దసరా పండుగ వేళ సింగరేణి బొగ్గు గని కార్మికులకు యాజమాన్యం శుభవార్త అందించింది. అక్టోబర్ 20న రానున్న దసరా (విజయదశమి) వేడుకలను పురస్కరించుకుని కార్మికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "దసరా పండుగ అడ్వాన్స్" చెల్లింపునకు సంబంధించి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీ గనులు, వివిధ విభాగాల ప్రతినిధులకు ఈ మేరకు సర్క్యులర్ పంపింది.
ఎంత జమ చేస్తారంటే..?

ఈ నిర్ణయం ప్రకారం, సింగరేణిలో పనిచేస్తున్న అర్హులైన రెగ్యులర్ ఎన్‌సీడబ్ల్యూఏ (NCWA) ఉద్యోగులతో పాటు మైన్స్ యాక్ట్ కింద లీవ్‌కు అర్హత సాధించిన ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున పండుగ అడ్వాన్స్ అందనుంది. అదేవిధంగా…. మైన్స్ యాక్ట్ ప్రకారం ఇంకా లీవ్ అర్హత సాధించని ఇతర తాత్కాలిక కార్మికులు, ట్రెయినీ ఉద్యోగులకు రూ.12,500 చొప్పున అడ్వాన్స్ చెల్లించనున్నారు.
కార్మికులు పండుగ అవసరాలను సమర్థవంతంగా తీర్చుకునేందుకు వీలుగా, అక్టోబర్ 15వ తేదీనే ఈ అడ్వాన్స్ మొత్తాన్ని నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ అడ్వాన్స్ మొత్తాన్ని కార్మికుల నుంచి 10 సమాన వాయిదాలలో రికవరీ చేయనున్నారు. నవంబర్ 2026 నెల జీతాల నుంచి (డిసెంబర్ 2026లో చెల్లించే జీతాలు) ఈ వాయిదాల కోత ప్రారంభమవుతుంది. అయితే పండుగ అడ్వాన్స్ చెల్లింపుల విషయంలో కొన్ని కీలక నిబంధనలను కూడా యాజమాన్యం విధించింది.
అడ్వాన్స్ చెల్లించే నాటికే రిటైర్మెంట్ కాబోతున్న లేదా వైద్యపరంగా అన్‌ఫిట్‌గా ప్రకటించి ఉద్యోగం ముగియనున్న ఉద్యోగులకు ఈ పండుగ అడ్వాన్స్ వర్తించదని పేర్కొంది. ఒకవేళ ఉద్యోగుల సర్వీసు 10 నెలల కంటే తక్కువగా మిగిలి ఉంటే…. వారు రిటైర్ అయ్యే తేదీ కంటే ముందే ఈ అడ్వాన్స్ మొత్తాన్ని పూర్తిగా రికవరీ చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
గత ఏడాది పండుగ అడ్వాన్సు తీసుకుని, దానికి సంబంధించిన బకాయిలను ఇంకా పూర్తిగా చెల్లించని ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అడ్వాన్స్ అందదు. పాత బాకీలను మినహాయించిన తర్వాత మిగిలిన బకాయి మొత్తాన్ని మాత్రమే సదరు ఉద్యోగులకు చెల్లిస్తారని… అధికారులు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. పండుగ వేళ అడ్వాన్స్ నగదు జమ కానుండటంతో సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
{{/usCountry}}గత ఏడాది పండుగ అడ్వాన్సు తీసుకుని, దానికి సంబంధించిన బకాయిలను ఇంకా పూర్తిగా చెల్లించని ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అడ్వాన్స్ అందదు. పాత బాకీలను మినహాయించిన తర్వాత మిగిలిన బకాయి మొత్తాన్ని మాత్రమే సదరు ఉద్యోగులకు చెల్లిస్తారని… అధికారులు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. పండుగ వేళ అడ్వాన్స్ నగదు జమ కానుండటంతో సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
{{/usCountry}}