ఆడపిల్లల తల్లిదండ్రులు ఎందుకు అదృష్టవంతులు? కూతురు పుడితే తండ్రి అదృష్టం మారిపోతుందా? శాస్త్రాలు ఏమంటున్నాయి?

ఆడపిల్లలు జన్మించిన కుటుంబాలు ఎంతో అదృష్టవంతమైనవని శాస్త్రాలు చెబుతున్నాయి. కుమార్తెలు పుట్టడం వెనుక ఉన్న జ్యోతిష్య కారణాలు, వారి వల్ల కలిగే లక్ష్మీ కటాక్షం గురించి ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jun 5, 2026, 09:30:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులని అంటారు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలా మంచిదని కూడా చెబుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే ఆడపిల్లలను సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అడుగు పెట్టిందని ఎంతగానో సంతోషిస్తారు. అయితే, నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులా? ఆడపిల్లలు పుడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టేనా? దీని గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం.

ఆడపిల్లల తల్లిదండ్రులు ఎందుకు అదృష్టవంతులు? కూతురు పుడితే తండ్రి అదృష్టం మారిపోతుందా? శాస్త్రాలు ఏమంటున్నాయి? (pinterest)
ఆడపిల్లల తల్లిదండ్రులు ఎందుకు అదృష్టవంతులు? కూతురు పుడితే తండ్రి అదృష్టం మారిపోతుందా? శాస్త్రాలు ఏమంటున్నాయి? (pinterest)

ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే, అది కేవలం జీవసంబంధమైన కారణాల వల్ల మాత్రమే కాదు. ఆధ్యాత్మిక, జ్యోతిష్య రహస్యాలు కూడా దాని వెనుక దాగి ఉన్నాయని నమ్ముతారు.

ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు

శాస్త్రాలు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎందుకు అదృష్టవంతులో కూడా చెబుతున్నాయి. జ్యోతిష్యం ప్రకారం, ఒక ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో సానుకూల మార్పులు మొదలవుతాయి. తండ్రి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఆడపిల్ల పుట్టాక తండ్రి కెరీర్‌లో కూడా మంచి ఎదుగుదల ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల అడుగుపెడుతుందో, ఆ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. ఆమె తనతో పాటు విపరీతమైన అదృష్టాన్ని కూడా మోసుకొస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

చంద్ర, శుక్ర గ్రహాల బలం

ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో, ఆ ఇంటి యజమాని జాతకంలో శుక్రుడు, చంద్రుడి స్థానాలు దృఢంగా మారుతాయని నమ్మకం. శుక్ర గ్రహం డబ్బు, సంతోషం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. ఇక చంద్రుడు మనశ్శాంతికి ప్రతీక. కూతురు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల జీవితంలో ఎంతో ప్రశాంతత ఉంటుంది. అలాగే కొత్త ఆస్తులు కలిసి రావడానికి కూడా ఈ గ్రహాల అనుకూలతే ప్రధాన కారణం అని చెప్పొచ్చు.

కన్యాదానం ఎంతో పుణ్యం

కన్యాదానం మహాపుణ్యం. ఏడు తరాలకు మోక్షం లభిస్తుందని చెబుతారు. హిందూ ధర్మంలో అన్ని దానాల కంటే కన్యాదానం చాలా పవిత్రమైనది, శ్రేష్ఠమైనది. ఈ అరుదైన అదృష్టం కేవలం ఆడపిల్లల తల్లిదండ్రులకే దక్కుతుంది. పెళ్లి చేసేటప్పుడు కూతురిని ఇంకొకరికి దానంగా ఇవ్వడం వలన ఆ కుటుంబంలోని ఏడు తరాల పితృదేవతలకు మోక్షం కలుగుతుందని చెబుతారు. ఈ విషయం గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొనబడింది. అలాగే వంద యజ్ఞాలు చేసిన ఫలితం కూడా దక్కుతుందని నమ్మకం.

ఆడపిల్లలు రెండు అదృష్ట దీపాలు

మగ పిల్లలు వంశాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఆడపిల్లలు రెండు వంశాల కీర్తి, ప్రతిష్ఠలను మరింత పెంచుతారు. అలాగే వారు పుట్టిన ఇంట్లో సంతోషాలను నింపుతారు. పెళ్లి అయ్యాక అత్తింట్లోకి కూడా అదృష్టాన్ని తీసుకొస్తారు. అందుకే ఆడపిల్లలను రెండు కుటుంబాలకు అదృష్ట దీపాలు అని అంటారు. అలాగే కూతుర్లు ఉన్న ఇంట్లో ప్రతికూల శక్తి ఉండదని నమ్ముతారు. అక్కడ ఎప్పుడూ దైవిక శక్తి ప్రవహిస్తుందని చెబుతారు. ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలను గౌరవించి, ప్రేమిస్తారో ఆ ఇంట్లో దేవతలు నివసిస్తారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More