగా సంచరించడంతో అద్భుతమైన లాభాలు ఉంటాయి. పురోగతిని చూస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.

మీన రాశి: మీన రాశి వారికి శుక్రుడు నేరుగా సంచరించడంతో బాగుంటుంది. అపార్థాలు తొలగిపోతాయి. సంతోషం రెట్టింపు అవుతుంది. సహనం పెరుగుతుంది. వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More