తెలంగాణ రాజకీయాలు దిల్లీ వేదికగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ముఖ్యనేతల మధ్య వరుసగా జరిగిన భేటీల అనంతరం సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు అధిష్ఠానం సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మంగళ, బుధవారాల్లో ఢిల్లీలోని ఇందిరా భవన్ తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్యనేతల భేటీల కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ప్రత్యేకంగా సమావేశమై మంత్రివర్గంలో క్రమశిక్షణ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని గట్టిగా ఒత్తిడి తెచ్చారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక, పీసీసీ చీఫ్ నివేదికలను సైతం అధిష్ఠానానికి అందజేశారు.
మరోవైపు మంత్రి కొండా సురేఖ కూడా ఖర్గేతో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయి తన వివరణ ఇచ్చుకున్నారు. తనపై పార్టీలో అంతర్గతంగా కుట్ర జరుగుతోందని పేర్కొంటూ ఒక నివేదికను సమర్పించారు. కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు ఆమె ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిసింది.
కేవలం మంత్రి కొండా సురేఖపైనే కాకుండా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డిపై కూడా చర్యలకు అధిష్ఠానం అంగీకరించినట్లుగా తెలుస్తోంది. 2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొండా సురేఖ తీరు పలుమార్లు వివాదాస్పదమైనా ఈసారి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చర్యల విషయంలో తగ్గేదేలేదన్నట్లు వ్యవహరించారు.
హైకమాండ్ నుంచి అధికారికంగా ఆదేశాలు లేదా లేఖ వెలువడిన వెంటనే తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా గవర్నర్‌కు సిఫార్సు లేఖ పంపాల్సి ఉంటుంది. గురువారం రోజున ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
{{/usCountry}}హైకమాండ్ నుంచి అధికారికంగా ఆదేశాలు లేదా లేఖ వెలువడిన వెంటనే తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా గవర్నర్‌కు సిఫార్సు లేఖ పంపాల్సి ఉంటుంది. గురువారం రోజున ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
{{/usCountry}}ఇప్పటికే కొండా సురేఖ తన స్వరం మార్చారు. మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడిన మాటలు మంత్రివర్గం నుంచి తొలగింపు చర్యలు మరింతం బలం చేకూరుస్తున్నాయి. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని పేర్కొన్నారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి.. పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఎలా అంటారని ప్రశ్నించారు. పార్టీలో ఇతరులపై కూడా ఆరోపణలు వచ్చాయని, వారిపైచర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కొండా సురేఖ అడిగారు.