దసరా పండుగ సెలవులు, వారాంతం (వీకెండ్) ఒకేసారి రావడంతో హైదరాబాద్ నగరం నుంచి సొంత ఊళ్లకు బయలుదేరిన ప్రయాణికులతో రహదారులు కిక్కిరిసిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని జాతీయ రహదారి 65 (హైదరాబాద్ - విజయవాడ)పై వాహనాల రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ వైపు నుంచి విజయవాడ వైపు ప్రయాణించే వాహనాల రాకపోకలు నెమ్మదించడంతో ప్రయాణికులు…. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఈ భారీ ట్రాఫిక్ జామ్‌కు కేవలం వాహనాల సంఖ్య పెరగడమే కాకుండా, టోల్‌ప్లాజా వద్ద ఎదురవుతున్న సాంకేతిక లోపాలు కూడా ప్రధాన కారణమయ్యాయి. అనేక వాహనాల్లో ఫాస్టాగ్ బ్యాలెన్స్ లేకపోవడం, కొన్ని చోట్ల ఫాస్టాగ్ స్కేనర్లు సరిగ్గా పనిచేయక సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టోల్ గేట్ల వద్ద ఒక్కో వాహనం దాటడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా టోల్ ప్లాజా ముందు వరుసగా వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల కొద్దీ జామయ్యాయి.
ఇక ఈ హైవేపై ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు కూడా ఇబ్బందికరంగా మారాయి. చాలా చోట్ల పనులు ఉండటంతో… వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి.
ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల మళ్లింపు…
రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోవడంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు తక్షణ ఉపశమన చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, సూర్యాపేట వైపు వెళ్లే వాహనాల తాకిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. లక్కారం గ్రామం వద్ద నుంచి వలిగొండ మీదుగా చిట్యాల చేరుకునేలా వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
ప్రయాణికులు, వాహనదారులు తొందరపడకుండా పోలీసు సిబ్బంది సూచనలను పాటించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా టోల్‌ప్లాజాల వద్ద సమయం వృథా కాకుండా ఉండటానికి ముందస్తుగానే ఫాస్టాగ్ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలని…. వీలైనంత వరకు వేగంగా టోల్ గేట్లను దాటేందుకు సహకరించాలని కోరారు.
బస్టాండ్లలో రద్దీ…
పండగ ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ లో రద్దీ భారీగా పెరిగింది. ఇవాళ, రేపు భారీగా ప్రయాణాలు ఉంటాయని ఆర్టీసీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
{{/usCountry}}పండగ ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ లో రద్దీ భారీగా పెరిగింది. ఇవాళ, రేపు భారీగా ప్రయాణాలు ఉంటాయని ఆర్టీసీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
{{/usCountry}}ఇక ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రూట్ లోనూ రద్దీ క్రమంగా పెరుగుతోంది. వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. భువనగిరి సమీపంలోని టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది.